PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-governer-biswa-bhushan-hari-chandan-birth-day4e16b364-5656-4f6c-b276-c39b514b3d0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-governer-biswa-bhushan-hari-chandan-birth-day4e16b364-5656-4f6c-b276-c39b514b3d0b-415x250-IndiaHerald.jpgనేడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టిన రోజు. ఆయనలో ఒక పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు.. ఒక పోరాటయోధుడు, ఒక సేవకుడు.. ఒక రచయిత దాగి ఉన్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా.. పలు శాఖలకు మంత్రిగా పగ్గాలు చేపట్టిన ఆయన ఎన్నో సంస్కరణలు చేపట్టారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇండియా హెరాల్డ్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు బర్త్ డే విషెస్ చెబుతోంది. ap governer biswa bhushan hari chandan birth day{#}puri jagannadh;Odisha;Leader;Writer;Hanu Raghavapudi;Party;Governor;Bharatiya Janata Partyహ్యాపీ బర్త్ డే : బిశ్వభూషణ్ హరిచందన్.. ఒక పోరాట యోధుడు!హ్యాపీ బర్త్ డే : బిశ్వభూషణ్ హరిచందన్.. ఒక పోరాట యోధుడు!ap governer biswa bhushan hari chandan birth day{#}puri jagannadh;Odisha;Leader;Writer;Hanu Raghavapudi;Party;Governor;Bharatiya Janata PartyTue, 03 Aug 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. ఒక పొలిటికల్ లీడర్ మాత్రమే కాదు.. ఒక కవి, రచయిత కూడా. అవినీతిపై సమర శంఖం పూరించిన గొప్ప వ్యక్తి. 2019 జులై 17వ తేదీన ఏపీకి గవర్నర్ గా నియమితులయ్యారు.

బిశ్వభూషణ్ హరిచందన్ ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు. ఖుర్దాలో 1934ఆగస్ట్ 3న పుట్టారు. 1964వ సంవత్సరంలో తమ రాష్ట్రంలో జన్ సంఘ్ శాఖను ఏర్పాటు చేయడమే కాదు.. స్వయం సేవకుడిగా ఆ కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగి జన్ సంఘ్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని అధిరోహించారు. ఇక 1975వ సంవత్సరంలో ఎమర్జెన్సీ వ్యతిరేక ఆందోళనలో తన పాత్ర పోషించి జైలు జీవితం కూడా గడిపారు.

ఒడిశాలోని చిలికా నియోజక వర్గం నుంచి జనతా పార్టీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 1977లో తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత బీజేపీ తరఫున భువనేశ్వర్ నుండి  ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు రెవెన్యూ, న్యాయ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన మార్కును చూపించారు. ఇక 1980 నుంచి సుదీర్ఘ కాలం.. దాదాపు ఎనిమిదేళ్ల పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాతి కాలంలో జనతా పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించారు. 1996 తిరిగి బీజేపీ గూటికి వచ్చి చేరారు. ఒకవైపు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూనే రచయితగా రాణించారు. పలు పుస్తకాలు కూడా రాశారు. ముఖ్యంగా అవినీతిపై పోరు సాగించేవారు. ఇక బిశ్వభూషణ్ హరిచందన్ కు మొక్కల పెంపకమంటే చాలా ఆసక్తి.  

ఇక పూరి జగన్నాథ ఆలయంపై బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ఆలయ పరిసరాల్లోని భక్తుల పట్ల సేవాభావాన్ని ప్రదర్శించేవారు. భక్తులకు, పూజాలకు బీమా వెసులుబాటు కల్పించారు. అంతేకాదు పూరీ జన్నాథ ఆలయం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు.







ఈ నెల‌లోనే థ‌ర్డ్ వేవ్‌..? జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే క‌ష్ట‌మే..

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

ప్రముఖ గాయని ఇకలేరు..!

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>