EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgకానీ, వైసీపీలో ఇలాంటి భ‌యం, ఆవేద‌న‌, ఆందోళ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. నేను ఒక్క‌డినే పార్టీని బ‌లోపేతం చేశాను. నేను లేక‌పోతే.. పార్టీ లేదు.. అనే ధోర‌ణి వైసీపీ అధినేత‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ``మా నాయ‌కుడి వైఖ‌రి మ‌మ్మ‌ల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆయ‌న మ‌న‌సులో ఏముందో చెబితే.. దాని ప్ర‌కారం న‌డుచుకుంటాం క‌దా?`` అనేవారుపెరుగుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. అస‌లు పార్టీ విధానం ఏంటి? అనే ప్ర‌శ్న తెర‌మీద‌కి రావ‌డ‌మే. కేంద్రంలోని బీజేపీతో స‌ఖ్య‌త‌గా ఉన్నారో.. లేక రJagan Ysrcp{#}tippu;Bharatiya Janata Party;District;MLA;YCP;Reddy;Sultan;Partyవైసీపీలో సీనియ‌ర్ల‌కు ఇంత అవ‌మాన‌మా.. జ‌గ‌న్‌పై గుస్సా...!వైసీపీలో సీనియ‌ర్ల‌కు ఇంత అవ‌మాన‌మా.. జ‌గ‌న్‌పై గుస్సా...!Jagan Ysrcp{#}tippu;Bharatiya Janata Party;District;MLA;YCP;Reddy;Sultan;PartyWed, 04 Aug 2021 13:06:00 GMTపార్టీ అయినా.. సీనియ‌ర్ల‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇస్తాయి. వారి సేవ‌ల‌ను వినియోగించుకునే విష యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఆచితూచి అడుగులు వేస్తుంటాయి. ఒక‌వైపు.. ఇతర అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూనే.. సీనియ‌ర్ల వాద‌న‌కు, వారి డిమాండ్ల‌కు కూడా ప్రాధాన్యం ఇస్తుంటాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. సీనియ‌ర్లు.. పార్టీని అన్ని రూపాల్లోనూ ముందుండి న‌డిపిస్తారు క‌నుక‌. ఏ ఒక్క సీనియ‌ర్‌ను త‌క్కువ చేసి చూపినా.. ఎవ‌రిని ప‌క్క‌న పెట్టినా.. అంతిమంగా పార్టీపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. పార్టీలు భావిస్తుంటాయి.

కానీ, వైసీపీలో ఇలాంటి భ‌యం, ఆవేద‌న‌, ఆందోళ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. నేను ఒక్క‌డినే పార్టీని బ‌లోపేతం చేశాను. నేను లేక‌పోతే.. పార్టీ లేదు.. అనే ధోర‌ణి వైసీపీ అధినేత‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ``మా నాయ‌కుడి వైఖ‌రి మ‌మ్మ‌ల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆయ‌న మ‌న‌సులో ఏముందో చెబితే.. దాని ప్ర‌కారం న‌డుచుకుంటాం క‌దా?`` అనేవారుపెరుగుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. అస‌లు పార్టీ విధానం ఏంటి? అనే ప్ర‌శ్న తెర‌మీద‌కి రావ‌డ‌మే. కేంద్రంలోని బీజేపీతో స‌ఖ్య‌త‌గా ఉన్నారో.. లేక రాష్ట్రంలోని బీజేపీతో రాసుకు పూసుకు తిరుగుతున్నారో.. అర్ధం కావడం లేద‌న్న ది.. సీనియ‌ర్ల మాట‌.

``రాష్ట్ర బీజేపీ నేత‌లు మ‌మ్మ‌ల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ విష‌యంలో మేం కూడా దూకుడుగానే వ్య‌వ‌హ రించాలి క‌దా?  కానీ, మా పార్టీ అధినేత వైఖ‌రి మాత్రం వేరేగా ఉంది. ఇది పైకి చెప్ప‌డం లేదు. దీంతో మేం నియోజ‌క‌వ‌ర్గాల్లో అభాసు పాల‌వుతున్నాం`` అనేది సీనియ‌ర్ల మాట‌. తాజాగా క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఉదంతంలో సీనియ‌ర్లు బాగానే హ‌ర్ట‌య్యారు. రాచ‌మ‌ల్లుకు.. బీజేపీ నాయ‌కుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డికి.. టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు విష‌యంలో ఆరు మాసాలుగా వివాదం నెల‌కొంది. సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చేస్తాన‌ని రాచ‌మ‌ల్లు.. ప్ర‌తిజ్ఞ కూడా చేశారు.

దీనికి సంబంధించి నెల రొజుల కింద‌ట ఆయ‌న భూమి పూజ‌కూడా పూర్తి చేశారు. దీంతో బీజేపీ నేత‌లు తీవ్ర‌స్తాయిలో ఫైర‌య్యారు. వాస్త‌వానికి అధికారంలో ఉన్న పార్టీ క‌నుక‌.. త‌న మాటే చెల్లుబాటు అవుతుంద‌ని రాచ‌మ‌ల్లు భావించి ఉంటారు. కానీ, అనూహ్యంగా అస‌లు విగ్ర‌హం ఏర్పాటు చేసేందుకు ప‌ర్మిష‌న్ లేద‌ని.. తాజాగా సొంత ప్ర‌భుత్వ‌మే ప్ర‌క‌టించింది. దీంతో ప్ర‌త్య‌క్షంగా రాచ‌మ‌ల్లు.. త‌లెత్తుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇదే స‌మ‌యంలో అస‌లు ఏమీలేని బీజేపీ.. త‌లెత్తుకుని.. ఘ‌న కార్యం సాధించామ‌ని చెప్పుకొనేందుకు అవ‌కాశం చిక్కింది.

ఈ ప‌రిణామం.. అధికార పార్టీలో తీవ్ర అసంతృప్తికిదారితీసింది. ఇదొక్క‌టే కాదు.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనూ రామ‌తీర్థం ఘ‌ట‌న విష‌యంలో వైసీపీ వ్య‌వ‌హ‌రించిన తీరు.. అక్క‌డి నాయ‌కుల‌కు కూడా మింగుడు ప‌డ‌లేదు. ఇలా మొత్తానికి సీనియ‌ర్లు ఒక‌టి త‌లిస్తే.. పార్టీ మ‌రొక‌టి త‌లిచి.. చేస్తున్న ప‌నుల‌తో తాము త‌లెత్తుకోలేక పోతున్నామ‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు.





టీడీపీలో క్లారిటీ.. టికెట్ ఆ నేత‌కే అని బాబు సంకేతాలు..!

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>