PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp2aacd0fe-676f-4d0e-b0fa-337838b690b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp2aacd0fe-676f-4d0e-b0fa-337838b690b5-415x250-IndiaHerald.jpgసాధారణంగా అధికార పార్టీలో ఆధిపత్యపోరు సహజంగా ఉంటుంది. నియోజకవర్గాల్లో నాయకులు పెరగడం, వారు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు అసలు పడటం లేదు. ysrcp{#}Kurnool;SV Mohan Reddy;Raccha;Assembly;Jagan;TDP;editor mohan;YCP;MLA;Cheque;Hanu Raghavapudi;Party;police;Newsఆ ఎమ్మెల్యే సీటుకు మాజీ ఎమ్మెల్యే ఎర్త్ పెడుతున్నారా?ఆ ఎమ్మెల్యే సీటుకు మాజీ ఎమ్మెల్యే ఎర్త్ పెడుతున్నారా?ysrcp{#}Kurnool;SV Mohan Reddy;Raccha;Assembly;Jagan;TDP;editor mohan;YCP;MLA;Cheque;Hanu Raghavapudi;Party;police;NewsMon, 02 Aug 2021 03:00:00 GMTసాధారణంగా అధికార పార్టీలో ఆధిపత్యపోరు సహజంగా ఉంటుంది. నియోజకవర్గాల్లో నాయకులు పెరగడం, వారు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు అసలు పడటం లేదు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హఫీజ్‌ఖాన్‌కి చెక్ పెట్టేసి కర్నూలు అసెంబ్లీ సీట్లు దక్కించుకోవాలని మోహన్ రెడ్డి చూస్తున్నట్లు కనిపిస్తోంది. అటు తన సీటుని నిలుపుకోవాలని ఖాన్ కూడా చూస్తున్నారు. దీంతో వీరి మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. అయితే 2014 ఎన్నికల్లో మోహన్ రెడ్డి కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టిడిపిలోకి జంప్ చేశారు. ఇక 2019 ఎన్నికల్లో టిడిపి టికెట్ దక్కదని తెలిసి మళ్లీ ఎన్నికల ముందు వైసిపి లోకి వచ్చారు.

కానీ జగన్ ఆ సీటు ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన ఖాన్‌కు టికెట్ ఇచ్చారు. ఇక జగన్ వేవ్‌లో ఖాన్ ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యేగా ఖాన్ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ మోహన్ రెడ్డి కూడా నియోజవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. పార్టీ తరఫున కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేగా తానుండగా మోహన్ రెడ్డి పార్టీ అధికారిక కార్యక్రమాలు ఎలా చేస్తారు అని చెప్పి హఫీజ్‌ఖాన్ ప్రశ్నిస్తున్నారు.

తాజాగా నియోజకవర్గంలో ఓ ప్రాంతంలో పార్టీ జెండా ఆవిష్కరణకు సంబంధించి ఎమ్మెల్యే, మోహన్ రెడ్డి వర్గాల మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా మోహన్ రెడ్డి జెండా ఎలా ఆవిష్కరిస్తారని చెప్పి ఎమ్మెల్యే వర్గం, మోహన్ రెడ్డి వర్గంతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించేశారు.

కానీ ఈ విషయంపై ఎమ్మెల్యే సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై జగన్ ఫిర్యాదు చేస్తానని మాట్లాడుతున్నారు. అయితే కర్నూలు సీటు కోసం మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. అటు ఖాన్ కూడా తన సీటు  నిలుపుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.



అయ్యన్న ఫ్యామిలీ వార్: కుమారుడు వర్సెస్ సోదరుడు?

సోములో సడన్ చేంజ్...డైరక్షన్ వాళ్లేనా!

జగన్‌కు బంపర్ ఆఫర్ అప్పుడే ఉంటుందా?

ఆసక్తికర విషయాలు చర్చించిన తెలంగాణ మంత్రి మండలి?

కిషన్ రెడ్డిని సీక్రెట్ గా కలిసిన ఏపీ మంత్రులు?

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నాయకుల్లో అధికార వైసీపీలో ఎక్కువగానే ఉన్నారు. తక్కువ సమయంలోనే ప్రజల్లోకి చొచ్చుకుపోయి, ప్రజల కోసం కష్టపడుతున్న ఎమ్మెల్యేల్లో ఉషశ్రీచరణ్ కూడా ఒకరు. మొదట్లో తెలుగుదేశంలో రాజకీయం చేసిన ఆమె ఆ తర్వాత టీడీపీని వదిలి పెట్టి, వైసీపీ లోకి వచ్చి 2019లో కళ్యాణదుర్గం సీటు దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం టీడీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఇక్కడ ఎక్కువ సార్లు ఆ పార్టీ జెండా ఎగిరింది.

ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగన్ గత ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సీట్లు గాని, పార్లమెంటు సీట్లు గాని అత్యధికంగా గెల్చుకున్నారు. కానీ రాష్ట్రంలో వైసీపీకి పూర్తిగా అనుకూల పరిస్థితులు ఉన్నా సరే కేంద్రంలో మాత్రం వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ 22 ఎంపీలు గెలుచుకున్నా సరే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కేంద్రంలో బిజెపికి మంచి మెజారిటీ ఉండడంతో జగన్ అనుకున్న పనులు కావడం లేదు.

ఆసక్తి రేపుతున్న అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ జీవితం?

బండి సంజయ్ కు అడ్డుపడుతున్న ఆ కేంద్ర మంత్రి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>