MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-film32bef7f7-b5cf-4db1-9738-50ea33f4b2c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-film32bef7f7-b5cf-4db1-9738-50ea33f4b2c3-415x250-IndiaHerald.jpgసైరా న‌ర‌సింహ రెడ్డి త‌రువాత చిరంజీవి న‌టిస్తున్న చిత్రం `ఆచార్య‌` .. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా విడుద‌ల తేదిపై స్ప‌ష్టత లేకుండా పోయింది. దీనికి కార‌ణం ఆ సినిమా విడుదల చేసే స‌మ‌యంలో ఇత‌ర భారీ సినిమాలు విడుద‌లకు సిద్ధంగా ఉండ‌డం. దీంతో డైల‌మాలో ఉన్న చిత్ర బృందానికి రిలీజ్ డేట్ స‌మ‌స్య తీరిపోయిన‌ట్టే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ద‌స‌రాకు విడుద‌ల చేద్దామ‌నుకుంటే అక్టోబ‌ర్ 13న మెగా ప‌వ‌ర్ స్టార్‌, జూనియ‌ర్ ఎన్‌టీఆర్ న‌టించిన `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా విడుద‌లacharya release date{#}Chiranjeevi;Pooja Hegde;Shiva;Makar Sakranti;sye-raa-narasimha-reddy;lord siva;Saira Narasimhareddy;Reddy;Chitram;Cinemaఅక్టోబ‌ర్ ఫ‌స్ట్ న ఆచార్య‌..?అక్టోబ‌ర్ ఫ‌స్ట్ న ఆచార్య‌..?acharya release date{#}Chiranjeevi;Pooja Hegde;Shiva;Makar Sakranti;sye-raa-narasimha-reddy;lord siva;Saira Narasimhareddy;Reddy;Chitram;CinemaWed, 04 Aug 2021 13:04:08 GMT సైరా న‌ర‌సింహ రెడ్డి త‌రువాత చిరంజీవి న‌టిస్తున్న చిత్రం `ఆచార్య‌` .. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా విడుద‌ల తేదిపై స్ప‌ష్టత లేకుండా పోయింది. దీనికి కార‌ణం ఆ సినిమా విడుదల చేసే స‌మ‌యంలో ఇత‌ర భారీ సినిమాలు విడుద‌లకు సిద్ధంగా ఉండ‌డం. దీంతో డైల‌మాలో ఉన్న చిత్ర బృందానికి రిలీజ్ డేట్ స‌మ‌స్య తీరిపోయిన‌ట్టే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ద‌స‌రాకు విడుద‌ల చేద్దామ‌నుకుంటే అక్టోబ‌ర్ 13న మెగా ప‌వ‌ర్ స్టార్‌, జూనియ‌ర్ ఎన్‌టీఆర్ న‌టించిన `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా విడుద‌ల కానుంది.

క్రిస్మస్, సంక్రాంతి బరిలో చాలా సినిమాలు పోటీగా ఉన్నాయి. దీంతో `ఆచార్య` పరిస్థితి ఏమిటి అన్న ప్ర‌శ్న‌లు కూడా బ‌లంగా వినిపించింది. అయితే కొన్ని రోజుల క్రితం దీపావ‌ళికి విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజాగా విశ్వ‌స‌నీయ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు `ఆర్ఆర్ఆర్‌` విడుద‌ల ముందే ద‌స‌రా సీజ‌న్ లోనే ఆచార్య ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని, అప్పుడే విడుద‌ల‌కు మూహూర్తాన్ని `ఆచార్య‌` టీమ్ ఫిక్స్ చేసిందని తెలుస్తోంది.

  అయితే అక్టోబ‌ర్ మొద‌టి రోజున లేదా సెప్టెంబ‌ర్ 30న కానీ `ఆచార్య‌` చిత్రాన్ని విడుద‌ల చేసే  అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీని వ‌ల్ల ఆర్ ఆర్ ఆర్ కంటే ముందుగానే సోలోగా థియేట‌ర్ల‌ను ఆక్రమించుకోవ‌చ్చు. పైగా అది ద‌స‌రా సీజ‌న్ కావ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఇష్ట‌ప‌డుతారు. ఒక‌వేళ సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ అయితే వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు అద‌నంగా షోలు వేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది.
 

 అక్టోబ‌ర్ 13న అంటే రెండు వారాల త‌రువాత జ‌క్క‌న్న సినిమా ఆర్ఆర్ఆర్ వ‌చ్చినా వంద వంద శాతం థియేట‌ర్ల‌లో విడుద‌ల అయ్యే అవ‌కాశం లేదు. ఎన్నో కొన్ని థియేట‌ర్లు ఆచార్య‌కు ఉంటాయి. అందుకోసం సెప్టెంబ‌ర్ 30 లేదా అక్టోబ‌ర్ 1న ఆచార్య‌ను విడుద‌ల చేసేందుకు ఆ సినిమా బృందం ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి ముందే రిలీజ్ డేట్ ప్ర‌కటించాల్సి ఉండేది. కానీ ప‌రిస్థితులు, ఇత‌ర సినిమాల వ్య‌వ‌హారం చూసి డేట్ ఫిక్స్ చేయాల‌నుకుంటున్న‌ట్టు స‌మాచారం. అయితే సినిమాకు సంబంధించి చ‌ర‌ణ్ - పూజా హెగ్డే ల మీద ఓ పాట చిత్రీక‌రించాల్సి ఉంది. చూడాలి విడుద‌ల తేది ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో ఆచార్య టీమ్‌.



టీడీపీలో క్లారిటీ.. టికెట్ ఆ నేత‌కే అని బాబు సంకేతాలు..!

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>