PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maha-floodsd84eb4df-62a9-424b-832b-d09310c98643-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maha-floodsd84eb4df-62a9-424b-832b-d09310c98643-415x250-IndiaHerald.jpgమధ్యప్రదేశ్‌లో మంగళవారం భారీ వర్షాల కారణంగా అనేక జిల్లాలు వరదలో చిక్కుకున్నాయి. రుతుపవనాల కారణంగా కురిసిన వర్షాల వల్ల గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని 1171 గ్రామాలు ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో వాతావరణ శాఖ 25 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గ్వాలియర్, శివపురి, గుణ, అశోక్ నగర్, డాటియా, షియోపూర్, మోరెనా మరియు భింద్‌లో రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) రాజేష్ రాజోరా మాట్లాడుతూ శివపురి, షియోపూర్, గ్వాలియర్, డాటియా జిల్లాలలో సహాయక చర్యల కోసం సైFloods in Madhya Pradesh;{#}District;Survey;Red;ashok;tuesday;Prime Minister;Telangana Chief Minister25 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్25 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్Floods in Madhya Pradesh;{#}District;Survey;Red;ashok;tuesday;Prime Minister;Telangana Chief MinisterTue, 03 Aug 2021 21:24:07 GMTమధ్యప్రదేశ్‌లో మంగళవారం భారీ వర్షాల కారణంగా అనేక జిల్లాలు వరదలో చిక్కుకున్నాయి. రుతుపవనాల కారణంగా కురిసిన వర్షాల వల్ల గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని 1171 గ్రామాలు ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో వాతావరణ శాఖ 25 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గ్వాలియర్, శివపురి, గుణ, అశోక్ నగర్, డాటియా, షియోపూర్, మోరెనా మరియు భింద్‌లో రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) రాజేష్ రాజోరా మాట్లాడుతూ శివపురి, షియోపూర్, గ్వాలియర్, డాటియా జిల్లాలలో సహాయక చర్యల కోసం సైన్యాన్ని పిలిచినట్లు చెప్పారు. అదే సమయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పరిస్థితి గురించి తెలియజేశారు. మోడీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చాడు.

శివపురి జిల్లా పిప్రౌధ గ్రామంలో మంగళవారం ఉదయం ఐదుగురు వ్యక్తులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇది కాకుండా బీచి గ్రామంలో సుమారు 24 గంటల పాటు ముగ్గురు వ్యక్తులు చెట్టుపై చిక్కుకున్నారు. ఈ వ్యక్తులు వరద నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కారు. తరువాత అక్కడే చిక్కుకుపోయారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆరెఫ్) బృందం ఈ ముగ్గురు వ్యక్తులను పడవ సహాయంతో రక్షించినట్లు ముఖ్యమంత్రి చౌహాన్ తెలియజేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నట్లు ఆయన తెలిపారు.

చౌహాన్ గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని మొత్తం 1171 గ్రామాలు అధిక వర్షపాతం కారణంగా ప్రభావితమయ్యాయని, ముఖ్యంగా శివపురి మరియు షియోపూర్, ఇక్కడ 800 మి.మీ వర్షపాఠం నమోదవడంతో వరద పోటెత్తిందని, ఇప్పటివరకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆరెఫ్), ఎస్డీఆరెఫ్ 1600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయని ఆయన చెప్పారు. 200 గ్రామాలు ఇంకా ముంపునకు గురవుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను రక్షించడానికి పడవల సహాయాన్ని తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చౌహాన్ తెలియజేశారు. వరదల కారణంగా రెండు అక్కడ రెండు బ్రిడ్జిలు కూలిపోయాయి.





25 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>