CrimeN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/marriage-e8e6c92d-758e-4f81-b527-88cbd353a55f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/marriage-e8e6c92d-758e-4f81-b527-88cbd353a55f-415x250-IndiaHerald.jpgఓ మాజీ మంత్రి ఏకంగా ఆరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అంతా సాఫీగా జరుగుతుందనుకునే సమయానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ మాజీ మంత్రి మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పెళ్లిని అడ్డుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగు చూసింది. marriage {#}Nagma;choudary actor;Triple talaq;రాజీనామా;marriage;Wife;Ishtam;Party;Minister;policeఆరో పెళ్లికి సిద్దమైన మాజీ మంత్రి .. ముడో భార్య ఏం చేసిందంటే..!ఆరో పెళ్లికి సిద్దమైన మాజీ మంత్రి .. ముడో భార్య ఏం చేసిందంటే..!marriage {#}Nagma;choudary actor;Triple talaq;రాజీనామా;marriage;Wife;Ishtam;Party;Minister;policeTue, 03 Aug 2021 11:00:00 GMTఓ మాజీ మంత్రి ఏకంగా ఆరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అంతా సాఫీగా జరుగుతుందనుకునే సమయానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ మాజీ మంత్రి మూడో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పెళ్లిని అడ్డుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగు చూసింది. రాష్ట్ర మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరో పెళ్లికి రెడీ అయ్యాడు. అయితే ఈ విషయం తెలిసి మూడో భార్య నగ్మా మంటోలా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చౌదరి బషీర్ మహిళలను వేధిస్తున్నాడని తెలిపింది. ఆరో పెళ్లి చేసుకుని తమకు అన్యాయం చేస్తున్నాడని తెలిపింది. 2012లో తనకు చౌదరి బషీర్‌తో వివాహం జరిగిందని.. శారీరకంగా, మానసికంగా తనను హింసిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఇష్టం లేకుండా బలవంతంగా ఎన్నోసార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె తెలిపింది. మహిళలను వేధించడం అతడికి సరదా అని ఆమె తెలిపింది. చౌదరి బషీర్ మరో వివాహం చేసుకుంటున్నట్లు తెలిసిందని.. ఈ విషయంపై ప్రశ్నించగా.. ట్రిపుల్ తలాక్ రూపంలో విడాకులు ఇచ్చినట్లు పేర్కొంది. పోలీసులు తనకు న్యాయం చేయాలని పేర్కొంది. కాగా.. ఈ ఘటన తర్వాత ఆ మహిళ బహీర్‌పై సంచలన ఆరోఫణలు చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

నగ్మా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ఆ వివాహాన్ని అడ్డుకుని.. ముస్లిం మహిళా వివాహ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే గతంలోనూ బషీర్‌పై ఇదే తరహాలో కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయంలో 23 రోజుల పాటు జైలులో కూడా ఉన్నారు. కాగా, బషీర్.. మయావతి హయాంలో మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామా అనంతరం బషీర్ ఏ పార్టీలో కొనసాగుతున్నారనే విషయం స్పష్టత లేదు. కాగా, మంత్రి హోదాలో కొనసాగిన బహీర్ ఆరో వివాహానికి సిద్ధమవడంపై మహిళ సంఘాలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్నారు.



లాస్ట్ షెడ్యూల్‌ : ఉక్రెయిన్‌లో అడుగుపెట్టిన‌ ఆర్ఆర్ఆర్ టీమ్..

గోవిందుడి ప్రసాదం 'లడ్డూ' వయసెంతో తెలుసా... ?

ఆ మూవీలో రణ్‌వీర్‌ చేయాల్సిన సన్నివేశం నేను చేశా అంటున్న బాలీవుడ్ యాక్టర్..??

థాంక్ యూ కామ్రెడ్ : ఒక పోరు మూడు పార్టీల‌కు మేలు

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఫోన్... అసలేమి జరిగిందో తెలుసా ?

మనీ: పాడి రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్రం..

చంద్ర‌బాబుకు జ‌య‌ప్ర‌ద‌కు ఆ కార‌ణంతోనే చెడిందా...!

రు. 16 కోట్ల ఇంజెక్ష‌న్ ఇచ్చినా... చావును ఆప‌లేక‌పోయారే ?

ఈ నెల‌లోనే థ‌ర్డ్ వేవ్‌..? జాగ్ర‌త్త‌లు పాటించ‌కుంటే క‌ష్ట‌మే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>