MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroins-c96a29ce-0a30-48b3-94fd-70fc64882978-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroins-c96a29ce-0a30-48b3-94fd-70fc64882978-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ అందులో కొందరే సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటారు. ఏ హీరోయిన్‌కు అయినా తన ఫస్ట్ మూవీ చాలా స్పెషల్. కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాతే ఆ హీరోయిన్‌కు అవకాశాలు పెరుగుతాయి.heroins {#}rakul preet singh;Desamuduru;Sai Pallavi;ye maya chesave;Blockbuster hit;BEAUTY;marriage;gold;Fidaa;Hero;Telugu;Tollywood;Cinemaమొదటి సినిమాతోనే తళుక్కుమన్న తారలెందరో తెలుసా..?మొదటి సినిమాతోనే తళుక్కుమన్న తారలెందరో తెలుసా..?heroins {#}rakul preet singh;Desamuduru;Sai Pallavi;ye maya chesave;Blockbuster hit;BEAUTY;marriage;gold;Fidaa;Hero;Telugu;Tollywood;CinemaWed, 04 Aug 2021 09:35:00 GMTసినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ అందులో కొందరే సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటారు. ఏ హీరోయిన్‌కు అయినా తన ఫస్ట్ మూవీ చాలా స్పెషల్. కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాతే ఆ హీరోయిన్‌కు అవకాశాలు పెరుగుతాయి. ఫస్ట్ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని భారీ అంచనాలే పెట్టుకుంటారు. సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆటోమెటిక్‌గా మూవీలో నటించిన వారికి మంచి పేరు వస్తుంది. అయితే టాలీవుడ్‌లో కొందరు తమ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఒకటే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల వివరాలు తెలుసుకుందాం.

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత.. ఈ సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత యంగ్ హీరో నాగచైతన్య ప్రేమలోపడి వివాహం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత 2007లో వచ్చిన దేశముదురు సినిమా ద్వారా హాట్ బ్యూటీ హన్సిక ఇండస్ట్రీకి పరిచయం అయింది. 16 ఏళ్లకే ఈ సినిమా హన్సికకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్‌కు మంచి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంటోంది. కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్వేతబసు.. 17 ఏళ్ల వయసులోనే సినిమా పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత ఫిదా మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన సాయిపల్లవి తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ వరుస హిట్లు అందుకుంటోంది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో అభిమానులు దగ్గరైన అవికాగోర్.. ఉయ్యాలా జంపాలా సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయింది.



బాలీవుడ్ లో తెరకెక్కనున్న దిగ్గజ క్రీడాకారుడి బయోపిక్..?

మన శరీరానికి కాపర్ అవసరాలను తీర్చే ఆహార పదార్థాలు..

కరోనా డేంజర్ సిగ్నల్.. ఆ నంబర్ పెరుగుతోంది..?

ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

ఏపీ : ఇంటర్ సప్లీ పరీక్షలపై క్లారిటీ.. !

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>