PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/metro-train-b9fe8e50-241b-46b9-9a87-36507d7b2849-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/metro-train-b9fe8e50-241b-46b9-9a87-36507d7b2849-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ మెట్రో... 2017 సంవత్సరంలో కొన్ని ఏరియాలకే ప్రారంభమై... ఆ తర్వాత మహా నగరంలోని రద్దీ ప్రాంతాలకు విస్తరించింది. అయితే మెట్రో వల్ల ప్రయాణికులకు లాభాలు జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్ నగరంలో చాలా మేరకు ట్రాఫిక్ సమస్య కూడా తగ్గిపోయింది. మెట్రో ప్రారంభమైన నుంచి ఉద్యోగులు కూడా ఆఫీస్ కు సమయానికి చేరుకున్నారు. ఇంతవరకు అంతా బానే ఉంది. కానీ మెట్రో ట్రైన్ మరియు వాటి స్టేషన్ల కారణంగా... ప్రజలకు తెలియకుండానే అనేక సమస్యలు వచ్చిపడ్డాయి. అందులో ముఖ్యంగా మెట్రో స్టేషన్ ఎక్కడానికి దాదాపు పది నిమిషాల టైం పడmetro train {#}Train;Maha;Hyderabadహైదరాబాద్ మెట్రో మెంటల్ : ఎక్కడం, దిగడమే కష్టం గురూ ?హైదరాబాద్ మెట్రో మెంటల్ : ఎక్కడం, దిగడమే కష్టం గురూ ?metro train {#}Train;Maha;HyderabadWed, 04 Aug 2021 16:02:32 GMTహైదరాబాద్ మెట్రో... 2017 సంవత్సరంలో కొన్ని ఏరియాలకే ప్రారంభమై... ఆ తర్వాత మహా నగరంలోని రద్దీ ప్రాంతాలకు విస్తరించింది. అయితే మెట్రో వల్ల ప్రయాణికులకు లాభాలు జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్ నగరంలో చాలా మేరకు ట్రాఫిక్ సమస్య కూడా తగ్గిపోయింది. మెట్రో ప్రారంభమైన నుంచి ఉద్యోగులు కూడా ఆఫీస్ కు సమయానికి చేరుకున్నారు. ఇంతవరకు అంతా బానే ఉంది. కానీ మెట్రో ట్రైన్ మరియు వాటి స్టేషన్ల కారణంగా... ప్రజలకు తెలియకుండానే అనేక సమస్యలు వచ్చిపడ్డాయి. అందులో ముఖ్యంగా మెట్రో స్టేషన్ ఎక్కడానికి దాదాపు పది నిమిషాల టైం పడుతుంది. అలాగే దిగడానికి కూడా సమయం పడుతుంది. దీనివల్ల ప్రజలకు వృధా అవుతుంది.

 ఉదాహరణ జూబ్లీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ప్యాట్నీ మెట్రో రైల్వే స్టేషన్. బస్టాండ్ దగ్గర ఉండడంతో ఈ స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువ. దానికి తోడు మెట్రో స్టేషన్ ఎక్కాలి అంటే దాదాపు పదిహేను నిమిషాలు పడుతుంది. అలాగే ఆ స్టేషన్ లో ఏ రైలు ఎక్కడికి వెళుతుంది? ఏ రూట్ నుంచి వెళ్తుంది? అనే సూచనలు ఇచ్చేవారు కరువయ్యారు. దీంతో రెగ్యులర్ ప్రయానికులే కాకుండా... కొత్తగా వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మెట్రో స్టేషన్ లో విపరీతంగా షాపింగ్ మాల్స్ పెరిగిపోయాయి. ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవాలి అని వెళ్తున్న తరుణంలో... మధ్యలో ఈ షాపింగ్ మాల్స్ గొడవ ఒకటి. ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వెళ్లాల్సింది పోయి షాపింగ్ మాల్ దగ్గర అయిపోతున్నారు. అంతేకాదు ఈ షాపింగ్ మాల్ లో మామూలు బయటి ధరల కంటే... ఎక్కువ దండుకుంటున్నారు.

వాటర్ బాటిల్ మరియు చిప్స్ ఇంకా తదితర వస్తువుల గురించి చెప్పనక్కర్లేదు. అధిక ధరలతో ప్రయాణికుల రక్తాన్ని పిండేస్తున్నారు. అసలు మీ షాపింగ్ మాల్ నుంచి ప్రభుత్వానికి ఈ మేరకు ఆదాయం వస్తుందో తెలీదు కానీ... విచ్చలవిడిగా షాప్స్ పెట్టుకునేలా సర్కారు పర్మిషన్లు ఇచ్చేసింది. దీంతో తో వాళ్ళ ఆగడాలు మరింతగా పెరిగాయి. ఇక అటు ఈ మెట్రో కారణంగా.... రోడ్లు కూడా అస్తవ్యస్తమయ్యాయి. దీంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మెట్రో పనులు చేపట్టినప్పుడు గుంతలు గా మారిన రోడ్లను ఇప్పటివరకు జిహెచ్ఎంసి అధికారులు కూడా బాగు చేయలేదు. అలాగే... ఈ మెట్రో శబ్దాల కారణంగా... చాలా ఏరియాల్లో ప్రజలు బాధపడుతున్నారు. విపరీతమైన శబ్దాలు రావడంతో... చెవికి సంబంధించిన వ్యాధుల భారీగా పడుతున్నారు. కాగా మెట్రో వల్ల ఎంత ఉపయోగమో... అంతే నష్టాలు కూడా ఉన్నాయని ప్రజలు గ్రహిస్తున్నారు.



పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>