SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualityf50787fb-b118-4fd2-968a-63678be20a51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spiritualityf50787fb-b118-4fd2-968a-63678be20a51-415x250-IndiaHerald.jpgసరస్వతి అమ్మ వారికి ఇష్టమైనటువంటి దీపారాధనను పిల్లలతో చేయించడం వలన అమ్మవారి అనుగ్రహం ఆ పిల్లలపై తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ సరస్వతి దీపారాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. దీపారాధన కొరకు రెండు మట్టి కుందెలను తీసుకోవాలి. కలశం , కడ్డీలు, కర్పూరం, తేనె ,తమలపాకులు, పుష్పాలు సిద్దం చేసుకొని ముందుగా ఈ మంత్రాన్ని జపించాలి. SPIRITUALITY{#}prasanna;vani;Turmeric;oil;Betel;Cow slaughter;nithya new;sree;Mahaమీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?SPIRITUALITY{#}prasanna;vani;Turmeric;oil;Betel;Cow slaughter;nithya new;sree;MahaWed, 04 Aug 2021 08:00:00 GMTనిత్య దీపాన్ని వెలిగించడం మంచిది.  అందుకు మట్టి దీపం కుందెలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె ను కానీ వేసి రెండు ఒత్తులను ఒకటిగా చేసుకుని అలా మూడు వత్తులు తయారు చేసి కుందెలో దీపారాధనకు సిద్దం చేయాలి. ఆ దీపపు కుందెను పసుపు కుంకుమలతో అలకరించాలి. అనంతరం ఆ దీపాన్ని తీసుకుని తమలపాకు ఉంచి దానిపై ఆ దీపపు కుందెను ఉంచాలి. మరో వైపు సరస్వతి దీపాన్ని కూడా అలానే సిద్దం చేసుకోవాలి.

అనంతరం అర చేతిలో కొద్దిగా నీళ్లు వేసుకుని "ఓం కేశవాయ నమః"...అని తాగేయాలి. మళ్లీ తీసుకుని "ఓం నారాయణాయనమః" అని తాగాలి. మళ్లీ తీసుకుని "ఓం మాధవాయ నమః" అని తాగాలి. కానీ నాలుగవసారి నీటిని అరచేతిలో పోసుకుని ప్లేట్ లో వదిలేయాలి. ఆ తర్వాత మీ పిల్లలతో నిత్య దీపారాధన చేయించాలి.  దీపాన్ని నేరుగా అగ్గిపెట్టెతో వెలింగించరాదు. కాబట్టి హారతి పల్లెమును తీసుకుని అందులో వత్తి వేసుకుని ముందుగా ఆ వత్తిని వెలిగించి అనంతరం దాంతో నిత్య దీపాన్ని  వెలిగించాలి. అనంతరం దీపం వద్ద అక్షింతలు వేసి నమస్కరించుకుని, ఆ సమయంలో ఇలా మంత్రం జపించాలి. "ఓమ్ శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే". ఓం గణేశాయ నమః అంటూ నమస్కరించుకోవాలి.

ఆ తర్వాత సరస్వతి దీపాన్ని వెలిగించాలి. "ఓం వాణి మనూ ప్రియే దేవి బ్రహ్మ అర్థ శరీరని సౌశీల్యం కురునే దేవ్ బ్రహ్మ పత్నే సరస్వతీ నమోస్తుతే' అని జపించి కాస్త పసుపు కుంకుమను దీపం వద్ద వేసి నమష్కరించుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః...అంటూ కడ్డీలు వెలిగించాలి. ఆ తర్వాత తమలపాకుతో నీటిని తీసుకుని దీపానికి తాకించి ఆ నీటిని ప్లేట్ లో వదిలేయాలి. అనంతరం నైవేద్యంగా తేనెను సమర్పించాలి. సరస్వతికి తేనె అంటే మహా ప్రీతి. అనంతరం తమకు మేధస్సును ప్రసాదించమని ఆ సరస్వతి దేవిని వేడుకోవాలి.


కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ముహర్తం..కొత్త ముఖాలు ఇవే ?

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>