PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/happy-birthday-public-servant-obamaadf71717-b796-4ff3-a2fc-63b80828a8a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/happy-birthday-public-servant-obamaadf71717-b796-4ff3-a2fc-63b80828a8a3-415x250-IndiaHerald.jpgనేడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పుట్టిన రోజు. అతి సామాన్యుడిలా మెలిగిన ఆయన..ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. ఒబామా కేర్ తో ప్రజారోగ్యానికి పెద్ద పీఠ వేశారు. అంతేకాదు వివిధ దేశాలతో స్నేహపూర్వక వాతావరణం సృష్టించుకునేలా కృషి చేశారు. శాంతి స్థాపనకు పాటుపడ్డారు. ఒబామాను నోబెల్ కూడా వరించింది. Happy Birthday Public Servant Obama{#}Colombia;barack obama;Jaan;Prize;Republican Party;John;School;Gift;American Samoa;marriage;Degree;January;October;Allu Sneha;Election;Partyహ్యాపీ బర్త్ డే : ప్రజా సేవకుడు ఒబామా !హ్యాపీ బర్త్ డే : ప్రజా సేవకుడు ఒబామా !Happy Birthday Public Servant Obama{#}Colombia;barack obama;Jaan;Prize;Republican Party;John;School;Gift;American Samoa;marriage;Degree;January;October;Allu Sneha;Election;PartyWed, 04 Aug 2021 11:50:35 GMTబరాక్ ఒబామా. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే అమెరికాను ఏలిన తొలి నల్లజాతీయుడు. ఆఫ్రికన్ అమెరికన్ సంతతికి చెందిన వ్యక్తి.  1961వ సంవత్సరం ఆగస్ట్ 4వ తేదీన.. హవాయిలోని హొనొలులో జన్మించారు. అమెరికా ఖండంతో సంబంధం లేకుండా బయటపుట్టారు. కొలంబియా యూనివర్సిటీ.. హార్వర్డ్ లా స్కూల్ లలో డిగ్రీ పూర్తి చేశారు. 1992వ సంవత్సరం అక్టోబరు నెలలో మిచెల్ రాబిన్సన్ ను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు ఆయన హార్వర్డ్ లా రివ్యూకు ప్రెసిడెంట్ గా పనిచేశారు. లా చదువులో పట్టా పొందే ముందు ఒబామా చికాగోలో కమ్యూనిటీ నిర్వహకుడిగా పనిచేశారు. 1992 నుండి 2004వరకు చికాగో లా స్కూల్ యూనివర్సిటీలో కీలకంగా వ్యవహరించారు. సివిల్ రైట్స్ అటార్నీగా విధులు నిర్వర్తించారు. రాజ్యాంగ చట్టం గురించి ఎంతో చక్కగా బోధించారు. మరోవైపు 1997 నుంచి 2004 మధ్య కాలంలో ఇల్లినొయిస్ సెనేట్ లో విధులు నిర్వర్తించారు.

ఇక 2004వ సంవత్సరం ఒబామా జీవితంలో మరిచిపోలేనిది. ఎందుకంటే.. అమెరికా సెనేట్ ఎలక్షన్స్ లో ఆయన ఊహించని విజయం సాధించారు. దీంతో అమెరికా దేశం దృష్టిలోనే కాదు.. ప్రపంచం దృష్టిలో పడిపోయారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల్లో కలిసిపోయారు. తాను చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతీ ఒక్కరికీ తాను చేయబోయే పనులను పూసగుచ్చినట్టు చెప్పారు. ఇంకేముందీ ఆయన ప్లాన్ వర్కవుట్ అయింది. డెమెక్రటిక్ పార్టీ తరఫున ఊహించని విజయం సాధించారు. ఆ తర్వాత డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఒబామా చేసిన ప్రసంగం అన్నివర్గాల ప్రజలను వివరీతంగా ఆకట్టుకుంది.

ఇక 2007వ సంవత్సరంలో ఒక ప్రెసిడెంట్ గా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన ఆయన.. తన పార్టీలోని హిల్లరీ క్లింటన్ పైనే పై చేయించి సాధించారు. అధ్యక్ష పదవికి టికెట్ కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ మైక్ కైన్ ను ఓడించేశాడు. 2009సంవత్సరం జనవరి 20వ తేదీన అమెరికా ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. ఎప్పుడై ఆ దేశానికి అధ్యక్షుడయ్యారో.. ఆ తర్వాత తొమ్మిది నెలలకు నోబెల్ శాంతి బహుమతి పొందారు.

అంతర్జాతీయంగా దౌత్యం... ప్రజల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించేందుకు బరాక్ ఒబామా తీవ్రంగా తీవ్రంగా కృషి చేశారు. అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం తహతహలాడారు. అంతేకాదు ప్రజలు అతి తక్కువ ఖర్చుతో వైద్యసేవలు పొందేందుకు ఒక ఆరోగ్య చట్టాన్ని తీసుకొచ్చారు. అదే ఒబామా కేర్.

ఒబామా ప్రెసిడెంట్ అయ్యారే కానీ.. ఆయన ఎప్పుడు గర్వాన్ని.. అహంకారాన్ని ప్రదర్శించలేదు. బయటకు ఎక్కడికి వెళ్లినా.. సాధారణ వ్యక్తిలా కనిపించారు. ప్రజల్లో కలిసిపోయారు. పార్క్ లకు వెళ్లినా.. హోటల్ కు వెళ్లినా అక్కడున్న వారితో సరదాగా గడిపారు. వారి సమస్యలను తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కరించేవారు. అలా ఆయన ప్రజాధరణ పొందారు. అదే ఆయన్ను రెండు సార్లు అధ్యక్ష పీఠం ఎక్కేలా చేశాయి.









టీడీపీలో క్లారిటీ.. టికెట్ ఆ నేత‌కే అని బాబు సంకేతాలు..!

బిగ్ బ్రేకింగ్ :దేవినేని ఉమాకు బెయిల్

ఆర్ ఆర్ ఆర్ : దిగుమతి కథలు ఎగుమతి చేస్తారా ?

అంతన్నాడింతన్నాడు.. అర్థాంతరంగా ఆపేశాడు..

స‌స్పెన్ష‌న్ టైం : స‌చివాల‌యంలో కోల్డ్ వార్

ప‌త‌కం ఫ‌స్ట్ .. : ముందే కూసిన కోయిల..

ఒలంపిక్స్ లో ఒకరు పాతాళానికి.. ఒకరు ఆకాశానికి.. అసలేం జరిగింది..?

ఆర్ఆర్ఆర్ : "దోస్తీ" సాంగ్ కాపీనా... ఇదిగో ప్రూఫ్...!

ఆచార్య కు ఇంకా ముహూర్తం కుదరలేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>