PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ready-to-fight-with-ycp-in-ap-69235e9b-b89a-4bc4-8e2f-f6551f1fddde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ready-to-fight-with-ycp-in-ap-69235e9b-b89a-4bc4-8e2f-f6551f1fddde-415x250-IndiaHerald.jpgతెలుగుదేశానికి ముందున్నవి మంచి రోజులేనా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీని ఢీ కొట్టే ఏకైక పార్టీగా టీడీపీయే ఇపుడు గ్రౌండ్ లో ఉంది. దాంతో ఆ పొలిటికల్ అడ్వాంటేజ్ తనకు వరమే అని తమ్ముళ్ళు అంచనా వేసుకుంటున్నారు. tdp{#}un employment;Industries;Assembly;job;Andhra Pradesh;CM;Jagan;TDP;YCP;Avunu;Coronavirus;Governmentటీడీపీకి అన్నీ మంచి శకునములే... ?టీడీపీకి అన్నీ మంచి శకునములే... ?tdp{#}un employment;Industries;Assembly;job;Andhra Pradesh;CM;Jagan;TDP;YCP;Avunu;Coronavirus;GovernmentWed, 04 Aug 2021 20:02:24 GMT
ఇక ఏపీలో వైసీపీకి అతి పెద్ద దెబ్బ ఏంటి అంటే కరోనా అనే చెప్పాలి. జగన్  సీఎం అయిన ఎనిమిది నెలలు గడవకుండానే కరోనా వచ్చి పడిపోయింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఏపీ ఆర్ధిక పరిస్థితి ఈ దెబ్బకు చిత్తు అయింది. ఇక అప్పులతోనే నెట్టుకువస్తున్నారు. దానికి తోడు అలవి కానీ హామీలను జగన్ ఇచ్చేశారు. వాటిని మొదటి ఏడాది నుంచే మొదలెట్టేశారు. ఇపుడు ఆ పధకాలు ఆపడం అంటే కుదిరే పని కాదు. అలాగని కంటిన్యూ చేయాలంటే ఖజానా అసలు  సహకరించడంలేదు.

అప్పులకు కూడా పరిమితి మించడంతో కేంద్రం కూడా ఏపీ మీద సీరియస్ గానే దృష్టి పెట్టింది. దాంతో ఏపీకి కొత్త ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో మెల్లగా ఉద్యోగ వర్గాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఏ ప్రభుత్వం మీద అయినా ఉద్యోగులు యాంటీగా ఉంటే మళ్లీ ఆ సర్కార్ కి అధికారం దక్కడం కల్ల. ఇపుడు వైసీపీ మీద ప్రభుత్వ ఉద్యోగులు మండిపోతున్నారు. వారికి రావాల్సిన 11వ పీయార్సీ అమలు చేయడంలేదు. జీతాలు కూడా ఒకటవ తారీఖునకు సక్రమంగా ఇవ్వడంలేదు. దాంతో వారిలో ఎక్కడ లేని ఆగ్రహం వస్తోంది.

ఇదే ఇపుడు వైసీపీకి వరంగా మారనుంది అంటున్నారు. ప్రభుత్వానికి కళ్ళూ  చెవులువా ఉండే ఉద్యోగులు కోపగిస్తే ప్రభుత్వ రధం ముందుకు సాగదు. చూడబోతే ఇంకా రెండున్నరేళ్లకు పైగా పాలన సాగాలి.  ఇలా ఇంటర్వల్ కి వచ్చింది వైసీపీ సినిమా. ఇంతలోనే ఎన్నో ట్విస్టులు ఉంటే ఇక మీదట ఎలా ఉంటుందో అన్నది కూడా ఎవరికీ అర్ధం కాని విషయమే.

ఇక నిరుద్యోగులు సైతం సర్కార్ తీరు మీద గుర్రుగా  ఉన్నారు. జాబ్ క్యాలండర్ ని జాబ్ లెస్ క్యాలండర్ గా వారు విమర్శిస్తున్నారు. కొత్త జాబ్ ఒక్కటి కూడా తీయడమేదు అంటున్నారు. మరో వైపు అభివృద్ధి లేదని తటస్థ జనాలు అంటున్నారు. కొత్త పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ రావడంలేదు. ఈ పరిణామాల నేపధ్యంలో అంతకంతకు పెరిగే వ్యతిరేకత ఎన్నికల నాటికి పీక్స్ కి చేరుతుందని అది తమకు వరం అవుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. మరో వైపు  కొత్తగా అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం ససేమిరా అనడం కూడా టీడీపీ నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. మరి ఈ విపత్కర పరిస్థితుల నుంచి జగన్ సర్కార్ బయటపడడం అంటే ఇప్పట్లో కష్టమే అన్న మాట ఉంది మరి.













సీమ ఎత్తిపోతల సందర్శన ఇప్పట్లో లేనట్లే...

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

తెలుగులో కొత్త ఓటీటీ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>