PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ts-govt83c3234c-86b3-4beb-a3f4-ef2c45cd3b6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ts-govt83c3234c-86b3-4beb-a3f4-ef2c45cd3b6f-415x250-IndiaHerald.jpg హైద‌రాబాద్‌లో పెరిగిపోతున్న జ‌నాభాకు అనుకూలంగా ప్ర‌భుత్వ ఆసుపత్రుల‌ను నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే రాజ‌ధానికి న‌లుదిక్కులా నాలుగు అత్యాధునిక ప్ర‌భుత్వాసుత్రులు రాబోతున్నాయి. ఇందులో వాత‌వ‌ర‌ణ కాలుష్యం వ‌ల్ల ఎదుర‌వుత‌న్న రోగాల‌ను న‌యం చేయ‌డానికి ఓ ఆస‌ప‌త్రిని నిర్మించ‌నున్నారు. అలాగే మూడు వేల ప‌డ‌క‌ల‌తో మూడు సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌ను నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. వీటికి స్థ‌లాల‌ను కూడా గ‌వ‌ర్న‌మెంట్ దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ ఆts govt{#}pollution;central government;Telangana;Telangana Chief Minister;CM;Coronavirusమ‌హాన‌గరంలో మ‌రో నాలుగు ప్ర‌భుత్వాసుపత్రులు..!మ‌హాన‌గరంలో మ‌రో నాలుగు ప్ర‌భుత్వాసుపత్రులు..!ts govt{#}pollution;central government;Telangana;Telangana Chief Minister;CM;CoronavirusWed, 04 Aug 2021 09:56:02 GMT  హైద‌రాబాద్‌లో పెరిగిపోతున్న జ‌నాభాకు అనుకూలంగా ప్ర‌భుత్వ ఆసుపత్రుల‌ను నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే  రాజ‌ధానికి న‌లుదిక్కులా నాలుగు అత్యాధునిక ప్ర‌భుత్వాసుత్రులు రాబోతున్నాయి. ఇందులో వాత‌వ‌ర‌ణ కాలుష్యం వ‌ల్ల ఎదుర‌వుత‌న్న రోగాల‌ను న‌యం చేయ‌డానికి ఓ ఆస‌ప‌త్రిని నిర్మించ‌నున్నారు. అలాగే మూడు వేల ప‌డ‌క‌ల‌తో మూడు సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌ను నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 


వీటికి స్థ‌లాల‌ను కూడా గ‌వ‌ర్న‌మెంట్ దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ ఆసుప‌త్రుల భ‌వ‌నాల‌ను నిర్మించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. అన్నీ కుదిరితే నెల రోజుల వ్యవధిలో టెండర్లు కూడా పిలవాలని భావిస్తున్నారు అధికారులు. సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉండటంతో ఏడాదిలోగా ఈ నిర్మాణాలను పూర్తి చేసి ఆస్పత్రులకు అందుబాటులోకి తీసుకురావాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు.

  భాగ్య‌నగ‌రంలో 20ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న స‌మ‌యంలో గాంధీ, ఉస్మానియాతోపాటు మ‌రిన్ని ఆసుప్ర‌తులు ఏర్పాటు అయ్యాయ‌. ప్ర‌స్తుతం రాజ‌ధాని జ‌నాభా కోటికి పైగా ఉండ‌డంతో మ‌రిన్ని ప్ర‌భుత్వాసుప‌త్రుల సంఖ్య భారీగా పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. కరోనా మొద‌టి ద‌శ విజృంభించిన వేళ ఏడాదిన్నర కిందట  గచ్చిబౌలిలో తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) హాస్పిట‌ల్‌ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.



ఇక్కడ వెయ్యిపడకలతో సూపర్‌స్పెషాల్టీ వైద్యం అందించాలని సర్కార్‌ భావించిన‌ప్ప‌టికి  ఏర్పాట్లు పూర్తి కాలేవు. మొదటి, రెండో దశ కరోనా సమయాల్లో కూడా ఇక్కడ వేలాదిమంది కరోనా రోగులకు చికిత్స అందించారు కూడా. టిమ్స్‌కు అనుబంధంగా మరో మూడు ఆస్ప‌త్రుల‌ను న‌గ‌రంలోని మూడు దిక్కులా ఒక్కో దాంట్లో వెయ్యి పడకలు ఉండేలా కొద్ది రోజుల కిందట అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.


  కొత్త‌గా ఏర్పాటు చేసే ఆస్ప‌త్రుల‌ను టిమ్స్ ప‌రిధిలోకి తీసుకొచ్చారు. చెస్టు ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసే దవాఖానాను సనత్‌నగర్‌ టిమ్స్‌గా, ఎల్బీనగర్‌ టిమ్స్‌, అల్వాల్‌ టిమ్స్‌ అని పిలుస్తారు. పఠాన్‌చెరులో 250 పడకలతో కాలుష్యం వ‌ల్ల ఉత్ప‌న్న‌మ‌వుతున్న రోగాల‌కు చికిత్స అందించ‌నున్నారు.  దీనికి నిధుల‌ను ఇవ్వడానికి కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. ఒక్కో ఆసుప‌త్రి నిర్మాణానికి దాదాపు 1000 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌నున్నారు.





బాలీవుడ్ లో తెరకెక్కనున్న దిగ్గజ క్రీడాకారుడి బయోపిక్..?

మన శరీరానికి కాపర్ అవసరాలను తీర్చే ఆహార పదార్థాలు..

కరోనా డేంజర్ సిగ్నల్.. ఆ నంబర్ పెరుగుతోంది..?

ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

ఏపీ : ఇంటర్ సప్లీ పరీక్షలపై క్లారిటీ.. !

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>