PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp531a261c-396e-4b11-a6da-d8baf8d40a01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp531a261c-396e-4b11-a6da-d8baf8d40a01-415x250-IndiaHerald.jpgవైసిపికి చెందిన మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకూ ఎమ్మెల్యేల నుంచి స‌ల‌హాదారుల వ‌ర‌కూ ఓ రెండు విష‌యాల‌కు మాత్రమే చంద్ర‌బాబు గారిని బాధ్యుడ్ని చేయ‌డం లేదు అని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి విష‌యంలోనూ చంద్ర‌బాబు పేరును తీసుకువ‌చ్చే వైసీపీ నేతలు వారికి పుట్టిన పిల్ల‌లు, వారు సంపాదించిన అక్ర‌మాస్తుల విష‌యంలో చంద్ర‌బాబును బాధ్య‌డిని చేయ‌డం లేద‌ని ఎద్దేవ చేశారు. వైఎస్ జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారు పెంచిన ప‌న్నుల‌తో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు సెంచ‌రీ దాటేసి,tdp{#}Nara Lokesh;Diesel;Petrol;Reddy;Telangana;CBN;Telangana Chief Minister;Andhra Pradesh;Telugu Desam Party;YCPఆ రెండు విష‌యాల‌లో మాత్ర‌మే `బాబు`ను బ్యాడ్ చేయ‌డం లేదు..?ఆ రెండు విష‌యాల‌లో మాత్ర‌మే `బాబు`ను బ్యాడ్ చేయ‌డం లేదు..?tdp{#}Nara Lokesh;Diesel;Petrol;Reddy;Telangana;CBN;Telangana Chief Minister;Andhra Pradesh;Telugu Desam Party;YCPWed, 04 Aug 2021 11:39:00 GMT వైసిపికి చెందిన మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకూ ఎమ్మెల్యేల నుంచి స‌ల‌హాదారుల వ‌ర‌కూ ఓ రెండు విష‌యాల‌కు మాత్రమే చంద్ర‌బాబు గారిని బాధ్యుడ్ని చేయ‌డం లేదు అని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి విష‌యంలోనూ చంద్ర‌బాబు పేరును తీసుకువ‌చ్చే వైసీపీ నేతలు వారికి పుట్టిన పిల్ల‌లు, వారు సంపాదించిన అక్ర‌మాస్తుల విష‌యంలో చంద్ర‌బాబును బాధ్య‌డిని చేయ‌డం లేద‌ని ఎద్దేవ చేశారు. వైఎస్ జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారు పెంచిన ప‌న్నుల‌తో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు సెంచ‌రీ దాటేసి, ద‌క్షిన భార‌త్ లోనే అతి ఎక్కువ‌గా వుంటే, చంద్ర‌బాబు గారిపై ఏడుపా? అంటూ ప్ర‌శ్నించారు. ఇంధ‌న ధ‌ర‌ల భారం ప్రజలపై పడకూడదని 2018 సంవ‌త్స‌రంలో పెట్రోల్, డీజిల్ పై ఉన్న అదనపు వ్యాట్ ని రూ.4 నుంచి రూ.2 కి తగ్గించిన ఘనత చంద్రబాబు గారిద‌ని గుర్తు చేశారు.


 అయితే, దేశంలో ఎక్కడాలేని విధంగా లీట‌ర్ పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌, అధికంగా రూ.4 అదనపు వ్యాట్, లీటరుకి 1రూపాయి రోడ్డు అభివృద్ధి సుంకం వేస్తున్నార‌ని. ఒక లీటర్ పెట్రోల్ కి పన్నుల రూపంలో రూ.30 భారం సామాన్యులపై మోపిన ద‌రిద్ర చ‌రిత్ర జ‌గ‌న్‌రెడ్డిది నారా లోకేశ్ మండిప‌డ్డారు. ఆత్మలతో మాట్లాడుతున్న లండ‌న్ పిచ్చిరెడ్డి గారి పిచ్చి ఏమైనా అంటుకుందా స‌జ్జ‌లా ? బాబుగారి జ‌పం చేస్తున్నావు అని హేళ‌న చేశారు.పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మీ పాల‌న‌లో ఏ రేంజులో వున్నాయో తెలుసుకోవాలంటే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి స‌రిహ‌ద్దులో ఉన్న‌ త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ పెట్రోల్ బంకుల్లో బోర్డులు చూడాల‌ని వైసీపీ నేత‌ల‌కు నారా లోకేశ్ సూచించారు.


ఏపీ కంటే త‌క్కువ ధ‌ర‌ల‌నే బోర్డులు చూసైనా చంద్ర‌బాబు గారిపై ఏడుపు ఆపాల‌ని హిత‌వు ప‌లికారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌ల‌పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ కుమార్ ఈ విధంగా స్పందించారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఏ విష‌యం వెలువ‌డినా వైసీపీ ప్ర‌భుత్వంలో ఉన్న నేత‌లు చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యం మూలంగానే ఇదంతా జ‌రిగింది అని ఆరోపిస్తూంటారు. గ‌తంలో ఆ విధంగా చేసి ఉండ‌కుంటే ఇప్ప‌డు రాష్ట్రం బాగు ప‌డేద‌ని చంద్ర‌బాబుపై వైసీపీ నేత‌లు చాలా సార్లు అవాకు చ‌వాకులు పేలిన విష‌యం తెలిసిందే.





అమర 'రాజా' అసలు కథ ఇదట!

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>