Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vi-eec9b111-d89b-430b-841f-a53153ebcced-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vi-eec9b111-d89b-430b-841f-a53153ebcced-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్లో ఉన్న ప్రముఖ టెలికాం రంగ సంస్థలలో ఒకటైన వొడాఫోన్ ఐడియా గత కొంత కాలం నుంచి కోలుకోలేనంతగా నష్టాలలో కొనసాగుతూ వస్తోంది. నష్టాల నుంచి తేరుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వొడాఫోన్ ఇండియా సంస్థకు మాత్రం నిరాశ ఎదురవుతుంది. ఆదిత్య బిర్లా కంపెనీ నిర్వహించే వొడాఫోన్ ఐడియా సంస్థ ఇక మరికొన్ని రోజుల్లో మూత పడుతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అని అనిపిస్తుంది ఇప్పటికే భారీగా నష్టాల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా తేరుకోలేకపోతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్Vi.{#}adhithya;Kumaar;Yevaru;Idea;Vodafoneవొడాఫోన్ ఐడియా పరిస్థితేంటి.. కుమార్ మంగళం బిర్లా సంచలన ప్రకటన?వొడాఫోన్ ఐడియా పరిస్థితేంటి.. కుమార్ మంగళం బిర్లా సంచలన ప్రకటన?Vi.{#}adhithya;Kumaar;Yevaru;Idea;VodafoneTue, 03 Aug 2021 15:12:00 GMTప్రస్తుతం భారత్లో ఉన్న ప్రముఖ టెలికాం రంగ సంస్థలలో ఒకటైన వొడాఫోన్ ఐడియా గత కొంత కాలం నుంచి కోలుకోలేనంతగా నష్టాలలో కొనసాగుతూ వస్తోంది. నష్టాల నుంచి తేరుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వొడాఫోన్ ఇండియా సంస్థకు మాత్రం నిరాశ ఎదురవుతుంది. ఆదిత్య బిర్లా కంపెనీ నిర్వహించే  వొడాఫోన్ ఐడియా సంస్థ ఇక మరికొన్ని రోజుల్లో మూత పడుతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అని అనిపిస్తుంది  ఇప్పటికే భారీగా నష్టాల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా తేరుకోలేకపోతుంది.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భారత్లో ప్రముఖ వ్యాపార వేత్త గా కొనసాగుతున్న ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఇటీవలే వొడాఫోన్ ఐడియా సంస్థలోని తన షేర్స్ అన్నింటినీ కూడా అమ్మేందుకు సిద్ధమవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.  వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ లోని తన వాటా షేర్స్ ని ఇక ప్రభుత్వానికి లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సంస్థలకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఒక ఆఫర్ ప్రకటించారు కుమార్ మంగళం బిర్లా. ఇక తద్వారా కంపెనీ కార్యకలాపాలు కొనసాగించడానికి వీలు ఉంది అంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.



 ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా సంస్థ 50 వేల  499.63 కోట్ల రూపాయల బకాయి పడింది. ఈ క్రమంలోనే లెక్కలు సరి చేయాలని కోరుతూ ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలయింది. అయితే ఈ పిటిషన్ ను మాత్రం అటు సుప్రీంకోర్టు తిరస్కరించడం గమనార్హం. అదే సమయంలో ఇక వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరు సుముఖత చూపించడం లేదు. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ లోని తన వాటా షేర్స్ ని విక్రయించేందుకు సిద్ధమయ్యాను అంటూ ఇటీవలే కుమార్ మంగళం బిర్లా ప్రకటించారు. ఇలా తన వాటా షేర్లను ఇతర సంస్థలకు అప్పగించడం తగినదిగా అభిప్రాయం వ్యక్తం చేశారు.  అయితే ఇప్పటికే వొడాఫోన్ ఐడియా సంస్థ ఎప్పుడు మూత పడుతుందో అని టాక్ వినిపిస్తుంది  ఇక ఇప్పుడు కుమార్ మంగళం బిర్లా తీసుకున్న నిర్ణయం తో ఇక వోడాఫోన్ ఐడియా  సంస్థ పని అయిపోయింది అని అనుకుంటున్నారు అందరు.



షాకింగ్ : చితిపైనే ప్రేమ పెళ్లి?

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!

రు. 16 కోట్ల ఇంజెక్ష‌న్ ఇచ్చినా... చావును ఆప‌లేక‌పోయారే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>