PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amararaja-adalu-katha-idaataaa8cfeb2-cb90-4ced-bdac-852256c005d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amararaja-adalu-katha-idaataaa8cfeb2-cb90-4ced-bdac-852256c005d4-415x250-IndiaHerald.jpgజనవరిలో 54 పరిశ్రమలను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ చేయగా కొన్ని పరిశ్రమల్లో ఎక్కువ కాలుష్యం వస్తున్నట్టుగా తేలిందని, అందులో భాగంగా చిత్తూరులోని అమారరాజ, కడపలోని సిమెంటు పరిశ్రమలు, విశాఖ జిల్లాలోని ఫార్మా పరిశ్రమలకు షో కాజ్ నోటీసు జారీ చేశామని అటవీ శాఖ కార్యదర్శి జిఎస్ఆర్కెఆర్ విజయ్ కుమార్ అన్నారు. కాలుష్య నియంత్రణ కు వారికి రెండు నెలల సమయం ఇచ్చామని, అయినప్పటికీ మార్పు లేకపోవడంతో రెండో దఫా కూడా నోటీసు ఇచ్చామని అన్నారు. ఇప్పటికీ కాలుష్యాన్ని నియంత్రణ చేయక పోతే స్థానికులకు, అందులో పని చేసే వారిAmararaja Batteries;{#}Pond;Air;amar;Industries;Chennai;Joseph Vijay;pollution;local language;Hyderabad;Varsham;court;Aqua;Andhra Pradesh;Vishakapatnamఅమర 'రాజా' అసలు కథ ఇదట!అమర 'రాజా' అసలు కథ ఇదట!Amararaja Batteries;{#}Pond;Air;amar;Industries;Chennai;Joseph Vijay;pollution;local language;Hyderabad;Varsham;court;Aqua;Andhra Pradesh;VishakapatnamWed, 04 Aug 2021 12:38:49 GMTజనవరిలో 54 పరిశ్రమలను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ చేయగా కొన్ని పరిశ్రమల్లో ఎక్కువ కాలుష్యం వస్తున్నట్టుగా తేలిందని, అందులో భాగంగా చిత్తూరులోని అమారరాజ, కడపలోని సిమెంటు పరిశ్రమలు, విశాఖ జిల్లాలోని ఫార్మా పరిశ్రమలకు షో కాజ్ నోటీసు జారీ చేశామని అటవీ శాఖ కార్యదర్శి జిఎస్ఆర్కెఆర్ విజయ్ కుమార్ అన్నారు. కాలుష్య నియంత్రణ కు వారికి రెండు నెలల సమయం ఇచ్చామని, అయినప్పటికీ మార్పు లేకపోవడంతో రెండో దఫా కూడా నోటీసు ఇచ్చామని అన్నారు. ఇప్పటికీ కాలుష్యాన్ని నియంత్రణ చేయక పోతే స్థానికులకు, అందులో పని చేసే వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అమరరాజా బ్యాటరీస్ సంస్థకు ఉత్పత్తి నిలిపివేతకు ఉత్తర్వులు, ఈ ఏడాదిలో 64 పరిశ్రమలకు ఉత్పత్తి నిలిపివేత, మరో 54 పరిశ్రమల కు మూసివేత ఆదేశాలు ఇచ్చాము

హైకోర్టు  ఉత్తర్వుల మేరకు సాంకేతిక కమిటీని నియమించాం. అమరరాజా బ్యాటరీస్ నుంచి సీసం కలిసిన నీటిని మొక్కలు పెంచేందుకు వినియోగిస్తున్నారు. దీనివల్ల స్థానిక జంతుజాలనికి, మనుషులకు ప్రమాదకరం కాలుష్య నివారక ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ అలాంటిదేమి లేకుండా నిబంధనలు యధేచ్చగా ఉల్లఘించారు. రెండు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యపు నీరు మల్లెమడుగు రిజర్వాయర్ ఆ సమీపంలో ని మరో నీటి వనరుకు వెళ్తున్నాయి. వర్షం కురిసిన సమయంలో మరింతగా భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. మొక్కలు, జంతువుల ద్వారా మనుషుల్లోకి సీసం చేరిపోతోంది. పరిశ్రమ కు 4 -5 కిలోమీటర్ల పరిధిలోకి సీసం కలుషితం అయ్యిందని సాంకేతిక కమిటీ నిర్ధారించింది. అలాగే గాలి లోకి 137 మరల ద్వారా సీసపు ధూళిని వదిలేస్తున్నారు. ప్రతీ చోటా రెండు నమూనాలు సేకరించాం కాలుష్య నియంత్రణ మండలి లో ఒక చోట, హైదరాబాద్ లోని ఈపీటీఆర్ ఐ దగ్గర మరో నమూనాను పరీక్ష చేయించాం. పరిశ్రమ దగ్గర 700 రేట్ల మేర సీసపు పాళ్లు ఉన్నట్టు తేలింది.

మల్లె మడుగు రిజర్వాయర్ లో 0.3 మైక్రో గ్రామ్ ల సీసం ఉంది అంటే అనుమతించిన దానికంటే 200 శాతం ఎక్కువ ఉంది. నాయుడు చెరువు వద్ద 1100 శాతం ఎక్కువ ఉంది. ఫ్యాక్టరీ లో పని చేస్తున్న కొందరు శ్రామికుల రక్త నమూనాలు కూడా సేకరించాం. వారి నమునల్లో సీసం సాధారణం కంటే ఎక్కువ ఉంటే వారిని సీసం వెలువడని ప్రాంతాలకు తరలించాలి. ప్రతీ 6 నెలలకు వారి నమూనాలను పీసీబీకి ఇవ్వాలి. కానీ ఒక్కసారి కూడా సమర్పించలేదు. 500 మంది కంటే ఎక్కువ మందికి రక్తం లో సీసం 42 మైక్రో గ్రామ్ డేసి లీటర్ ఉంది. ఆ పరిశ్రమలో 20 ఏళ్లుగా సీసం కాలుష్యం బారిన పడుతున్నారు. అన్ని అంశాల్లోనూ నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. పూర్తిస్థాయిలో దీనిపై అధ్యయనం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఐఐటీ మద్రాస్ ద్వారా అధ్యయనం చేయిస్తున్నాం. మా సిబ్బంది, ఐఐటీ మద్రాస్ ప్రతినిధులను అమర్ రాజా ఫ్యాక్టరీ గేట్ వద్ద అడ్డుకున్నారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో  కేసు పెట్టాం. పొరపాట్లను సవరించుకుని ఉత్పత్తి చేసుకోవాలని సూచించాం. ఇక ఆ పరిశ్రమ అక్కడ కొనసాగేందుకు వీల్లేదు. మరో చోటకు తరలించాలని కోర్టును కోరాం. ఏ పరిశ్రమను మూసివేయాలన్న ఉద్దేశ్యం  ప్రభుత్వానికి లేదు. పర్యావరణానికి హాని జరక్కుండా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఉల్లంఘనలు సరి చేసుకోవాలని మాత్రమే అమరరాజ బ్యాటరీస్ కు సూచించాం అని చెప్పుకొచ్చారు.



అమర 'రాజా' అసలు కథ ఇదట!

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>