MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanthf084e88e-2c9f-44ef-a450-e9ee3e81a9cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanthf084e88e-2c9f-44ef-a450-e9ee3e81a9cc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలలో ఖడ్గం సినిమా ఒకటి గా నిలిచిపోతుందని తప్పకుండా చెప్పవచ్చు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరికీ ఎంతో ఆదర్శంగా నిలుస్తూ గొప్ప ఆలోచన పుట్టిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డైరెక్టర్ కృష్ణ వంశీ సమర్థతకు గీటురాయి లాంటిది ఖడ్గం సినిమా. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ తొలగించాలంటూ ఎన్ని హెచ్చరికలు ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా వాటిని తట్టుకుని సినిమాను విడుదల చేసి శభాష్ అనిపించుకున్నాడు కృష్ణవంశీ. సీఎం దగ్గర నుంచి డీజీపీల దాకా ఈ సిsrikanth{#}Prakash Raj;srikanth;Khadgam;vamsi;krishna vamshi;Traffic police;producer;Producer;Yevaru;Ravi;ravi teja;Hero;Director;Cinema;Akkineni Nagarjuna;CMశ్రీకాంత్ ని హీరోగా తప్పిస్తే కోటి ఇస్తానన్న నిర్మాతశ్రీకాంత్ ని హీరోగా తప్పిస్తే కోటి ఇస్తానన్న నిర్మాతsrikanth{#}Prakash Raj;srikanth;Khadgam;vamsi;krishna vamshi;Traffic police;producer;Producer;Yevaru;Ravi;ravi teja;Hero;Director;Cinema;Akkineni Nagarjuna;CMMon, 02 Aug 2021 19:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలలో ఖడ్గం సినిమా ఒకటి గా నిలిచిపోతుందని తప్పకుండా చెప్పవచ్చు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరికీ ఎంతో ఆదర్శంగా నిలుస్తూ గొప్ప ఆలోచన పుట్టిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డైరెక్టర్ కృష్ణ వంశీ సమర్థతకు గీటురాయి లాంటిది ఖడ్గం సినిమా. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ తొలగించాలంటూ ఎన్ని హెచ్చరికలు ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా వాటిని తట్టుకుని సినిమాను విడుదల చేసి శభాష్ అనిపించుకున్నాడు కృష్ణవంశీ. సీఎం దగ్గర నుంచి డీజీపీల దాకా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ తీయమని చెబితే ఓ ఐదు సీన్లు తీసేసాడు అంతే.

ఆయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విడుదలయ్యాక ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఖడ్గం సినిమా అనగానే మనకు గుర్తుకువచ్చేది ముందుగా హీరో శ్రీకాంత్. ఆయన నటించిన పాత్ర ఇప్పటికీ ప్రతి ఒక్కరి కళ్లలో మెదులుతూనే ఉంటుంది. ఎంతో సీరియస్ గా పోలీస్ ఆఫీసర్ గా శ్రీకాంత్ ఈ పాత్రకు ఎవరు సరిపోరు అనే రేంజ్ లో నటించాడు.  రవితేజ పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. ప్రకాష్ రాజ్ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు.

 ఇక శ్రీకాంత్ రోల్ కోసం వెంకటేశ్ ను అడిగితే ఆయన బిజీగా ఉండడంతో ఆ సినిమా చేయలేకపోయారు. నాగార్జున వేరే మూవీతో బిజీగా ఉన్నాడు. దాంతో శ్రీకాంత్ ను దానికి ఎంచుకున్నారు. అయితే నిర్మాత శ్రీకాంత్ కాకుండా మరొకరిని పెడితే బాగుంటుందని ఆయన కోసం మరో కోటి అయినా ఖర్చు పెడదామని అంటే కృష్ణవంశీ మాత్రం శ్రీకాంత్ మాత్రమే ఈ పాత్ర చేయాలని చెప్పడంతో నిర్మాత కూడా ఎదురు చెప్పలేకపోయాడు. ఆ విధంగా ఖడ్గం సినిమాను తెరమీదికి తీసుకుపోయిన కృష్ణవంశీ అద్భుతంగా తెరకెక్కించి సూపర్ హిట్  చేశాడు.



కేంద్ర మంత్రిని ప్రశ్నించిన బండి సంజయ్?

ప్రభాస్ మీదే ఆశలు పెట్టుకున్న ఎయిర్టెల్ పిల్ల..

ఆ ఫామ్ హౌసులో ఇకపై తారక్ సేంద్రియ వ్యవసాయం

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

ప్రభాస్ ఇంత క్లోజ్ గా ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

గూగుల్ సెర్చ్ : సింధూది ఏ కులం?

ఒక సభకు వందేళ్లు

వాట్ ఈజ్ `ఈ-రూపీ`.. ఎలా ఉప‌యోగించాలి..?

వైసీపీ నయా టార్గెట్ బీజేపీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>