MoviesN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiranjeevi-doop-raja-problems34d03bff-d7af-4860-8bd2-37c5d5fc84d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiranjeevi-doop-raja-problems34d03bff-d7af-4860-8bd2-37c5d5fc84d4-415x250-IndiaHerald.jpgమెగాస్టార్‌ చిరంజీవి మనసున్న మనిషి... సినీ పరిశ్రమలో కష్టాల్లో ఉన్నవారిని మానవతా ధృక్పథంతో ఆదుకోవడంలో ఆయన ముందుంటారు అని సినీ పరిశ్రమ వర్గాలు అంటుంటాయి. చిరంజీవి నుంచి సాయం పొందినవారు.. ఆయన చేసిన మేలు గురించి ఏదోఒక సందర్భంలో వెల్లడిస్తుండటం, అది సినీ పరిశ్రమలో చర్చగా మారడం జరుగుతూ ఉంటుంది. తాజాగా ఒక కో డైరెక్టర్‌ వెల్లడించిన విషయాలు.. మెగాస్టార్‌ పెద్ద మనసు, మంచి హృదయానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.chiru help again{#}job;Film Industry;Coronavirus;Chiranjeevi;Director;Darsakudu;Chitram;Cinemaచిరు సాయంపై ఆ కో-డైరెక్టర్‌ పెద్దమాట!చిరు సాయంపై ఆ కో-డైరెక్టర్‌ పెద్దమాట!chiru help again{#}job;Film Industry;Coronavirus;Chiranjeevi;Director;Darsakudu;Chitram;CinemaTue, 03 Aug 2021 08:46:18 GMTమెగాస్టార్‌ చిరంజీవి మనసున్న మనిషి... సినీ పరిశ్రమలో కష్టాల్లో ఉన్నవారిని మానవతా ధృక్పథంతో ఆదుకోవడంలో ఆయన ముందుంటారు అని సినీ పరిశ్రమ వర్గాలు అంటుంటాయి.  చిరంజీవి నుంచి సాయం పొందినవారు.. ఆయన చేసిన మేలు గురించి ఏదోఒక సందర్భంలో వెల్లడిస్తుండటం, అది సినీ పరిశ్రమలో చర్చగా మారడం జరుగుతూ ఉంటుంది. తాజాగా ఒక కో డైరెక్టర్‌ వెల్లడించిన విషయాలు.. మెగాస్టార్‌ పెద్ద మనసు, మంచి హృదయానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.

ఇటీవల కరోనా కష్టకాలంలో సినీ పరిశ్రమ అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి దెబ్బకు సినీ పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. ఇండస్ట్రీపైనే ఆధారపడిన వారి బతుకులు ఛిద్రం అయిపోయాయి. జీవనం కష్టంగా మారింది. నిజ జీవితంలో సినిమా కష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి చాలా మందికి సాయం అందించారు. కష్టకాలంలో నేనున్నానని ముందుకొచ్చి.. వారి అవసరాలను తీర్చారు. ఇదే క్రమంలో ఆయన చేసిన మరో మేలు ఆలస్యంగా బయటపడింది. ఆ వివరాల్లోకి వెళితే.. చిరంజీవి నటించిన చిత్రం లంకేశ్వరుడు. నిజానికి ఈ చిత్ర దర్శకుడు దాసరి. ఆ చిత్రానికి కో డైరెక్టర్‌గా ప్రభాకర్‌ పనిచేశారు. ౩౦ ఏళ్ల క్రితం తాను లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవితో కలిసి పనిచేసిన తనకు ఆయన చేసిన ఆర్థిక సాయం జీవితంలో మరువలేనని కో డైరెక్టర్‌ ప్రభాకర్‌ ఓ ఇంటర్య్వూలో చెప్పారు.

కరోనా కారణంగా సినిమా షూటింగులు ఆగిపోవడంతో సినీ పరిశ్రమపై ఆధారపడిన చాలా మంది జీవితాలు ఒక్కసారిగా స్తంభించాయి. అప్పటికే కో డైరెక్టర్‌ ప్రభాకర్‌ కూడా హెల్ప్‌లైన్‌ అనే సినిమాను నిర్మించి తీవ్రంగా నష్టపోయారు. ఆర్థిక కష్టాలకుతోడు కరోనా కాలం కమ్మేసిన క్రమంలో పిల్లల చదువుల ఫీజులు గుదిబండగా మారాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆయన చిరంజీవిని ఆశ్రయించారు. ప్రభాకర్‌ ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు విని చిరంజీవి చలించిపోయారు. బీబీఏ ఆఖరు సంవత్సరం చదువుతున్న ప్రభాకర్‌ కూతురు పరీక్ష ఫీజుకు రూ2.5 లక్షలు సాయంగా అందించారు. అలాగే ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ప్రభాకర్‌ కుమారుడుకి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ముప్పై సంవత్సరాల కిందట లంకేశ్వరుడు సినిమా షూటింగ్‌ సమయంలో చిరంజీవి తమ పట్ల చాలా ఆప్యాయత చూపించేవారనీ, ఇప్పుడు కూడా ఆయన అలాంటి అనురాగాన్ని కనబరిచారని కో డైరెక్టర్‌ ప్రభాకర్‌ చెప్పుకొచ్చారు. చిరంజీవి చేసిన సాయాన్ని తమ కుటుంబం జీవితాంతం గుర్తు ఉంచుకుంటుందని ఇంటర్య్వూలో ఆయన వెల్లడించడం.. మెగా ఫ్యాన్స్‌లోనే కాకుండా సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.



హుజురాబాద్ టిఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటా..!

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

ప్రముఖ గాయని ఇకలేరు..!

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>