PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tollywoodc0dd60fd-014d-4337-be1a-3a4b566610f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tollywoodc0dd60fd-014d-4337-be1a-3a4b566610f9-415x250-IndiaHerald.jpgప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోసం సినిమా న‌టీన‌టులు చాలా క‌ష్ట ప‌డుతారు. సినిమా స్క్రిప్టుకు ద‌గ్గ‌ట్టుగా త‌మ శ‌రీరాకృతిని మార్చుకుంటారు. పాత్ర‌కు ద‌గ్గ‌ట్టుగా బాడీని డిజైన్ చేసుకుంటారు.. ఇలా ప్ర‌తి దానిలో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీని కోసం హీరోలు జిమ్‌ల‌ల్లో తెగ క‌ష్ట‌ప‌డి చెమ‌టోడుస్తుంటారు. అలాగే వాళ్లు తీసుకునే ఆహారం పైన ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హిస్తారు. టైమ్ టూ టైమ్ డైట్ ఫాలో అవుతుంటారు. అందుకే వాళ్ల‌కు ఆ రేంజులో బాడీ షేప్‌, ఫిట్‌నెస్ ఉంటుంది. ఇదే కోవ‌లోకి మెగా హిరో వ‌రుణ్ తేజ్ కూడా వ‌స్తాడtollywood{#}siddhu;anil ravipudi;F3;Bobby;Cinemaవ‌రుణ్ కండ‌ల `గ‌ని`.. జిమ్‌లో చెమ‌టోడుస్తున్న మెగా హిరో..వ‌రుణ్ కండ‌ల `గ‌ని`.. జిమ్‌లో చెమ‌టోడుస్తున్న మెగా హిరో..tollywood{#}siddhu;anil ravipudi;F3;Bobby;CinemaTue, 03 Aug 2021 11:23:00 GMT ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోసం సినిమా న‌టీన‌టులు చాలా క‌ష్ట ప‌డుతారు. సినిమా స్క్రిప్టుకు ద‌గ్గ‌ట్టుగా త‌మ శ‌రీరాకృతిని మార్చుకుంటారు. పాత్ర‌కు ద‌గ్గ‌ట్టుగా బాడీని డిజైన్ చేసుకుంటారు.. ఇలా ప్ర‌తి దానిలో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీని కోసం హీరోలు జిమ్‌ల‌ల్లో తెగ క‌ష్ట‌ప‌డి చెమ‌టోడుస్తుంటారు. అలాగే వాళ్లు తీసుకునే ఆహారం పైన ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హిస్తారు. టైమ్ టూ టైమ్ డైట్ ఫాలో అవుతుంటారు. అందుకే వాళ్ల‌కు ఆ రేంజులో బాడీ షేప్‌, ఫిట్‌నెస్ ఉంటుంది.

  ఇదే కోవ‌లోకి మెగా హిరో వ‌రుణ్ తేజ్ కూడా వ‌స్తాడు. త‌న కొత్త సినిమా `గ‌ని` కోసం జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న వీడియో సోష‌ల్ మిడియాలో వైర‌ల్ అవుతుంది. బ్యాక్ లుక్‌లో తీసిన వీడియోలో వ‌ర‌ణ్ పుల్ అప్స్ తీస్తూ క‌నిపిస్తు హార్డ్ వ‌ర్క్‌కు బ్యాక్ అప్ ఉండుదు అంటూ క్యాప్ష‌న్ ను జోడించాడు. అల్లు బాబీ మరియు సిద్దు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న గ‌నికి కిర‌ణ‌ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. బాక్సింగ్ నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ సినిమాలో వ‌రుణ్ మాంచి ఫిజిక్ తో క‌న‌బ‌డ‌నున్నాడు. ఈ ఫిజిక్ కోసం వ‌రుణ్ ఒలింపిక్ విజేత‌ల ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. అంత‌ర్జాతీయ నిపుణుల నుంచి వ‌రుణ్ తేజ్ సూచ‌న‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిసింది. కండ‌ల వీరుడిగా వ‌రుణ్‌ను చూసి మెగా అభిమానులు తెగ సంబుర‌ప‌డిపోతున్నారు.

   గ‌నిలో వ‌రుణ్ లుక్ మాత్ర‌మే కాకుండా క‌థ కూడా విభిన్నంగా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంతో వ‌రుణ్ తేజ్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ ఎఫ్‌3 లో వెంక‌టేష్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎఫ్‌2  ఎంట‌ర్టైన్‌మెంట్ సినిమాగా అభిమానుల‌ను అల‌రించి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ న‌మ్మ‌కంతో ఎఫ్ 3 కూడా నిర్మిస్తున్నారు.

   గ‌తంలో వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన సినిమాలు మంచి విజ‌యాన్నే సాధించాయి. దీంతో గ‌ని, ఎఫ్‌3 కూడా భారీ స్తాయిలో విజ‌యాన్ని అందుకుంటాయ‌ని అభిమానులు దీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఇప్ప‌టికే పూర్తి అవ్వాల్సి ఉండ‌గా క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మ‌యింది. ఎఫ్3 విడుద‌ల త‌రువాత గ‌ని కూడా వ‌చ్చే ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలుస్తోంది.



మ‌రో ఎన్టీఆర్ ఆయ‌నే : రాయ‌ల సీమ రామ‌న్న రెడ్డి

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!

రు. 16 కోట్ల ఇంజెక్ష‌న్ ఇచ్చినా... చావును ఆప‌లేక‌పోయారే ?

ఈ నెల‌లోనే థ‌ర్డ్ వేవ్‌..? జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే క‌ష్ట‌మే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>