MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ntr-ramcharan99380f8e-2947-4bf9-945e-0d1989873b2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ntr-ramcharan99380f8e-2947-4bf9-945e-0d1989873b2d-415x250-IndiaHerald.jpgనందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ప్రేక్షకులను మెప్పించి కీర్తి ప్రతిష్టలు పొందారు. టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నారు. అంతే కాకుండా అప్పుడపుడు తమ పార్టీ టిడిపి ప్రచారం కోసం తళుక్కుమంటుంటారు.NTR-RAMCHARAN{#}kirti;Jr NTR;Ram Charan Teja;NTR;Tollywood;Party;TDP;CMఎన్టీఆర్ తన ఫ్రెండ్ కోరిక తీరుస్తాడా ?ఎన్టీఆర్ తన ఫ్రెండ్ కోరిక తీరుస్తాడా ?NTR-RAMCHARAN{#}kirti;Jr NTR;Ram Charan Teja;NTR;Tollywood;Party;TDP;CMTue, 03 Aug 2021 09:00:00 GMTనందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ప్రేక్షకులను మెప్పించి కీర్తి ప్రతిష్టలు పొందారు. టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నారు. అంతే కాకుండా అప్పుడపుడు తమ పార్టీ టిడిపి ప్రచారం కోసం తళుక్కుమంటుంటారు. ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ తమను పాలించాలని, అన్న ఎన్టీఆర్ మార్గంలో నడిచి ప్రజలకు మరింత చేరువ కావాలని సందర్భం వచ్చిన ప్రతిసారీ  నందమూరి ఫ్యాన్స్ తారక్ ను అడుగుతూనే ఉంటారు. అయితే 40 ఏళ్ళు దాటాక ఓ సీనియార్టీ వచ్చాక తారక్ స్వయంగా టిడిపి పగ్గాలు అందుకోవాలని యోచిస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. మరో వైపు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పార్టీని మళ్లీ నిలబెట్టమని పర్సనల్ గా కలిసి మరి చెబుతున్నట్లు చెబుతున్నారు. 

అయితే పాలిటిక్స్ పై ఎన్టీఆర్ మనసులో దాగి ఉన్న అసలు విషయం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. నిజానికి ఆయన రానివ్వలేదు కూడా అని అంటుంటారు. అయితే ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే ఒకటి ఎదురయ్యిందట. ప్రస్తుతం తారక్ ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్ చేస్తూ బుల్లితెరపై కూడా ప్రేక్షకుల్ని అలరిస్తున్న విషయం  తెలిసిందే. అయితే ఈ షోకి గెస్ట్ గా రామ్ చరణ్ ను ఆహ్వానించారని ఆయన్ని తారక్ ప్రశ్నలు అడుగగా దాదాపు 25 లక్షల వరకు గెలుచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.  ఇలా షో జరుగుతున్న సమయంలో చెర్రీ ...ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం గురించి అడిగినట్లు సమాచారం. నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళుతున్నావ్ అంటున్నారు అని అడిగారట చెర్రీ.

దానిపై స్పందించిన ఎన్టీఆర్ పాలిటిక్స్ పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారట అయితే ఆ చర్చను ఎడిటింగ్ లో తీసేయమని షో యాజమాన్యానికి తెలిపారట ఎన్టీఆర్. దీంతో ఆ పార్ట్ డిలీట్ చేశారని...దాంతో రాజకీయాల పట్ల తారక్ ఏమని మాట్లాడారో చెర్రీకి, మరియు అక్కడి ప్రేక్షకులకు తప్ప బయట వారికి తెలిసే చాన్స్ లేకుండా పోయిందని అంటున్నారు. మరి రామ్ చరణ్ కోరిక మేరకు త్వరలోనే రాజకీయాల వైపు తన దృష్టిని మరలిస్తాడా చూడాలి.



వైసీపీలో ఈ మాస్టార్‌కు చెక్ పెట్టేశారా ?

రాధాకృష్ణులు పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా ?

ప్రముఖ గాయని ఇకలేరు..!

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>