PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-viveka-jagan-ycp-cbid37933fc-bf49-4096-817b-125327dc77cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-viveka-jagan-ycp-cbid37933fc-bf49-4096-817b-125327dc77cd-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు సూత్రధారులను వదిలేస్తారా? వివేకాను హత్య చేసింది ఎవరు? ఎందుకు? అనే విషయాలు సీఎం జగన్‌కు తెలుసా? ఒకవేళ నిజంగా తెలుసుంటే కనుక.. మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన తన చిన్నాన్నను దారుణంగా అంతం చేసిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడంలో తాత్సారం ఎందుకు చేస్తున్నట్టు? అందుకు బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న వివేకా హత్య కేసు విచారణలో అసలు ఏం జరుగుతోంది? ఇవcbi will loose key accuses{#}kadapa;Y S Vivekananda Reddy;CBI;Murder.;District;Minister;Telangana Chief Minister;CM;Teluguఅసలు సూత్రధారులను వదిలేస్తారా?అసలు సూత్రధారులను వదిలేస్తారా?cbi will loose key accuses{#}kadapa;Y S Vivekananda Reddy;CBI;Murder.;District;Minister;Telangana Chief Minister;CM;TeluguWed, 04 Aug 2021 09:24:04 GMTఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు సూత్రధారులను వదిలేస్తారా? వివేకాను హత్య చేసింది ఎవరు? ఎందుకు? అనే విషయాలు సీఎం జగన్‌కు తెలుసా? ఒకవేళ నిజంగా తెలుసుంటే కనుక.. మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన తన చిన్నాన్నను దారుణంగా అంతం చేసిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడంలో తాత్సారం ఎందుకు చేస్తున్నట్టు? అందుకు బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న వివేకా హత్య కేసు విచారణలో అసలు ఏం జరుగుతోంది? ఇవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు. ముఖ్యంగా కడప జిల్లా వాసుల్లో జోరుగా జరుగుతోన్న చర్చ ఇది. మొన్నటిదాకా వాచ్‌మెన్ రంగయ్య కేసులో కీలకంగా మారిందని హడావుడి చేసిన సీబీఐ విచారణాధికారులు.. ఇప్పుడు వివేకా సన్నిహితుడు సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను కీలక నిందితుడుగా ప్రొజెక్ట్‌ చేస్తోంది. కేసు కొలిక్కి వచ్చినట్టే అన్న సంకేతాలు సైతం ఇస్తోంది. ఈ తాజా పరిణామం సామాన్యుల్లో రకరకాల చర్చకు దారితీసింది. వారిలో పలు రకాల అనమానాలు సైతం రేకెత్తిస్తున్నాయి.

వివేకా హత్య కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ మొత్తం ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌ కుమార్‌ యాదవ్‌ చుట్టూ తిరుగుతోంది. కేసులో కీలక అనుమానితుడని భావిస్తున్న సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈయనతోపాటు ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిలు వివేకా హత్యకు కారకులని సీబీఐ తేల్చినట్లు, అయితే అందుకు బలాన్ని ఇచ్చే సాక్ష్యాధారాలను సేకరించే పనిలో విచారణాధికారులు ఉన్నారని వినికిడి. వివేకానందరెడ్డి, ఎర్రగంగిరెడ్డి మధ్య బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. దీంతో ఎర్రగంగిరెడ్డిపై అనుమానాలు రేకెత్తాయి. వివేకానందరెడ్డి దగ్గర ఎప్పుడూ ఉండే ఆయన మాజీ డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌ కుమార్‌ యాదవ్‌లు ఎర్రగంగిరెడ్డితో సన్నిహితంగా మెలిగేవారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐ.. వివేకా హత్య కేసులో ఆ ముగ్గురిపైనే ఎక్కువగా దృష్టి పెట్టి విచారణ సాగిస్తోంది.

మరోవైపు వివేకా హత్య కేసులో అసలు సూత్రధారుల జోలికి సీబీఐ వెళ్లకపోవచ్చు అనే చర్చ కూడా జిల్లా వాసుల్లో జరుగుతోంది.  వివేకాను హత్య చేసింది ఎవరనేది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెలుసని, నిందితులను కాపాడేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు సైతం ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గందరగోళానికి దారితీస్తున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో అసలేం జరుగుతోంది.. సీబీఐ చివరకు ఎవరిని దోషులుగా తేలుస్తుందో అన్న ఉత్కంఠ జిల్లా వాసుల్లో నెలకొంది.



కరోనా డేంజర్ సిగ్నల్.. ఆ నంబర్ పెరుగుతోంది..?

ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

ఏపీ : ఇంటర్ సప్లీ పరీక్షలపై క్లారిటీ.. !

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>