Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/megastar-chiranjeevi-god-father30eb19ad-54c6-41e4-8d06-b90947eaed55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/megastar-chiranjeevi-god-father30eb19ad-54c6-41e4-8d06-b90947eaed55-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి నట్సితున్న లూసిఫర్ రీమేక్ మూవీ అతి త్వరలోనే షూటింగ్ కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని తమిళ స్టార్ డైరక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. మళయాలంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ మూవీని తెలుగులో చిరు ఇమేజ్ కు తగినట్టుగా మార్చి సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీకి టైటిల్ గా గాడ్ ఫాదర్ అన్నది పరిశీలనలో ఉంది. ఈ టైటిల్ తో ఆల్రెడీMegastar-Chiranjeevi-God-Father{#}God Father;sampath;Raccha;Tamil;March;Pawan Kalyan;sampath nandi;Bobby;editor mohan;Chiranjeevi;Remake;Cinemaచిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!Megastar-Chiranjeevi-God-Father{#}God Father;sampath;Raccha;Tamil;March;Pawan Kalyan;sampath nandi;Bobby;editor mohan;Chiranjeevi;Remake;CinemaTue, 03 Aug 2021 18:22:20 GMTమెగాస్టార్ చిరంజీవి నట్సితున్న లూసిఫర్ రీమేక్ మూవీ అతి త్వరలోనే షూటింగ్ కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ మూవీని తమిళ స్టార్ డైరక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. మళయాలంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ మూవీని తెలుగులో చిరు ఇమేజ్ కు తగినట్టుగా మార్చి సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీకి టైటిల్ గా గాడ్ ఫాదర్ అన్నది పరిశీలనలో ఉంది. ఈ టైటిల్ తో ఆల్రెడీ ఓ డైరక్టర్ రిజిస్టర్ చేయించుకున్నాడట.

మెగాస్టార్ మూవీకి అనుకున్న గాడ్ ఫాదర్ టైటిల్ ను అంతకుముందే సంపత్ నంది రిజిస్టర్ చేయించుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ టైటిల్ కోసం సంపత్ నందికి మెగా కాంపౌండ్ నుండి పిలుపు వెళ్లిందట. స్వతహాగా మెగా ఫ్యాన్ అయిన సంపత్ నంది చిరు టైటిల్ అడిగితే ఇవ్వనంటాడా చెప్పండి. సంపత్ నందిని టైటిల్ ఇవ్వాలని చిరు కోరినట్టు టాక్. సంపత్ నంది కూడా దానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి చిరు టైటిల్ గాడ్ ఫాదర్ మరో దర్శకుడి దగ్గర నుండి తీసుకున్నారు.

సంపత్ నంది ఆ సినిమా ఎవరితో అనుకున్నారో కాని మొత్తానికి గాడ్ ఫాదర్ టైటిల్ చిరంజీవి మూవీ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. సంపత్ నంది మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో రచ్చ మూవీ చేసిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉండటం వల్లే సంపత్ నంది టైటిల్ అడగ్గానే ఇచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. మరి గాడ్ ఫాదర్ గా చిరు ఎలా ఉంటారు. మోహన్ రాజా మెగాస్టార్ ని ఏ రేంజ్ లో చూపించారు అన్నది తెలియాలంటే మూవీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇదే కాదు కె.ఎస్ బాబీ డైరక్షన్ లో కూడా మెగాస్టార్ మూవీ కూడా త్వరలోనే షూటింగ్ కు రెడీ అవుతుందని అంటున్నారు. రెండు మూవీస్ ను మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.







చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>