కరోనా థర్డ్ వేవ్ ; పిల్లలకు ప్రమాదం ఉండదు, ఆగస్ట్ చివరిలోనే ఆరంభం : మిచిగాన్ వర్సిటీ అధ్యయనం
భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ పై ఆందోళన కొనసాగుతోంది. ఈ నెలలోనే మరోమారు కొవిడ్-19 ఉద్ధృతి మొదలు కానుందని వివిధ పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం సామాజిక దూరి నిబంధనలు పాటించడం చెయ్యాలని, వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రభుత్వం పదే పదే సూచిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ అనివార్యమే అయినప్పటికీ దాని తీవ్రతను తగ్గించడంలో ప్రజల దే కీలక పాత్ర అని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం భారత దేశంలో కరోనా కొత్త కేసుల మధ్య హెచ్చుతగ్గుల ఊగిసలాట కొనసాగుతోంది. కరోనా క్షీణిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న మరోవిధంగా కరోనా థర్డ్ వేవ్ ఆందోళన కలిగిస్తుంది.

ఆగష్టు చివరి వారంలో థర్డ్ వేవ్ .. క్రమంగా పెరుగుదల
ఇదిలా ఉంటే తాజాగా మిచిగాన్ విశ్వవిద్యాలయం యొక్క మోడలింగ్ ప్రొజెక్షన్ ఆగష్టు చివరి వారంలో భారతదేశం మరో తరంగం దిశగా వెళుతున్నట్టు చూపిస్తోందని వెల్లడించింది. అయితే నవంబరు నెలలో పీక్స్ కు చేరే అవకాశం ఉందని మిచిగాన్ విశ్వవిద్యాలయం యొక్క మోడల్ స్పష్టం చేసింది. ప్రతిరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ, సమర్థవంతమైన పునరుత్పత్తి రేటు ఆర్ విలువ ఒకటి కంటే ఎక్కువ గా నమోదవుతున్న నేపథ్యంలో అనేక మోడలింగ్ అంచనాలు భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ పై అలర్ట్ చేస్తున్నాయి.

నవంబరు నాటికి పీక్స్ కి కరోనా థర్డ్ వేవ్
ఇక తాజాగా మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధన లో కూడా ఈ నెల చివరి వారంలో కరోనా థర్డ్ వేవ్ ఇండియాలో ప్రారంభమవుతుందని సూచించింది. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ జాన్ డి. కల్బ్‌ఫ్లెయిష్ కాలేజియేట్ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ మా నమూనాలు జూలైలో భారతదేశం ఒక పతనానికి చేరుకుంటుందని సూచించాయి. ఇదే సమయంలో మా మోడల్స్ ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి ఇప్పుడు చిన్న తరంగంతో మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. మరియు ఈ నెలాఖరు (ఆగస్టు) చివరికి క్రమంగా పెరుగుతూ నవంబరు చివరి నాటికి మూడవ వేవ్ పీక్స్ కి చేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనా ట్రెండ్స్ పై కొనసాగుతున్న అధ్యయనం
ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ముఖర్జీ, తన సొంత మోడలింగ్ అంచనాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మిచిగాన్‌లో ఆమె బృందం కరోనా ట్రెండ్ ఏ విధంగా కొనసాగుతుంది అన్న దానిపై అధ్యయనం చేస్తోంది . అందులో భాగంగా కేసుల మార్పు రేటును వారం వారం పర్యవేక్షిస్తుంది. ఫిబ్రవరిలో భారతదేశంలో రెండవ తరంగాన్ని వారు ఊహించారు. ఊహించినట్టుగానే కరోనా సెకండ్ వేవ్ భారత్ లో దారుణ పరిస్థితులను సృష్టించింది. ఇప్పుడు మళ్లీ కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది.

చిన్నారులకు ప్రమాదం .. ఊహాగానాలను తోసిపుచ్చిన ప్రొఫెసర్
ఇదే సమయంలో భారతదేశం వారికి కోవిడ్ -19 టీకాలు ఇంకా చిన్నారులకు ఇవ్వలేదు . మూడవ తరంగం పిల్లలను తాకుతుందనే ఊహాగానాలను ముఖర్జీ తోసిపుచ్చారు. భారతదేశంలో మూడవ తరంగం పిల్లలను అత్యంత దారుణంగా దెబ్బతీసే విషయం గురించి మాట్లాడిన ఆమె సెరో సర్వేలు యువకులలో కూడా గణనీయమైన సెరోప్రెవెలెన్స్ ఉందని సూచిస్తున్నాయి, అయితే పిల్లలలో తీవ్రత గురించి నివేదికలు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా కనిపిస్తున్నాయన్నారు. పిల్లలు, యుక్త వయసులో ఉన్నవారు కరోనా స్వల్ప లక్షణాలను కలిగి ఉన్నట్లు అనిపిస్తుందని ఆమె వెల్లడించారు. ఇక పిల్లలకు కరోనా థర్డ్ వేవ్ లో ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని ఆమె తోసిపుచ్చారు. ఏదేమైనా, భారతీయ జనాభాలో 40 శాతం 0-18 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. వారికి ఇంకా టీకాలు అందుబాటులో లేవు. ఈ వయస్సు కోసం టీకా ఎంపికలను ముందుగానే కొనసాగించాలని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో పెద్దలలో కూడా టీకా వేగం గురించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు

కరోనా థర్డ్ వేవ్ తీవ్రత కట్టడికి వ్యాక్సినేషన్ ఒక మార్గం
ప్రస్తుతం టీకాలలో గణనీయమైన పెరుగుదల అవసరం అని ఆమె పేర్కొన్నారు. తద్వారా సంఖ్యలు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యే సమయానికి, జనాభా స్థాయిలో రక్షణ అందుబాటులో ఉంటుంది, కాబట్టి ఆసుపత్రిలో చేరికలు బాగా తగ్గే అవకాశం ఉంటుందని ముఖర్జీ చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగించడం అవసరమని, ప్రస్తుతం ఇస్తున్న వ్యాక్సిన్ డోసులను మించి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగాలని ఆమె సూచించారు.

థర్డ్ వేవ్ పై వివిధ నమూనాల మధ్య సారూప్యత
ముఖర్జీ యొక్క అంచనా కూడా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ - హైదరాబాద్ పరిశోధకులు వేసిన అంచనాలానే ఉంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ అంతర్గత మోడలింగ్ అంచనాలు అక్టోబర్ వరకు సంఖ్యలు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యే వరకు కొంత విరామం ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. వాస్తవ పెరుగుదల బహుశా అక్టోబర్ నాటికి జరగడం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలి సెరో సర్వే సూచించినట్లుగా యాంటీబాడీ స్థాయిలు అప్పటికి క్షీణించడం ప్రారంభిస్తాయి. వైరస్ కూడా పరివర్తన చెందుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి మ్యూటేషన్లు పరివర్తన చెందుతున్న నేపథ్యంలో తాజాగా మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధనలో భాగంగా కరోనా థర్డ్ వేవ్ పరిస్థితినే కాకుండా,తీసుకోవాల్సిన చర్యలు కూడా వెల్లడించారు .