BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag99758956-074c-4a17-a326-8e269d6032f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag99758956-074c-4a17-a326-8e269d6032f5-415x250-IndiaHerald.jpg ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని ఉద్దండరాయినిపాలెంలో ద‌ళిత రైతుల‌కు ప్ర‌భుత్వం నోటీసులు జారీచేసింది. అమ్ముకున్న అసైన్డ్ భూములకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ ర‌ద్దు చేసింది. దీనిపై ప్ర‌భుత్వం జీవో 316 జారీచేసిందంటూ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఈ నోటీసుల‌ను జారీచేశారు. ఏపీ అసైన్డ్ చ‌ట్టం 1977ను ఉల్లంఘించార‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అసైన్డ్ భూములు బ‌దిలీ చేశార‌ని, దీనికి బ‌దులుగా కొనుగోలుదారుల‌కు ఇచ్చిన ప్లాట్స్ ఎందుకు ర‌ద్దుచేయ‌కూడ‌దో స‌మాధానం చెప్పాల‌ని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల‌ను అమ్మి రైతుtag{#}JAC;Amaravathi;Andhra Pradeshరాజ‌ధాని ద‌ళిత రైతుల‌కు నోటీసులురాజ‌ధాని ద‌ళిత రైతుల‌కు నోటీసులుtag{#}JAC;Amaravathi;Andhra PradeshWed, 04 Aug 2021 19:34:00 GMT

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని ఉద్దండరాయినిపాలెంలో ద‌ళిత రైతుల‌కు ప్ర‌భుత్వం నోటీసులు జారీచేసింది. అమ్ముకున్న అసైన్డ్ భూములకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ ర‌ద్దు చేసింది. దీనిపై ప్ర‌భుత్వం జీవో 316 జారీచేసిందంటూ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఈ నోటీసుల‌ను జారీచేశారు. ఏపీ అసైన్డ్ చ‌ట్టం 1977ను ఉల్లంఘించార‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అసైన్డ్ భూములు బ‌దిలీ చేశార‌ని, దీనికి బ‌దులుగా కొనుగోలుదారుల‌కు ఇచ్చిన ప్లాట్స్ ఎందుకు ర‌ద్దుచేయ‌కూడ‌దో స‌మాధానం చెప్పాల‌ని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల‌ను అమ్మి రైతులు సొమ్ము చేసుకోవ‌డంతో వాటిని కొనుగోలు చేసిన‌వారు ఆ భూముల‌ను ప్ర‌భుత్వానికి ఇచ్చారు.  దీనికి బ‌దులుగా వారికి వేరేచోట ప్ర‌భుత్వం స్థ‌లం కేటాయించింది. ఇప్పుడు ఆ స్థ‌లం తిరిగి ఎందుకు తీసుకోకూడ‌దో స‌మాధానం చెప్పాలంటోంది. ఉద్దండ‌రాయునిపాలెంలోని రైతులే కాద‌ని, రాజ‌ధాని ప‌రిధితో ఏళ్ల త‌ర‌బ‌డి సాగుచేసుకుంటున్న భూముల‌ను చాలామంది అమ్ముకున్నార‌ని ఇప్పుడు అక‌స్మాత్తుగా అది అసైన్డ్ భూమి అంటూ నోటీసులు ఇవ్వ‌డం స‌రైన చ‌ర్య కాదంటూ జేఏసీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.





సీమ ఎత్తిపోతల సందర్శన ఇప్పట్లో లేనట్లే...

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>