Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/meteoe5e2f080-0804-4075-ab2c-33aae2892d2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/meteoe5e2f080-0804-4075-ab2c-33aae2892d2a-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మెట్రోరైలు ప్రారంభమైంది. దీంతో ఇక హైదరాబాద్ నగరంలోని ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి అని అందరూ అనుకున్నారు. మెట్రో ట్రైన్ లో ప్రయాణం కాస్త ఖర్చుతో కూడుకున్నదే అయినప్పటికీ... ఎలాంటి ట్రాఫిక్ లేకుండా.. ఎక్కడ సమయం వృధా కాకుండా సాఫీగా సాగిపోయే ప్రయాణం కావడంతో హైదరాబాద్ నగర వాసులు అందరూ మెట్రో వైపే మొగ్గు చూపారు. ఇక మెట్రో ట్రైన్ తీసుకురావడంపై ప్రభుత్వంపై ఆహా ఓహో అంటూ ఎన్నో ప్రశంసలు కూడా కురిపించారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంMeteo{#}pollution;Train;Hyderabadహైదరాబాద్ మెట్రో మెంటల్ : రణ-గొణ ధ్వని, పరిమితుల్లోనే ఉందా?హైదరాబాద్ మెట్రో మెంటల్ : రణ-గొణ ధ్వని, పరిమితుల్లోనే ఉందా?Meteo{#}pollution;Train;HyderabadWed, 04 Aug 2021 10:00:00 GMTహైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మెట్రోరైలు ప్రారంభమైంది. దీంతో ఇక హైదరాబాద్ నగరంలోని ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి అని అందరూ అనుకున్నారు.  మెట్రో ట్రైన్ లో ప్రయాణం కాస్త ఖర్చుతో కూడుకున్నదే అయినప్పటికీ...  ఎలాంటి ట్రాఫిక్ లేకుండా.. ఎక్కడ సమయం వృధా కాకుండా సాఫీగా సాగిపోయే ప్రయాణం కావడంతో హైదరాబాద్ నగర వాసులు అందరూ మెట్రో వైపే మొగ్గు చూపారు. ఇక మెట్రో ట్రైన్ తీసుకురావడంపై ప్రభుత్వంపై ఆహా ఓహో అంటూ ఎన్నో ప్రశంసలు కూడా కురిపించారు.



 ఇక ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలలో కూడా మెట్రో ట్రైన్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ.. మెట్రో ట్రైన్ సేవలు ఎంతో అద్భుతంగా ఉంటే మధ్యలో.. కానీ ఏంటి అంటారా.. అప్పుడు అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు భయపెడుతున్నాయి మెట్రో సేవలు . దీంతో మొన్నటి వరకు మెట్రో ట్రైన్ అంటే ఆహా ఓహో అంటూ మురిసిపోయిన వారే అయ్యబాబోయ్ అంటూ చెవులు మూసుకుంటారు. ఇంతకీ చెవులు ఎందుకు మూసుకున్నారు అంటారా.. మెట్రో ట్రైన్ ద్వారా వస్తున్న విపరీతమైన శబ్దాలతో. అదేమైనా రైలా కూ చుక్ చుక్ అని..  శబ్దాలు చేయడానికి.. మెట్రో ట్రైన్ ఎలాంటి సౌండ్ లేకుండానే  దూసుకు పోతూ ఉంటుంది అని అంటారూ ఈ విషయం చెబితే ఎవరైనా.



 అయితే నిజంగానే మొదట్లో మెట్రో ట్రైన్ ఇలా ఎలాంటి శబ్దం లేకుండానే దూసుకుపోయింది. కానీ రానురాను మాత్రం శబ్దాలు చెయ్యటం మొదలు పెట్టింది. అధికారుల నిర్లక్ష్యమా.. మెట్రో సంస్థ అలసత్వమా తెలియదు కానీ మెట్రో ట్రైన్ లు ప్రస్తుతం ప్రజల పాలిట పాపం గా మారుతున్నాయి. మెట్రో ట్రైన్ లో నుంచి వస్తున్న శబ్దాలతో ఒక్క రాత్రి కూడా హైదరాబాద్ నగరవాసులు ప్రశాంతంగా నిద్ర పోవడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మెట్రో ట్రైన్ లో నుంచి వస్తున్న శబ్దాలతో చెవులు పగిలిపోతున్నాయి అని అంటున్నారు స్థానికులు. సాధారణంగానే మెట్రో ట్రైన్ శబ్దాలకు చెవులు పగిలిపోతున్నాయి. ఇక వర్షాకాలంలో అయితే చెవులు కాదు మొత్తం కపాలం పగిలిపోయేలా ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలె మెట్రో అధికారులకు ఫిర్యాదు చేశారు కొంతమంది స్థానికులు. దీంతో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఇప్పటికైనా అధికారులు మెట్రో రణగొణధ్వని పరిమితుల్లోనే ఉందా లేదా అనే విషయంపై కాస్త దృష్టి సారిస్తే  ప్రజలకు కాస్త ప్రశాంతత కలిగించిన వారు అవుతారు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మెట్రో అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించి అటు సౌండ్ పొల్యూషన్ తగ్గించి నగరవాసులకు ప్రశాంతతను  కల్పిస్తారో లేదో చూడాలి మరి.



ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

మన శరీరానికి కాపర్ అవసరాలను తీర్చే ఆహార పదార్థాలు..

కరోనా డేంజర్ సిగ్నల్.. ఆ నంబర్ పెరుగుతోంది..?

ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

సినిమాలకు కొట్టే క్లాప్ బోర్డ్ చరిత్ర... బట్టబయలు చేసిన డైరెక్టర్

ఏపీ : ఇంటర్ సప్లీ పరీక్షలపై క్లారిటీ.. !

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>