PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/love-marrige-f49530d1-c39b-4d5e-9aa4-6404d9246cbf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/love-marrige-f49530d1-c39b-4d5e-9aa4-6404d9246cbf-415x250-IndiaHerald.jpgటెక్నాలజీ పరంగా సమాజం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ కులాంతర వివాహాలను, మతాంతర వివాహాలను మన సమాజం ఒప్పుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇక తాజాగా ఒడిశాలోని ఓ గ్రామ పెద్దలు కులాంతర వివాహం చేసుకున్నందుకు ఓ జంటకు రూ.25 లక్షల జరిమానా వేశారు. love marrige {#}anand malayalam actor;Anand Deverakonda;court;marriage;local language;Districtకులాంతర వివాహం చేసుకున్నందుకు భారీ జరిమానా..ఎక్కడంటే..!?కులాంతర వివాహం చేసుకున్నందుకు భారీ జరిమానా..ఎక్కడంటే..!?love marrige {#}anand malayalam actor;Anand Deverakonda;court;marriage;local language;DistrictTue, 03 Aug 2021 21:51:02 GMTటెక్నాలజీ పరంగా సమాజం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ కులాంతర వివాహాలను, మతాంతర వివాహాలను మన సమాజం ఒప్పుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇక తాజాగా ఒడిశాలోని ఓ గ్రామ పెద్దలు కులాంతర వివాహం చేసుకున్నందుకు ఓ జంటకు రూ.25 లక్షల జరిమానా వేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని క్యోంజార్ జిల్లా నియలిజరాన్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు మహేశ్వర్ బాస్కే తన గ్రామానికే చెందిన వేరే కులం అమ్మాయిని ప్రేమించి ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే గ్రామస్థులంతా వీరి పెళ్లికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ వారిని చంపుతామని బెదిరిస్తుండడంతో ఊరి నుంచి వెళ్లిపోయాడంట. కాగా.. లాక్ డౌన్ విధించడం వల్ల పట్టణంలో పనులు లేక తిరిగి అదే గ్రామానికి వచ్చారు. ఇక వాళ్లు తిరిగి రాగానే గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారంట.

అయితే వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరూ పెళ్లి చేసుకొని తప్పు చేసినందుకు గాను రూ.25.6 లక్షల జరిమానా కట్టాలని తీర్పుని ఇచ్చారంట. అయితే అది కట్టేవరకు వారికి ఎవరూ సాయం చేయకూడదని గ్రామస్థులందరికీ షరతు కూడా పెట్టారంట. దాంతో మహేశ్వర్ తన భార్య, తల్లితో కలిసి తన మేనమామ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే నియలిజరాన్ గ్రామానికి చెందిన ఏ వ్యక్తి తమతో మాట్లాడడానికి, తమకు సాయం చేయడానికి ముందుకు రావట్లేదని వాపోయాడు.

ఇక ఈ ఫైన్ కట్టే వరకు గ్రామస్థులు అతడికి సహాయం చేయకూడదని, వారికి నీళ్లు కూడా ఇవ్వకూడదని గ్రామ సభ తీర్పు ఇచ్చారు. దాంతో ఆ మొత్తం చెల్లించలేక, గ్రామంలో ఉండలేక ఊరు బయట ఉన్న తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తోందని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాగా.. తనని గ్రామంలోకి అనుమతించేలా చేయాలని అందరినీ సాయం కోరుతున్నారు. ఇక ఈ విషయంపై ఆనంద్ పుర్ కోర్టు దర్యాప్తుకి ఆదేశించారు. దాంతో తాము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారని స్థానిక ఘాసీపుర స్టేషన్ ఇన్ స్పెక్టర్ మనోరంజన్ బిసి తెలిపారు.



'రాజమౌళి - మహేష్' సినిమాలో ఇంకో హీరోనా..?

చిరు 'గాడ్ ఫాదర్' టైటిల్.. ఆ డైరక్టర్ దగ్గర ఉందట..!

వీర్రాజు వీరంగం ఆడేశాడు : పూజ వైసీపీది ఫ‌లితం బీజేపీది

పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

షాకింగ్ : దేశంలో 24 ఫేక్ యూనివ‌ర్సిటీలు.. !

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>