PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag63a4c012-0210-4fe6-9a8c-c7a278b17a8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag63a4c012-0210-4fe6-9a8c-c7a278b17a8a-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 4.67 కోట్ల రూపాయ‌ల‌ను న్యాయ‌వాదుల‌కు ఫీజుగా చెల్లించింది. ప్ర‌జ‌ల సొమ్మును ఉచితంగా ప‌ప్పు బెల్లాలు పంచిన‌ట్లు పంచ‌డానికి వారేమ‌న్నా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కోర్టుల్లో పోరాడారా? ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రిగేలా న్యాయ‌మూర్తుల నుంచి తీర్పేమైనా తెచ్చారా? అంటే ఏదీ లేదు. అమ‌రావ‌తి రైతుల‌కు వ్య‌తిరేకంగా వాదించేందుకు, ముఖ్య‌మంత్రి కేసులు వాదించేందుకు, ప్ర‌భుత్వం తాను తీసుకున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించుకోవ‌డానికి, కోర్టుల్లో వాద‌న‌లు వినిపించ‌డానికి ఢిల్లీ నుంచి భారీగా ఫీtag{#}Amaravathi;Delhi;Andhra Pradeshకోర్టు ఫీజుల కింద ప‌ప్పు బెల్లాల్లా ప్ర‌జాధ‌నం?కోర్టు ఫీజుల కింద ప‌ప్పు బెల్లాల్లా ప్ర‌జాధ‌నం?tag{#}Amaravathi;Delhi;Andhra PradeshWed, 04 Aug 2021 12:16:00 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 4.67 కోట్ల రూపాయ‌ల‌ను న్యాయ‌వాదుల‌కు ఫీజుగా చెల్లించింది. ప్ర‌జ‌ల సొమ్మును ఉచితంగా ప‌ప్పు బెల్లాలు పంచిన‌ట్లు పంచ‌డానికి వారేమ‌న్నా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కోర్టుల్లో పోరాడారా?  ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రిగేలా న్యాయ‌మూర్తుల నుంచి తీర్పేమైనా తెచ్చారా? అంటే ఏదీ లేదు. అమ‌రావ‌తి రైతుల‌కు వ్య‌తిరేకంగా వాదించేందుకు, ముఖ్య‌మంత్రి కేసులు వాదించేందుకు, ప్ర‌భుత్వం తాను తీసుకున్న ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించుకోవ‌డానికి, కోర్టుల్లో వాద‌న‌లు వినిపించ‌డానికి ఢిల్లీ నుంచి భారీగా ఫీజులు తీసుకునే న్యాయ‌వాదుల‌ను నియ‌మించుకుంటోంది. వారికి కోట్ల‌రూపాయ‌ల్లో ఫీజులు చెల్లిస్తోంది. తాజాగా రూ.4.67 కోట్ల‌ను ఫీజుగా చెల్లించాలంటూ నిధులు విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా ఏపీ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌నర్‌కు ఆదేశాలు కూడా జారీచేసింది. అయితే ఏ న్యాయ‌వాదుల‌కు ఎంతెంత చెల్లించాల‌నేది మాత్రం త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొన‌లేదు. వాటిని మాత్రం అత్యంత ర‌హ‌స్యంగా ఉంచింది.

సుప్రీంకోర్టులో వాదించేందుకు భారీ ఫీజులు
ఏపీ హైకోర్టులో వాదించే న్యాయ‌వాదుల‌కు ఫీజులు చెల్లించ‌డానికి విడిగా ప్ర‌భుత్వం జీవోలు జారీచేస్తోంది. ప్ర‌స్తుతం ఇచ్చిన జీవో అనేది ఢిల్లీలో సుప్రీంకోర్టులో వాదించే న్యాయ‌వాదుల కోసం ఉద్దేశించింది. ఇక్క‌డ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు హైకోర్టుల్లో వీగిపోతున్నాయి. వాటిని స‌వాల్‌చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తోంది. అయితే ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున సుప్రీంకోర్టులో వాదించేందుకు భారీ ఫీజులు తీసుకునే న్యాయ‌వాదుల‌ను మాట్లాడుతున్నారు. వీరంతా గంట‌ల్లెక్క‌న ఫీజులు వ‌సూలు చేసేవారే. అది కూడా ల‌క్ష‌ల రూపాయ‌ల్లో ఉంటుంది. రాజ‌ధాని అంశం అనే కాకుండా అన్నిర‌కాల అంశాల‌పై వీరంతా సుప్రీంకోర్టులో వాదించిన‌వారే. అయితే కోర్టులో తీర్పుల‌న్నీ ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ‌చ్చాయా అంటే అదీ లేదు. ప్ర‌భుత్వ‌మేమో మాకు అంతా ఇప్పుడే తెలిసింది.. పిటిష‌న్లు ప‌సంహ‌రించుకుంటున్నామంటోంది.

స‌ల‌హాదారులు స‌ల‌హాలివ్వ‌డంలేదు
పిటిష‌న్లు ఉప‌సంహ‌రించుకునే కేసుల్లో వాద‌న‌లు లేకుండా న్యాయ‌వాదుల‌కు ఫీజులు చెల్లించాల్సి వ‌స్తోంది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారులున్న‌ప్ప‌టికీ ఇటువంటివాటికి వారంతా ఎందుకు స‌ల‌హాలివ్వ‌డంలేదో ఇచ్చినా ముఖ్య‌మంత్రి విన‌డంలేదో వారికే తెలియాలి. వీరంతా ముఖ్య‌మంత్రి చెప్పిన‌మేర‌కే న‌డుచుకుంటుంటార‌ని ప్ర‌భుత్వ‌వ‌ర్గాలంటున్నాయి. కొన్ని పిటిష‌న్లు అయితే రాజ్యాంగ విరుద్ధంగా ఉంటున్నాయ‌ని ఈ స‌ల‌హాదారుల‌కు కూడా తెలుసు. కోర్టుల్లో ఇవి నిల‌బ‌డ‌వ‌ని కూడా తెలుసు. అయినా ముఖ్య‌మంత్రికి చెప్ప‌రు. చెప్పినా ఆయ‌న విన‌రు. కానీ కేసులు మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. న్యాయ‌వాదుల‌కు మాత్రం కోట్ల‌రూపాయ‌ల్లో ఫీజులు చెల్లించాల్సి వ‌స్తోంది. త‌మ సొమ్మేం పోయింది.. పోయేదంతా ప్ర‌జాధ‌న‌మేగా అనుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు. మ‌న‌సు కూడా బాధ‌ప‌డ‌దు.





శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>