కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. : మంత్రి కేటీఆర్
తెలంగాణలో 60 లక్షల పైచిలుకు కుటుంబ సభ్యులు కలిగి అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని వివరించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు కేటీఆర్ బీమా సాయం అందించారు. తెలంగాణ భవన్‌లో 80 మంది నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 లక్షల బీమా సాయం అందించి, వారిలో మనో ధైర్యాన్ని నింపారు. ఆ కుటుంబాలతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు.
తెలంగాణ భవన్‌కు వచ్చిన 80 మంది కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త, సోదరుడు, కుమారుడు.. వివిధ ప్రమాదాల్లో మరణించారని తెలిపారు. అలాంటి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆ కుటుంబాల స్థితిగతులను పార్టీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఇల్లు లేదు అని కొంతమంది.. పిల్లలు చిన్నవారు ఉన్నారు.. గురుకులాల్లో అడ్మిషన్స్ కల్పించాలని కోరారు. చదవుకున్న అమ్మాయిలు ఉన్నారు.. తమకేదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరారు.

చనిపోయిన తర్వాత పెన్షన్ రావట్లేదని తెలిపారు. అందరికీ అండగా ఉన్నాం అని. రాబోయే పదిహేను రోజుల్లో అడిగిన పనులు చేసిపెట్టే బాధ్యత తమదే అని కేటీఆర్ స్పష్టం చేశారు. 18 కోట్ల పైచిలుకు రూపాయాలను ఇన్సూరెన్స్ కడుతున్నామని చెప్పారు. 950 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. ఈ కుటుంబాల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ జనరల్ సెక్రటరీలతో పాటు ఎమ్మెల్యేలదే అని తెలిపారు.
అందరికి త్వరలోనే సాయం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మనందరం ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. పది రోజుల్లోనే పిలిచి.. సమస్యలను పరిష్కారిస్తామని కేటీఆర్ తెలిపారు.