QuotesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/good-habbite-for-man0fd5c25a-8461-4589-a3e2-a7ef5b9ba594-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/good-habbite-for-man0fd5c25a-8461-4589-a3e2-a7ef5b9ba594-415x250-IndiaHerald.jpgఒకానొక సమయం లేదా సందర్భంలో మనలో తప్పకుండా చెడు అలవాట్లు లేదా చెడు ఆలోచనలు మొదలవుతాయి. అలా వచ్చినప్పుడు మనకు తప్పకుండా తెలుస్తుంది. ఏది మంచి..? ఏది చెడు..? అని తెలుసుకోవాలి.. అలా మనకు తెలిసిన రోజున వెంటనే వాటిని తుడిచి వేయడం మంచిది. చెడు ఆలోచనలకు లేదా చెడు అలవాట్లకు బానిస అయితే మాత్రం జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు గురువుగారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గర్లో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ..నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారGOOD HABBITE FOR MANమంచిమాట: మనలో మొలచిన చెడు అలవాట్లను.. మొక్కగా ఉన్నప్పుడే తుంచి వేయాలి..మంచిమాట: మనలో మొలచిన చెడు అలవాట్లను.. మొక్కగా ఉన్నప్పుడే తుంచి వేయాలి..GOOD HABBITE FOR MANTue, 03 Aug 2021 14:00:00 GMTఒకానొక సమయం లేదా సందర్భంలో మనలో తప్పకుండా చెడు అలవాట్లు లేదా చెడు ఆలోచనలు మొదలవుతాయి. అలా వచ్చినప్పుడు మనకు తప్పకుండా తెలుస్తుంది. ఏది మంచి..? ఏది చెడు..? అని తెలుసుకోవాలి.. అలా మనకు తెలిసిన రోజున వెంటనే వాటిని తుడిచి వేయడం మంచిది. చెడు ఆలోచనలకు లేదా చెడు అలవాట్లకు బానిస అయితే మాత్రం జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం.


ఒకరోజు గురువుగారు తన ప్రియమైన శిష్యుడితో దగ్గర్లో ఉన్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ..నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. అతనికి దగ్గరలో ఉన్న నాలుగు మొక్కలను చూచాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు పుడుతున్న చిన్న ముక్క. ఇక రెండవది కొంచెం పెద్ద మొక్క .మూడవది దానికన్నా కొంచెం పెద్ద మొక్క. నాలుగవ అతి పెద్ద చెట్టు. గురువుగారు శిష్యుడిని చూసి ఆ చిన్న మొక్కను లాగేయమని చెప్పాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేశాడు. ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ అలాగే చేయమన్నాడు. ఆ పిల్లవాడు కొంచెం కష్టపడి దానిని కూడా లాగేసాడు. మూడవ దానిని కూడా లాగమన్నాడు. ఇక ఇప్పుడు ఎలాగైనా సరే దానిని లాగడానికి తన శక్తినంతా ఉపయోగించి , కష్టపడి లాగేసాడు. బాగా ఎదిగిన చెట్టును కూడా చూపించి దానిని కూడా లాగేయమని గురువుగారు చెప్పారు. ఇక ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ తన రెండు చేతులను కూడా వేసి  ఎంత ప్రయత్నించినా ఆ చెట్టును కదిలించలేక పోయాడు.

అయినా ఆపకుండా ప్రయత్నం చేస్తున్న కుర్రాడితో.. గురువుగారు.. చూడు నాయనా..! మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లకు బానిస అయితే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మానై వంగునా.. అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది.ఎంత ప్రయత్నించినా ..? ఆ పాత అలవాట్లు మనల్ని వదిలి పోవు అన్నాడు గురువుగారు.



కాజల్ గొంతెమ్మ కోరిక.. నిర్మాతకు కొత్త టెన్షన్ ?

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!

రు. 16 కోట్ల ఇంజెక్ష‌న్ ఇచ్చినా... చావును ఆప‌లేక‌పోయారే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>