MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cm-jagancac2ad8e-bc37-4532-8287-02523a8167e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cm-jagancac2ad8e-bc37-4532-8287-02523a8167e5-415x250-IndiaHerald.jpgబిజెపి వ్యతిరేక పార్టీలతో రాహుల్ గాంధీ సమావేశం జరిపార‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని వివిధ ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయని తెలిపారు. రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో మోడీ వ్యతిరేక శక్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజులలో మోడి వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని స‌మావేశంలో నిర్ణయించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదీజలాల పై రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసారని..cm jagan{#}G Kishan Reddy;Santhossh Jagarlapudi;Narendra;Rajya Sabha;MP;Aqua;Rahul Gandhi;Parliment;Revanth Reddy;central government;contract;Delhi;August;Telangana;CM;TPCC;revanth;Telangana Rashtra Samithi TRS;kaushik;Kumaar;Governor;Andhra Pradesh;Bharatiya Janata Party;Party;KCR;Godavari River;warఏపీ సీఎం వ‌ల్ల ఎడారిగా తెలంగాణ‌..?ఏపీ సీఎం వ‌ల్ల ఎడారిగా తెలంగాణ‌..?cm jagan{#}G Kishan Reddy;Santhossh Jagarlapudi;Narendra;Rajya Sabha;MP;Aqua;Rahul Gandhi;Parliment;Revanth Reddy;central government;contract;Delhi;August;Telangana;CM;TPCC;revanth;Telangana Rashtra Samithi TRS;kaushik;Kumaar;Governor;Andhra Pradesh;Bharatiya Janata Party;Party;KCR;Godavari River;warTue, 03 Aug 2021 16:30:03 GMTబిజెపి వ్యతిరేక పార్టీలతో రాహుల్ గాంధీ సమావేశం జరిపార‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని వివిధ ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయని తెలిపారు. రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో మోడీ వ్యతిరేక శక్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజులలో మోడి వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని స‌మావేశంలో నిర్ణయించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదీజలాల పై రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసారని... ఏపి సీఎం వైఖరి వల్ల తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం నీటి వివాదాల విషయంలో ఏపీ ప్రభుత్వ అనుకూల వైఖరి అవలంబిస్తూ, కీలక సమావేశాలకు గైర్హాజరు అయ్యారంటూ రేవంత్ మండిప‌డ్డారు. ఢిల్లీ మీద యుద్ధం అంటూ గతంలో ప్రకటించిన కేసీఆర్ , పార్లమెంట్ సమావేశాలలో ఒక్క రోజయినా తన పార్టీ ఎంపిలతో కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదంటూ రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరు కావడం వల్ల మరోసారి నరేంద్ర మోడికి తాను అనుకూలం అని కేసీఆర్ స్పష్టం చేసారంటూ ఆరోపించారు. కేసీఆర్ - మోడీ వేరువేరు కాదని, కవలపిల్లు అంటూ వ్యాఖ్యానించారు. వారు నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారంటూ కామెంట్ చేశారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు తన పాదయాత్ర ఎందుకు వాయిదా వేసుకున్నారంటూ రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. పార్లమెంట్ సమావేశాల రోజు ఎంపి జోగినపల్లి సంతోష్ ఐదుగురు రాజ్యసభ ఎంపిలతో కలసి ప్రధానిని కలిసారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కొంత సమయం తరవాత ప్రధానితో ఎంపి సంతోష్ కుమార్ ఏకాంతంగా ఎందుకు సమావేశం అయ్యారో కేసీఆర్ సమాధానం చెప్పాలంటూ రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఎంపి సంతోష్ కుమార్ ప్రధానితో జరిపిన సమావేశం గురించి సీఎం కేసీఆర్ కు తెలుసా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మాట్లాడితే ఎందుకు బహిర్గతం చేయలేదని నిల‌దీశారు. తెలంగాణ కు సంబంధించిన ఒక్క అంశం పై కూడా 15 రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడలేదని అన్నారు. రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఎక్కడ జరిగిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ తాను చేసిన ఆర్ధిక కుంభకోణాల నుండి తప్పించుకోవడానికి మోడికి గులాంగిరీ చేస్తున్నారంటూ రేవంత్ ఆరోపించారు. ఆగష్టు 9 నుండి కేసీఆర్ అవలంబిస్తున్న దళిత, గిరిజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేతలతో క‌లిసి తాము పోరాటం చేయబోతున్నామని అన్నారు. కేసీఆర్ అవలంబిస్తున్న మోడీ అనుకూల విధానాల కారణంగా తెలంగాణ కు తీరని నష్టం జరుగుతుందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండిసంజయ్ పాదయాత్ర బండి ఆగపోవడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణం కాదా? అని ప్ర‌శ్నించారు. కిషన్ రెడ్డి ప్రధానితో మాట్లాడి బండి సంజయ్ పాదయాత్ర ఆపించాడంటూ ఆరోపించారు. గవర్నర్ కోటాలో 64 కళలలో నిష్ణాతులకు ఇస్తారని కానీ కోవర్టు అనే 65వ కళలో నిష్ణాతులు అయిన కౌశిక్ రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడంటూ మండిప‌డ్డారు. దీనిపై ఒక్క తెలంగాణ బీజేపీ నేత మాట్లాడడం లేదని రేవంత్ సీరియస్ అయ్యారు.  



ఏపీ సీఎం వ‌ల్ల ఎడారిగా తెలంగాణ‌..?

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>