PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana024b5276-eab1-41b6-a785-b242968cdb7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana024b5276-eab1-41b6-a785-b242968cdb7c-415x250-IndiaHerald.jpgతెలంగాణ సర్కారుకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ విషయమై డెడ్‌లైన్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలోనే భూములకు సంబంధించిన పంచాయితీలు రోజురోజుకూ పెరిగిపోతుండటం మనం చూడొచ్చు. కాగా, ప్రభుత్వభూములూ అన్యాక్రాంతమవుతున్నాయి. పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, క్రయవిక్రయాల విషయమై రాష్ట్రహైకోర్టు స్పందించింది. ప్రభుత్వ భూములు ఆక్రమణలపై విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయtelangana{#}high courtతెలంగాణ సర్కారుకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ విషయమై డెడ్‌లైన్తెలంగాణ సర్కారుకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ విషయమై డెడ్‌లైన్telangana{#}high courtWed, 04 Aug 2021 18:08:00 GMTతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలోనే భూములకు సంబంధించిన పంచాయితీలు రోజురోజుకూ పెరిగిపోతుండటం మనం చూడొచ్చు. కాగా, ప్రభుత్వభూములూ అన్యాక్రాంతమవుతున్నాయి. పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, క్రయవిక్రయాల విషయమై రాష్ట్రహైకోర్టు స్పందించింది. ప్రభుత్వ భూములు ఆక్రమణలపై విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీచేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ విక్రయాలపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోని 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టాలని, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో సర్వే పూర్తి చేయాలని తెలిపింది. సర్కారు భూములను గుర్తించడంతో పాటు జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే సర్కారు భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పంది.ఇక ప్రభుత్వ భూముల వివరాలను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపించాలని, రికార్డుల్లోకి ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దని సబ్ రిజిస్ట్రార్లను కలెక్టర్లు ఆదేశించాలని సూచించింది. గవర్నమెంట్ ల్యాండ్స్ సర్వే ప్లస్ వివరాల నమోదును కలెక్టర్లు పర్సనల్‌గా పర్యవేక్షించాలని, అధికారులకే ఆ విషయాలను వదిలేయొద్దని హైకోర్టు పేర్కొంది. సర్వే అనంతరం 33 జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా నివేదికలు సమర్పించాలంది. ఏదేని విషయమై సబ్ రిజిస్ట్రార్లకు అనుమానం వస్తే ముందుగా కలెక్టర్లను సంప్రదించాలని చెప్పింది. హై కోర్టు ఉత్తర్వులను వారం రోజుల్లో కలెక్టర్లకు పంపించాలని ఏజీకి ధర్మాసనం ఆదేశం ఇచ్చింది. ఇక ఈ విషయాలపై తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది. ప్రభుత్వ భూములను ఎవరూ కబ్జా చేయకుండా ఉండేందుకుగాను రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.


పుష్ప రాజ్ తో సాహసం చేస్తున్న సుకుమార్..!

పెళ్లి వార్త చెప్పనున్న పీవీ సింధూ?

ఇందిరా గాంధీగా ఆకట్టుకుంటున్న మిస్ యూనివర్స్.. నెటిజన్స్ ఫిదా..

ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

శభాష్ పోలీస్

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>