PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-b6faf456-6389-4ffa-a179-d017698ff06f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-b6faf456-6389-4ffa-a179-d017698ff06f-415x250-IndiaHerald.jpgహుజురాబాద్‌ ఉప ఎన్నికల జోరు మాములుగా లేదు. త్వరలో జరగబోయే ఈ ఉపఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పార్టీలన్నీ ఇప్పటికే వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ కూడా ఉపఎన్నికపై దృష్టిసారించింది. ఈరోజు ఉదయం 11గంటలకు పీసీసీ నేతలు ఉపఎన్నికపై చర్చించనున్నారు. హుజురాబాద్ ఎన్నికల కో ఆర్డినేటర్లైన మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ పొన్నంప్రభాకర్‌.. మండలాల ఇంఛార్జులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎన్నికల ఇంఛార్జ్ దామోదర రాజనర్సింహా ఇప్పటికే నియోజకవర్గంలో ఓసారి పర్యటించారుcongress{#}Karimnagar;Damodar Raja Narasimha;Huzurabad;festival;Reddy;Congress;Party;Backward Classes;MPహుజురాబాద్‌లో కాంగ్రెస్‌ గేమ్‌ ప్లాన్‌ ?హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ గేమ్‌ ప్లాన్‌ ?congress{#}Karimnagar;Damodar Raja Narasimha;Huzurabad;festival;Reddy;Congress;Party;Backward Classes;MPWed, 04 Aug 2021 10:23:23 GMTత్వరలో జరగబోయే ఈ ఉపఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పార్టీలన్నీ ఇప్పటికే వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ కూడా ఉపఎన్నికపై దృష్టిసారించింది. ఈరోజు ఉదయం 11గంటలకు పీసీసీ నేతలు ఉపఎన్నికపై చర్చించనున్నారు. హుజురాబాద్ ఎన్నికల కో ఆర్డినేటర్లైన మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ పొన్నంప్రభాకర్‌.. మండలాల ఇంఛార్జులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 

ఎన్నికల ఇంఛార్జ్ దామోదర రాజనర్సింహా ఇప్పటికే నియోజకవర్గంలో ఓసారి పర్యటించారు. అక్కడి పరిస్థితులపై ఈ సమావేశంలో పార్టీకి నివేదిక ఇవ్వనున్నారు.  కరీంనగర్ జిల్లా నాయకులతో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థి ఎంపిక , ఎన్నికల ప్రచారం, జెండా పండుగ వంటి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఇప్పటికే పీసీసీ స్థాయిలో అభ్యర్థుల ఎంపిక మీద కొంత కసరత్తు చేశారు. ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల కోసం ప్రయత్నించి వదిలేశారు. ఇక సొంతపార్టీలోని నాయకుల మీదే ఫోకస్ పెట్టారు. ఇప్పటికిప్పుడు కలిసి వచ్చే అంశం కాకపోయినా... భవిష్యత్ ఎన్నికల కోసం కూడా అభ్యర్ధి ఉండేలా కసరత్తు చేస్తోంది పీసీసీ. 

బీజేపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులే బరిలో ఉంటున్నారు కాబట్టి... కాంగ్రెస్.. రెడ్డి సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తుంది. అభ్యర్ధి ఎంపికతో పాటు.. ఆగస్ట్ 9 నుంచి జెండా పండగ చేయాలని పార్టీ నిర్ణయించింది. హుజూరాబాద్ నుంచే దీనికి శ్రీకారం చుట్టాలనుకుంటుంది. ఈ సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.  కాంగ్రెస్ తరఫున హుజురాబాద్ బరిలో నిలిచేదేవెరో ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. జెండా పండుగ షెడ్యూల్ కూడా ప్రకటించవచ్చని తెలుస్తోంది. అయితే... ఈ హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపుతోంది తర్వలోనే క్లారిటీ రానుంది. అలాగే.. రేవంత్‌ రెడ్డి కి కూడా ఈ ఉప ఎన్నిక పెద్ద పరీక్షగా భావించవచ్చు.




జోరు తగ్గిన కృష్ణమ్మ

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!

మన శరీరానికి కాపర్ అవసరాలను తీర్చే ఆహార పదార్థాలు..

కరోనా డేంజర్ సిగ్నల్.. ఆ నంబర్ పెరుగుతోంది..?

ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

సినిమాలకు కొట్టే క్లాప్ బోర్డ్ చరిత్ర... బట్టబయలు చేసిన డైరెక్టర్

ఏపీ : ఇంటర్ సప్లీ పరీక్షలపై క్లారిటీ.. !

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>