EditorialRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pvsindhuba1dd121-05e5-4b4d-bc3e-a45c0e6435d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pvsindhuba1dd121-05e5-4b4d-bc3e-a45c0e6435d1-415x250-IndiaHerald.jpgమ‌న దేశంలో ఇంకా కొన్ని వీధులు అమ్మాయిల‌కు గౌర‌వం ఇవ్వ‌డం లేదు. అది ఇవ్వండి చాలు ప‌త‌కాల మాట దేవుడెరుగు..ఇప్పుడు మైదానంలో నేనున్నాను నాతో పాటూ ఇంకొంద‌రు.. మీరెందుకు విజేత‌లను త‌యారీ చేసే కార్ఖానాల‌ను నిర్మించ‌డం లేదు అని అన్నారెవరో ! దేశానికి కావాల్సింది ఈ త‌ర‌హా కార్ఖానాలే! రండి వాటి త‌యారీకి మీ శ‌క్తిని వెచ్చించేందుకు.. సిద్ధంగా ఉండండి..pvsindhu{#}surya sivakumar;temple;Winner;Red chilly powder;kirti;Girl;Anandam;House;Father;goldమార్నింగ్ రాగా : ఇంకో విజేతమార్నింగ్ రాగా : ఇంకో విజేతpvsindhu{#}surya sivakumar;temple;Winner;Red chilly powder;kirti;Girl;Anandam;House;Father;goldMon, 02 Aug 2021 10:34:00 GMTమార్నింగ్ రాగా : ఇంకో విజేత


దేశాన్ని ప్రేమిస్తూ

బంగ‌రు క‌ల‌లు విసిరేస్తూ

విరుద్ధంగా జీవించ‌డంలో

కూడా ఆనందం ఉంది


దేశాన్ని ప్రేమిస్తూ

ప‌సిడి ప‌త‌కాల సాధ‌న‌లో

త‌మ‌ని తాము మ‌రిచిపోయిన

బిడ్డ గెలుపులో కూడా ఆనందం ఉంది


తాక‌ట్టులో క‌ల‌లున్నాయా?

తెలియ‌దు ఈ దేశ‌పు యువ‌త

నేర్చుకుంటున్నారా ఇవి!

ఇలా రాశాను

ఆనంద సింధువు నీవు అలుపెరుగ‌కు అని..


నౌ షీ ఈజ్.. అండ్ షీ ఈజ్


వ‌ర్త్ బుల్.. విల్ ఫుల్..

ఇప్పుడు చెప్పండిక ఈ విజేత మీ ఇంటి అమ్మాయి అని!


నాన్న‌ను మ‌రిచారా!

.......ఆ కీర్తి ఆయ‌న‌దే


విజేత‌ల‌ను కీర్తించే బాధ్య‌త నాది.. విజేత‌ల‌ను సృష్టించే బాధ్య‌త కూడా  నాదే కావాలి..కీర్తి అన్న‌ది అశాశ్వ‌తం సృష్టి మాత్రం  మ న‌కు మ‌నం చేయాల్సిన ప‌నుల‌లో ఒక‌టి.. ఈ కీర్తి పోయాక మ‌న‌లో పెరిగే నిరాశ‌ను ఆ సృష్టి జ‌యించేలా చేస్తుంది. క‌నుక మీరు అన‌స‌వ‌ర పొగ‌డ్త‌లు రాయ‌కండి ప్లీజ్ .. రేప‌టి నుంచి మీ ఇంటి బిడ్డ‌ల ఎదుగుద‌ల‌లో ఇలాంటి విజేత‌ల మాట‌లూ వారి ప‌నులూ స్ఫుర‌ణ  అయితే మేలు. అవుతాయా లేదా అన్న‌ది నేను స్ప‌ష్టం చేయలేను. మీ ఇంటి విజేత ఎవ‌రు అన్న‌ది గుర్తించండి.. అమ్మా నాన్న స్మ‌ర‌ణ‌ల్లో మీరు నేర్చుకున్న‌దంతా చెప్పండి అటుపై ఈ విజ‌యాలూ విజ‌య‌పు ఆవ‌ర్త‌న‌లూ అన్నీ అన్నీ ఇంకాస్త బాగా అర్థం అవుతాయి. సింధూని న‌డిపించిన నాన్న‌ను గుర్తు చేసుకోవాలి  ఇవాళ..

అర‌వ‌కండి..

....కోపం వ‌స్తాంది


ఓడిపోయిన వేళ త‌ప్పు భావ‌న‌ల‌తో నిండిపోయిన వేళ కోచ్ ఏం చెప్పారు అన్న‌ది తెలుసుకోవాలి.. త‌న జీవితాన్ని ప్ర‌భావితం చేసిన గోపీచంద్ అకాడ‌మీలో ఉద‌యం నాల్గింటికి పోయి చేసిన సాధ‌న గురించి తెలుసుకోవాలి.. ఆ గుడి త‌లుపులు తెర్చుకున్న వేళ ఇంకొంద‌రు సింధు లాంటి వారే అక్క‌డుంటారు వారిని ప‌ల‌క‌రించి రండి చాలు..ఇవ‌న్నీ చేయ‌కుండా ఇన్ని ప‌నులు ఆచ‌ర‌ణీయం చేయ‌కుండా మీరు సింధు గ్రేట్ అని అర‌వ‌కండి.. కోపం వ‌స్తాంది.


దేవుడికో కృత‌జ్ఞ‌త


కీర్తి అయాచితం కాదు క‌ష్టార్జిత‌మే.. ఆమెను దీవించండి..ఆమె త‌ప్పులుంటే మ‌న్నించండి.. ఈ కీర్తి శాశ్వ‌తం కాదు కానీ అయి తే మేలు.. రెండు ఒలంపిక్స్ ప‌త‌కాల సాధ‌న‌లో ఆమె ప‌రిశ్ర‌మించిన తీరుకు జేజేలు.. అమ్మాయిలూ.. మెహందీ పండిందా లేదా ఈ ఆషాఢాన తెలియ‌దు.. క్ష‌మించాలి. నిజంగా మీరు ఆకాశం నుంచి వ‌చ్చిన తార‌లే కావాలి.. ఈ ప్ర‌పంచాన్ని వె లుగుల‌తో నింపిపోవాలి.. నిరాశ‌ల‌తో కాదు. మీరూ నేనూ జ‌యించాల్సిందే నిరాశ‌ను.. ఒక చోట చదివేను పుల్లెల గోపీచంద్ అను గురువు బ్యాడ్మింట‌న్ గురువు చెప్పారీ మాట ఏ గెలుపూ అప‌రాధ భావ‌న‌కు సంకేతం కారాదు అని! ముందు మీరు ఈ భావ‌న‌ను అల‌వ‌ర్చుకుని తీరాలి. ఆ త‌రువాతే ఏమ‌యినా.. ఈ ఉద‌యం ఇలా ప్రారంభించ‌డం నేను దేవుడికి చెల్లించే కృత‌జ్ఞ‌త మ‌రియూ సింధూ లాంటి బిడ్డ‌ల‌కు ఇచ్చే దీవెన ఇంత‌కుమించి నాలో ఏమీ లేదు అని అనుకుని నేను ప్ర‌యాణిస్తూ పోతున్నా ను..


మార్పును గ‌మ‌నించేనా!


ఆ అమ్మాయికి ప‌త‌కం వ‌చ్చింది.. ముందు గుర్తుకువ‌చ్చింది లోపాల‌ను స‌రిచేసిన గురువు గురించి రాయాలి అని! ఆ ప‌ని ఒక‌రు చేశారు. ఎంతో ఆనందించేను. ఆ అమ్మాయికి ప‌త‌కం వ‌చ్చింది మ‌న ఇంట్లో అమ్మాయిల‌కు ఆట‌ల ప‌రిచ‌యం ఉందా అనుకు న్నాను. ఇదీ నా త‌మ్ముడు సూర్య నాతో అన్న మాట..ఆ అమ్మాయికి ప‌త‌కం వచ్చింది మ‌న‌కు ఇంకా ఉన్న స‌మ‌స్య‌లు కొన్ని పరిష్కారం అవుతాయా ? అని న‌వ్వుకుంటున్నాను. ఏదేమ‌యినా మ‌న భాగ్య న‌గ‌రి వీధులు ఇవాళ్టి నుంచి మారిపోతాయి. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సింధూ గొప్ప‌త‌నం కీర్తిస్తాయి. దేశంలో లేని మైదానాలూ ఉన్న మైదానాలూ ఇలాంటివి ఎన్నో..ఇప్పుడు త‌మ ప‌చ్చి కల‌ను సిద్ధం చేస్తాయి. ఆట‌ల జాబితాల్లో మార్పులు, ఆహారం జాబితాల్లో మార్పులు వ‌చ్చి మ‌న‌ల్ని మ‌న‌కు కొత్త‌గా ప‌రిచయం చేస్తాయి. మంచిదే ఈ పాటి మార్పులో నేనున్నానా... ఈ పాటి మార్పును నేను గ‌మ‌నించేనా అని అనుకుంటాను.


క‌ల‌ల సాకారం

ఈ దేశ నినాదం


అమ్మాయిలే ఈ దేశ‌పు నినాదాలు..చ‌దువు..ఆట‌లూ.. వికాసం అన్న‌వి అమ్మాయిల‌తోనే.. సాధ్యం అయిన ప్ర‌తిసారీ ఆనందిం చే ను. ఈ పరుగుల్లో అబ్బాయిల వెనుక‌బాటు కూడా ఆనంద‌మే.. మ‌నం వ‌ద్ద‌నుకున్న మ‌న ఇల్లు కొన్నింటిని విధిగా అనుస‌రి స్తుం ది. మ‌న‌దేశం వాటికో కొన‌సాగింపులా ఉంటుంది. ఇల్లు లాంటిదే దేశం..ప‌రుగు మీది కావాలి అప్పుడు దేశం గ‌ర్విస్తుంది. ప‌సిత‌నం నుంచి ప‌సిడి క‌ల‌ల సాకారం ఒక‌టి మీదే కావాలి అప్పుడు నా లాంటి వారు నాలుగు మాట‌లు రాస్తారు. పొంగిపోతారు.


మ‌ళ్లీ ఆ సూర్య‌లంక సముద్ర తీరానికి...


దేశం గెలిచిన ప్ర‌తిసారీ అమ్మాయిలే గ్రేట్ అంటారు. స‌రిగా ఆడేందుకు ఆట‌లో మంచి ప్ర‌తిభ చాటేందుకు ఈ దేశం చేస్తున్న స‌హ కారం చూసి న‌వ్వుకుంటాను. ఈ దేశంలో సింధూ స‌రే ఇంకొంద‌రు కూడా అలానే ఆ బాట‌లోనే ఉన్నారు స‌ర్..వారికి కూడా మీ సాయం కావాలి.. కానీ ఇవ్వ‌గ‌ల‌రా! మ‌న దేశంలో ఇంకా కొన్ని వీధులు అమ్మాయిల‌కు గౌర‌వం ఇవ్వ‌డం లేదు. అది ఇవ్వండి చాలు ప‌త‌కాల మాట దేవుడెరుగు..ఇప్పుడు మైదానంలో  నేనున్నాను నాతో పాటూ ఇంకొంద‌రు.. మీరెందుకు విజేత‌లను త‌యారీ చేసే కార్ఖానాల‌ను నిర్మించ‌డం లేదు అని అన్నారెవరో ! దేశానికి కావాల్సింది ఈ త‌ర‌హా కార్ఖానాలే! రండి వాటి త‌యారీకి మీ శ‌క్తిని వెచ్చించేందుకు.. సిద్ధంగా ఉండండి..  చెప్పానుగా గోల్ట్ వ‌చ్చినా రాక‌పోయినా గోల్డెన్ డ్రీమ్స్ మాత్రం ఎప్ప‌టికీ అలానే ఉండాలి అని! నా దృష్టిలో బంగారం క‌న్నా సంప‌ద క‌న్నా కీర్తి క‌న్నా శ్ర‌మ వేదం ఒక్క‌టే ఎంతో గొప్ప‌ది.. నేను ఆ వేదం వింటూ పోతున్నాను.. మ‌ళ్లీ ఆ సూర్య‌లంక సముద్ర తీరానికి...


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి




అత్యంత ఇరుకైన ఇల్లు.. కానీ చూస్తే మతిపోతుంది.. వైరల్ వీడియో?

ప్రపంచ నెంబర్.1.. అసహనానికి గురైతే.. వైరల్ వీడియో?

నాగార్జున చేసిన త‌ప్పులే ఆయ‌న్ను బాలీవుడ్ స్టార్ కాకుండా అడ్డుప‌డ్డాయా ?

ప్రతి నిరుపేద మొహంలో చిరునవ్వు కోసం పాటుపడుతున్న మహిళ

కన్నీరు పెట్టిస్తున్న టమాటా?

పీవీ సింధుకి కాంస్య పథకం.. కోచ్ గోపీచంద్ ఏమన్నాడో తెలుసా?

సుకుమార్ తన తండ్రి జ్ఞాపకంగా..20 లక్షలు పెట్టి..

ఎమ్మెల్యే కు ఓ యువతి ప్రపోజ్.. ట్వీట్ వైరల్ ?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఈ గ్రాండ్ మాస్టర్ కి బావ తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>