EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp-vs-ysrcp431e0734-b3ba-418e-9345-0e9dcc728b31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/bjp-vs-ysrcp431e0734-b3ba-418e-9345-0e9dcc728b31-415x250-IndiaHerald.jpgఅప్పుల కుప్ప ఏపీ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూనే, కేంద్రం అప్పులు చేయడం లేదా అని సమర్థించుకుంటోంది. అయితే బీజేపీ మాత్రం ఏపీనే టార్గెట్ చేస్తోంది. ఏపీలో అప్పులు ఎక్కువైపోయాయంటూ బీజేపీ నేతలు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. 25వేల కోట్లు నిబంధనలు ఉల్లంఘించి తెచ్చారంటున్నారు. ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. bjp vs ysrcp{#}YCP;TDP;Bharatiya Janata Party;Andhra Pradesh;war;central government;Coronavirusనీ అప్పు ఎంతో చెప్పు.. ముందు నీది చెప్పు..నీ అప్పు ఎంతో చెప్పు.. ముందు నీది చెప్పు..bjp vs ysrcp{#}YCP;TDP;Bharatiya Janata Party;Andhra Pradesh;war;central government;CoronavirusWed, 04 Aug 2021 08:55:45 GMTఅప్పుల కుప్ప ఏపీ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూనే, కేంద్రం అప్పులు చేయడం లేదా అని సమర్థించుకుంటోంది. అయితే బీజేపీ మాత్రం ఏపీనే టార్గెట్ చేస్తోంది. ఏపీలో అప్పులు ఎక్కువైపోయాయంటూ బీజేపీ నేతలు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. 25వేల కోట్లు నిబంధనలు ఉల్లంఘించి తెచ్చారంటున్నారు. ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ఏపీపై అప్పులభారం ఎందుకు..?
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉన్నమాట వాస్తవం. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రం మాత్రం కోలుకోలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అందులోనూ సంక్షేమ పథకాలకు సింహభాగం నిధులు ఖర్చవుతున్నాయి. ఈ దశలో కరోనా కష్టకాలం వచ్చింది. కానీ ఏపీలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదు. నిధులు నేరుగా  అకౌంట్లలోనే  జమ అవుతున్నాయి. ఓ దశలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన పెన్షనర్ల పింఛన్లు ఆలస్యం అయ్యాయి కానీ పథకాలు మాత్రం ఆగలేదు. మరోవైపు ఏనెలకానెల ఖర్చులకు వెదుక్కోవాల్సిన పరిస్థితి. దీంతో ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులకు వెళ్లింది. అయితే తాము చేస్తున్న అప్పులు దుబారాకు వాడటం లేదని, ప్రతి పైసాను బాధ్యతగా ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు వైసీపీ నేతలు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీని నిలదీశారు. కేంద్రం అప్పులు చేయడంలేదా అని ప్రశ్నించారు. కేంద్రం సకాలంలో రాష్ట్రానికి నిధులు విడుదల చేయడంలేదని మండిపడ్డారు.

బీజేపీ వాదన ఏంటి..?
ఏపీని అప్పుల్లో ముంచేశారంటూ ఇప్పటి వరకు టీడీపీ నేతలు విమర్శలు సంధించారు. తాజాగా బీజేపీ ఆ అంశాన్ని హైలెట్ చేస్తోంది. ఏకంగా జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ అప్పులపై కేంద్ర మంత్రుల్ని కలసి వీర్రాజు బృందం వినతిపత్రాలిస్తోంది. ఏపీ పరిమితికి మించి అప్పులు చేస్తోందని ఫిర్యాదు చేశారు నేతలు. ఏపీ ప్రభుత్వం జీతాలివ్వలేకపోతోందని విమర్శించారు. కేంద్రం చేస్తున్న అప్పుల్ని సాకుగా చూపడం సరికాదన్నారు. ఈ దశలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఏపీ అప్పుల పేరుతో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.




ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>