MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya87ae2bdf-4516-4b46-85ae-dbd48d52bb54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acharya87ae2bdf-4516-4b46-85ae-dbd48d52bb54-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఆచార్య అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివ మార్కుతో ఈ చిత్రం కూడా సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ గానే రూపొందుతోంది. 2018 ద్వితీయార్థంలో ఈ సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను ఎట్టకేలకు పూర్తి చేయబోతున్నారు. గత రెండు మూడేళ్లుగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతూనే ఉంది. "భరత్ అనే నేను" సినిమా హిట్ తర్వాత మెగాస్టార్ తో సినిమా చేయాలనే ఆశతో కొరటాల ఇతర ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. కానీ ఈ సినిమా తీసిAcharya; Koratala;{#}Shiva;lord siva;Darsakudu;Director;Coronavirus;kajal aggarwal;Chiranjeevi;koratala siva;Chitram;Cinema"ఆచార్య"ఎక్స్పీరియన్స్... దండం పెట్టేస్తున్న కొరటాల"ఆచార్య"ఎక్స్పీరియన్స్... దండం పెట్టేస్తున్న కొరటాలAcharya; Koratala;{#}Shiva;lord siva;Darsakudu;Director;Coronavirus;kajal aggarwal;Chiranjeevi;koratala siva;Chitram;CinemaWed, 04 Aug 2021 17:00:00 GMTప్రముఖ దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఆచార్య అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివ మార్కుతో ఈ చిత్రం కూడా సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ గానే రూపొందుతోంది. 2018 ద్వితీయార్థంలో ఈ సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను ఎట్టకేలకు పూర్తి చేయబోతున్నారు. గత రెండు మూడేళ్లుగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతూనే ఉంది. "భరత్ అనే నేను" సినిమా హిట్ తర్వాత మెగాస్టార్ తో సినిమా చేయాలనే ఆశతో కొరటాల ఇతర ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. కానీ ఈ సినిమా తీసిన టైంలో దాదాపు మూడు నాలుగు సినిమాలు చేసేయొచ్చు. సినిమా షూటింగ్ ఇంత ఆలస్యం కావడానికి కరోనా కారణమైనా, మరే ఇతర కారణమైనా కూడా కొరటాలకు భారీ నష్టమే అని చెప్పొచ్చు. 

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యిందని తాజా సమాచారం. కాగా ఈ సినిమా వల్ల ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారట. షెడ్యూల్ ఏమాత్రం అటూ ఇటూ కాకుండా పక్కా ప్లాన్ తోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాలని కొరటాల అనుకుంటున్నట్లు తెలుస్తోంది. "ఆచార్య" ఎఫెక్ట్ తో కొరటాల తన తదుపరి చిత్రాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ తో సినిమా అనే విషయం పక్కన పెడితే "ఆచార్య" మాత్రం కొరటాలను ముప్పు తిప్పలు పెట్టింది. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ ను తలచుకున్నప్పుడల్లా దండం పెట్టాల్సిన ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. మంచి హిట్ ట్రాక్ రికార్డు ఉన్న కొరటాలకు ఇంతకుముందు ఏ సినిమాను రూపొందించడానికి ఇంత సమయం పట్టలేదు. "ఆచార్య" లో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.





కాంగ్రెస్ పార్టీ లో భారీగా చేరికలు.

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>