కిలేడీ హంగామా, మందేసి నడిరోడ్డుపై రచ్చ రచ్చ, ఎక్కడంటే (వీడియో)
మందేస్తే చిందేయడం కామనే.. కానీ అదీ పబ్లిక్ ప్లేసా..? మరొకటి అనేది గ్రహించాలి. దాదాపు 99 శాతం మందుబాబులు జెంట్స్ ఉంటారు. లేడీస్ మందు తాగుతారు. కానీ రచ్చ రచ్చ చేయడం అరుదు. డ్రింక్ చేసిన సందర్భంలో గొడవ, రచ్చ రచ్చ అయ్యేది పురుషుల వల్లే.. ఇందులో సందేహానికి తావులేదు. అయితే కొన్ని సార్లు అటు ఇటు, ఇటు అటు అవుతుంటాయి. ఓ మహిళ ఫుటుగా మందు తాగింది. ఇంకేముంది ఆమెను ఆపడం ఎవరీ తరం కాదు. చెబితే వినే రకం కూడా కాదు.. ఇంకేముంది నడిరోడ్డుపైనే రచ్చ రచ్చ చేసింది.

నడిరోడ్డుపై మహిళ..
పక్కన గల వీడియో చూడండి. రహదారి.. నడిరోడ్డుపై ఓ మహిళ.. ఆమె ఊరికేనే కూర్చొలేదు. ఆమె శరీరంలో గల రక్తంలో ఆల్కహాల్ ప్రవహిస్తోంది. ఇంకేముంది ఆమె ఎవరీ మాట వినని సీతమ్మ అయిపోయారు. ఆమెను ఆపేందుకు అంతకుముందు ఎవరన్నా వచ్చారో లేదో తెలియదు. కానీ ఆమె మాత్రం రోడ్డు మధ్యలో కూర్చొని ఉంది. వాహనాలు వస్తోన్న అదరలేదు బెదరలేదు. వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేద్దాం.. కలికాలంలో ఇంకేం చూడాలో మరీ. మధ్యలో కూర్చొని కాళ్లను పట్టుకొని ఫీట్లు చేసింది. అలా కాసేపు అందరినీ అదరగొట్టింది.

రోడ్డుపైనే ఇలా..
అటు, ఇటు తిరిగే ప్రయత్నం చేసింది. చివరికీ రోడ్డుపైనే వెల్లకిలా పడుకొని ఉంది. ఆ సమయంలో ఓ కారు వస్తోంది. ఆమెను చూసి.. కారు ఏక్ ధామ్ స్లో అయ్యింది. ఎందుకంటే ఆమె ఎక్కడ తమవైపు వస్తుందనే భయం ఉంది. మెల్లగా కారు వెళ్లనిచ్చారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పటికీ కూడా యువతి అలానే రోడ్డుపై పడుకొని కనిపించింది. ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. తెగ వైరల్ అవుతోంది. 15 సెకన్ల నిడివి గల వీడియోకు.. నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
యువతి హల్ చల్
ఘటన మహారాష్ట్రలో జరిగింది. పుణె జిల్లాలో రాత్రి జరిగింది. యువతి హల్ చల్ చేయగా కొందరు వీడియో తీశారు. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతోంది. యువతీకి సంబంధించి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వామ్మో ఈమె మాములు లేడీ కాదు అని పోస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో రహదారిపై వెళుతున్న వారిని హడలెత్తించారని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఏ కేసు నమోదు కాలేదు.