PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag36c16333-03aa-4c01-a11e-0bb986706fc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag36c16333-03aa-4c01-a11e-0bb986706fc5-415x250-IndiaHerald.jpg దేశానికి స్వాతంత్ర్యం అర్థ‌రాత్రి వ‌చ్చింద‌ని చెబుతుంటే చిన్న‌పిల్ల‌లం అప్పుడు మ‌నం ఇంకా పుట్ట‌లేదుక‌దా అని అనుకున్నాం. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏ కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా అర్థ‌రాత్రే తీసుకుంటుండ‌టం, జీవోలు కూడా అర్థ‌రాత్రే జారీ చేస్తుండ‌టం చూస్తుంటే క‌చ్చితంగా మ‌న‌కు స్వాతంత్ర్యం అర్థ‌రాత్రే వ‌చ్చింద‌నిపిస్తోంది. ఆరోజు వ‌చ్చింది.. ఈరోజు ఇక్క‌డ పోతోంది. అంతే తేడా. సీనియ‌ర్ పోలీసు అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును డిస్మిస్ చేయాల‌ని కేంద్ర హోంశాఖ‌ను కోరుతు ఏపీ ప్ర‌భుత్వం శ‌నివారం అర్థ‌రtag{#}Sakshi;central government;police;Andhra Pradeshఅర్థ‌రాత్రి స్వ‌తంత్రం.. అర్థ‌రాత్రి జీవోలు?అర్థ‌రాత్రి స్వ‌తంత్రం.. అర్థ‌రాత్రి జీవోలు?tag{#}Sakshi;central government;police;Andhra PradeshMon, 02 Aug 2021 17:15:00 GMT
దేశానికి స్వాతంత్ర్యం అర్థ‌రాత్రి వ‌చ్చింద‌ని చెబుతుంటే చిన్న‌పిల్ల‌లం అప్పుడు మ‌నం ఇంకా పుట్ట‌లేదుక‌దా అని అనుకున్నాం. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏ కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా అర్థ‌రాత్రే తీసుకుంటుండ‌టం, జీవోలు కూడా అర్థ‌రాత్రే జారీ చేస్తుండ‌టం  చూస్తుంటే క‌చ్చితంగా మ‌న‌కు స్వాతంత్ర్యం అర్థ‌రాత్రే వ‌చ్చింద‌నిపిస్తోంది. ఆరోజు వ‌చ్చింది.. ఈరోజు ఇక్క‌డ పోతోంది. అంతే తేడా. సీనియ‌ర్ పోలీసు అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును డిస్మిస్ చేయాల‌ని కేంద్ర హోంశాఖ‌ను కోరుతు ఏపీ ప్ర‌భుత్వం శ‌నివారం అర్థ‌రాత్రి ఒక ర‌హ‌స్య జీవోను జారీచేసింది.

అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌ల‌తో
జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. నిఘాప‌రిక‌రాల కొనుగోలులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌నేది ఒక ఆరోప‌ణ‌కాగా, కొంద‌రు అధికారుల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడి స‌ర్వీసు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించార‌నేది మ‌రో అభియోగం. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌స్పెన్ష‌న్ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. కొద్దిరోజుల క్రిత‌మే క‌మిష‌న‌ర్ ఆఫ్ ఎంక్వ‌యిరీస్ ఎదుట కూడా హాజ‌రై  త‌న వాంగ్మూలాన్ని ఆయ‌న ఇచ్చారు. ఇంత‌లోనే స‌ర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలంటూ కేంద్ర హోంశాఖ‌ను కోరుతూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అర్థ‌రాత్రి జీవో జారీచేసింది.

ఎక్క‌డైతే ప్రారంభ‌మైందో.. అక్క‌డినుంచే
గత నెల పందొమ్మిదో  తేదీన విజయసాయిరెడ్డికి ఏబీవీ లీగ‌ల్ నోటీసులు పంపించారు. ఎక్క‌డైతే స‌మ‌స్య మొద‌లైందో అక్క‌డే ప‌రిష్క‌రించాల‌న్న ఉద్దేశంతో ఏబీ ఈ లీగ‌ల్ నోటీసుల‌ను పంపించ‌డం జ‌రిగింది. ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను అడ్డం పెట్టుకొని అర్థ‌రాత్రి పూట త‌న‌ను పోస్టు నుంచి తొల‌గించడానికి విజ‌య‌సాయి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుపైనే ఆయ‌న మొద‌టిగా దృష్టిసారించారు. సాక్షి ప‌త్రిక‌, ఛానెల్‌కు సంబంధించి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, రామ‌చంద్ర‌మూర్తి, ముర‌ళి, ప్రియ‌ద‌ర్శినిరామ్ స‌హా ఏడుగురికి ప‌రువు న‌ష్టం నోటీసులు పంపించారు. దీంతో వెంట‌నే ముఖ్య‌మంత్రి కార్యాల‌యం అప్ర‌మ‌త్త‌మైంది.

బాణాలు సంధిస్తున్న ఏబీవీ?
అధికారాన్ని అడ్డం పెట్టుకొని త‌న‌పై వేధింపుల‌కు పాల్ప‌డితే బెదిరిపోయే మ‌నిషిని కాన‌ని నిరూపించుకునేందుకు ఏబీవీ త‌న బాణాలు బ‌య‌ట‌కు తీస్తున్నారు. కొన్ని అంశాల్లో ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేయ‌డం, సుప్రీంకోర్టుకు వెళ్ల‌డం, త‌న విచార‌ణ‌లో ప్ర‌బుత్వం ఉప‌యోగించిన ఫోర్జ‌రీ ప‌త్రాల‌కు సంబంధించి క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయ‌డంలాంటివ‌న్నీ వ‌రుస‌గా చేసుకుంటూ వ‌స్తున్నారు. ఒక‌వేళ డిస్మిస్ అయితే న్యాయ‌స్థానాల్లో పోరాడుతూనే ముఖ్య‌మంత్రిపై, ఆయ‌న ప్ర‌భుత్వంపై దూకుడుగా వెళ్లే స్వేచ్ఛ‌ను కూడా జ‌గ‌నే క‌ల్పించార‌ని రాజకీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఒక‌ర‌కంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రో ర‌ఘురామ‌కృష్ణంరాజును త‌యారుచేసుకుంద‌నే వ్యాఖ్య‌లు కూడా వ‌స్తున్నాయి.






ఏమి దేశంరా.. ఇది? క‌రోనాతో ఒక‌వైపు ప్ర‌జ‌లంతా విల‌విల్లాడుతుంటే ప్ర‌భుత్వానికి ఆదాయం ఎలా పెరుగుతుందో అర్థంకాక ఆర్థిక‌వేత్త‌లు కూడా అయోమ‌యానికి గుర‌వుతున్నారు. ఒక‌వైపు దేశ‌మంతా కొవిడ్‌వ‌ల్ల సంభ‌వించిన మ‌ర‌ణ‌మృదంగాలు విన‌ప‌డుతుంటే భార‌త ప్ర‌భుత్వానికి కాసుల గ‌ల‌గ‌లు విన‌ప‌డుతున్నాయి. ఎంత చిత్రం ఇది. ఒకే నాణానికి ఒక‌వైపు బొమ్మ‌, మ‌రోవైపు బొరుసు అంటే ఇదేనేమో. జులైలో జీఎస్టీ వ‌సూళ్లు రూ.1,16,393 కోట్లుగా న‌మోద‌య్యాయి. జూన్‌లో ఈ సంఖ్య రూ.92,849 కోట్లుగా ఉంది. ఈ ఆదాయం అంతా ఏమ‌వుతోంది.. ఎటు పోతోంది అనేది ఇప్పుడు మ‌న‌కు అప్ర‌స్తుతం. ఎందుకంటే అదంతా న‌రేంద్ర‌మోడీగారు చూసుకుంటారు.

ఏమి దేశంరా.. ఇది? జీఎస్టీ వ‌సూళ్లు పెర‌గ‌డ‌మేంటి?

కృష్ణా జలాల విషయంలో వైఎస్ జగన్ దాదాగిరి

ఏపీ స‌చివాల‌యంలో అల‌జ‌డి

అన్నీ అయిపోయాయి ఇంకేం మిగ‌ల్లేదు అనుకుంటున్న త‌రుణంలో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీ ఫాస్ట్ ఫుడ్స్ రంగంలోకి ప్ర‌వేశిస్తోంది. అంటే మ‌నం రిల‌య‌న్స్ నూడుల్స్, రిల‌య‌న్స్ ఫ్రైడ్‌రైస్, ఎగ్ ఫ్రైడ్‌రైస్‌.. ఇలా ఏమైనా తినొచ్చ‌న్న‌మాట‌. ఫాస్ట్‌ఫుడ్ ఇండ‌స్ట్రీలో భారీ పెట్ట‌బ‌డులు పెట్ట‌డానికి రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ సంసిద్ధుల‌వుతున్నారు. దీనిలో భాగంగా స‌బ్‌వేను కొనుగోలు చేయ‌డానికి స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. క్విక్ స‌ర్వీస్ రెస్టారెంట్ చైన్ కంపెనీ అయిన స‌బ్‌వే త్వ‌ర‌లో రిల‌య‌న్స్ స‌బ్‌వేగా మార‌బోతోంది. ఇప్పుడు ఈ వార్త దేశీయ వాణిజ్య‌రంగంలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. రూ.1860 కోట్ల‌కు త్వ‌ర‌లోనే ఒప్పందం కుదర‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ప్రభుత్వ ఆసుపత్రి ముద్దు... ప్రైవేటు వద్దు

పీపుల్స్ స్టార్ నారాయ‌ణ‌మూర్తి క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ఎర్ర‌సైన్యం. ఈ చిత్రంలో తెలంగాణ‌లోని దొర‌ల పెత్త‌నాన్ని ప్ర‌శ్నిస్తూ ఆయ‌న పాడిన పాట ఈ ఊరు మ‌న‌దిరా.. ఈ వాడ మ‌న‌దిరా.. ప‌ల్లె మ‌న‌దిరా.. ప్ర‌తి ప‌నికి మ‌నంరా అంటూ సాగే పాట అప్ప‌ట్లో రెండు ప్రాంతాల‌ను ఉర్రూత‌లూగించింది. ఈ పాట‌ను స్ఫూర్తిగా తీసుకొని న‌క్స‌లైట్ ఉద్య‌మంలో చేరిన‌వారు కూడా ఉన్నార‌ని పోలీసు అధికారులే చెబుతుంటారు. అప్ప‌టి దొర‌ల పెత్తంన‌పై, వారి పెత్తందారీ వ్య‌వ‌స్థ‌పై రూపొందించిన ఆ పాట బ‌హుళ జ‌నాద‌ర‌ణ పొందింది. ఆ పాట ప్ర‌జ‌లంద‌రికీ ఇష్టం. కానీ పోలీసుల‌కు ఇష్టంకాదు. వారి వృత్తి రీత్యా న‌క్స‌లైట్ల‌కు వ్య‌తిరేకం కాబ‌ట్టి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ ఆ పాట‌ను ఆల‌పించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు.

ఉక్కు కార్మికులపై ఉక్కుపాదం

దొర ఏందిరో.. వాడి పీకుడేందిరో..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>