PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-545c6b61-16d9-4a26-beb9-a6f3d4beb172-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-545c6b61-16d9-4a26-beb9-a6f3d4beb172-415x250-IndiaHerald.jpgఈ కథంతా పూర్తయిన తర్వాత సెప్టెంబర్ వరకు కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలకు, పార్టీ పదవులు, బాధ్యతలు అప్పగించే నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఎపిలో పర్యటించే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ బలోపేతానికి ఎంతో ఆలోచించి రాష్ట్రాలవారీగా బలోపేతం చేసే నాయకులను గుర్తించి వారికి పదవులు అప్పగించే అవకాశం ఉన్నది. దీని ద్వారా రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకొని ఎదురులేని శక్తిగా ఎదగాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.Political {#}rahul;Rahul Gandhi;september;Rahul Sipligunj;Doctor;Congress;Kumaar;central government;MP;Minister;Telangana Chief Minister;Andhra Pradesh;Partyఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?Political {#}rahul;Rahul Gandhi;september;Rahul Sipligunj;Doctor;Congress;Kumaar;central government;MP;Minister;Telangana Chief Minister;Andhra Pradesh;PartyWed, 04 Aug 2021 09:05:00 GMTఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితులపై రాహుల్ గాంధీ  కీలక చర్చలు చేస్తున్నారు. త్వరలోపలు కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. రాహుల్ గాంధీ  ఆగస్టు 10వ తేదీన ఢిల్లీకి రావాలని కొంతమంది సీనియర్ నేతలకు అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితులపై చర్చలు జరపనున్నారు. ఏపీలో కొంతమంది సీనియర్ నాయకులతో విడివిడిగా, ఆలోచనలు చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు. కాంగ్రెస్ ను ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసేందుకే రాష్ట్ర నేతల యొక్క  అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకొనున్నారు. రాష్ట్ర నేతల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు రాహుల్ గాంధీ.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ చింతామోహన్, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ ఎంపీ రామచంద్ర రావు, ఏఐసీసీ సెక్రటరీ రుద్రరాజులను ఢిల్లీకి రావాలని కోరింది కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ కు కొత్త పిసిసి అధ్యక్షుని  నియామకం కొరకు, కొంతమంది ఏపీ నేతలకు  జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించ నున్నట్లు సమాచారం.  ఏ ఐ సి సి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్  కేసి వేణుగోపాల్ తో సమావేశమై  విపులంగా చర్చించిన ఏపీ ఇంచార్జ్  ఉమాన్ చండి, ఇన్ఛార్జి సెక్రటరీలు క్రిస్టోఫర్, మయాప్పన్ రాహుల్ గాంధీతో సమావేశమై  సుదీర్ఘంగా చర్చించే  అవకాశం ఉందని ఒక నివేదికను కూడా అందజేశారు. వీరంతా కలిసి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ని ఎలా బలోపేతం చేయాలో అన్నదానిపై కార్యాచరణ రూపొందించి రాహుల్ గాంధీకి అందజేశారు.

ఇంచార్జ్ జనరల్ సెక్రెటరీ ఉమన్ అవసరాన్ని బట్టి మరికొంతమంది ఏపీ రాష్ట్ర నేతలను కూడా  విడిగా  కలిసే అవకాశం ఉంది. ఈ కథంతా పూర్తయిన తర్వాత సెప్టెంబర్ వరకు కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలకు, పార్టీ పదవులు, బాధ్యతలు అప్పగించే నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఎపిలో పర్యటించే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ బలోపేతానికి ఎంతో ఆలోచించి రాష్ట్రాలవారీగా  బలోపేతం చేసే నాయకులను గుర్తించి వారికి పదవులు అప్పగించే అవకాశం ఉన్నది. దీని ద్వారా రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ  పూర్వ వైభవాన్ని సంతరించుకొని ఎదురులేని శక్తిగా ఎదగాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.



హైదరబాద్ మ్యాన్ హోల్స్ కు మరో ఇద్దరు బలి.. ,!

ఏపీలో కాంగ్రెస్ బలపడనుందా..?

మెడికల్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు

మీ పిల్లలతో ఈ పూజ చేయించండి... ?

లాక్ డౌన్ దిశగా ఏపీ..? జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ఒలింపిక్స్ చెబుతున్న నిజం.. అమ్మాయిలే బంగారాలు..!

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>