LifeStyleRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/andhra-sugars-30004cc7-b060-45a3-9b42-bcb54127a3d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/andhra-sugars-30004cc7-b060-45a3-9b42-bcb54127a3d3-415x250-IndiaHerald.jpgగోదావరి పల్లెలలో తణుకు ప్రత్యేకం. ఆ ఊళ్లో పరిశ్రమలూ లేవు. పారిశ్రామిక అభివృద్ధీ లేదు. కానీ ఆయన తన దైన ఆలోచన, సాహసంతో ఏర్పాటు చేసిన కంపెనీ తరువా త ఎన్నింటికో ప్రేరణ అయి నిలిచింది. ఆంధ్రా సుగర్స్ కంపెనీ మరి నాలుగు కంపెనీల ఏర్పాటుకు మూలం అయింది. డబ్బులుంటే వచ్చిన ప్రగతి కాదు ఇది.. తమని తాము అంచనా వేసుకుంటూ కొత్త దారుల ప్రయాణించి పొందిన విజయాలివి. andhra sugars {#}manya;Godavari River;Tanuku;prasad;pragathiశత‌జ‌యంతి వేళ స్మ‌రణ : యోధుడి జీవితం ...శత‌జ‌యంతి వేళ స్మ‌రణ : యోధుడి జీవితం ...andhra sugars {#}manya;Godavari River;Tanuku;prasad;pragathiMon, 02 Aug 2021 12:35:08 GMT
గోదావరి జిల్లాలకు
పారిశ్రామిక  ప్రగతిని
గొప్పనయిన అభివృద్ధినీ
అందించిన ఘనత



పెద్దగా చదువులేకపోయినా
దేశం గర్వించే స్థాయికి  ఎదిగిన ఘనత



పల్లెలలో జీవితాలు సస్యశ్యామలం చేసి
మేలు రకం ఉత్పత్తులకు నాంది పలికి
దేశం గర్వించే స్థాయికి చేరుకున్న ఘనత



పరిశోధన సహకారం ఉత్పత్తి అభివృద్ధి ఈ నాలుగింటిలోనూ తనదైన రాణింపు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ది.. నేడు ఆయన శత జయంతి. చదువుకూ వ్యాపారానికీ సంబంధం లేకపోయినా ఇంటి బిడ్డలా ఏర్పాటు చేసిన ప్రతి సంస్థనూ ఉన్నత స్థాయికి చేరుకునేలా చేశారు.. ఆంధ్రా సుగర్స్ ను దేశం గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్లారు. సామాన్యంగా జీవించి అనితర సాధ్యమయిన రీతిలో విజయాలు అందుకున్నారు.



గోదావరి పల్లెలలో తణుకు ప్రత్యేకం. ఆ ఊళ్లో పరిశ్రమలూ లేవు. పారిశ్రామిక అభివృద్ధీ లేదు. కానీ ఆయన తన దైన ఆలోచన, సాహసంతో ఏర్పాటు చేసిన కంపెనీ తరువా త ఎన్నింటికో ప్రేరణ అయి నిలిచింది. ఆంధ్రా సుగర్స్ కంపెనీ మరి నాలుగు కంపెనీల ఏర్పాటుకు మూలం అయింది. డబ్బులుంటే వచ్చిన ప్రగతి కాదు ఇది.. తమని తాము అంచనా వేసుకుంటూ కొత్త దారుల ప్రయాణించి పొందిన విజయాలివి. ఇప్పుడు ఆంధ్రా సుగర్స్ తణుకుతో పాటు మరి నాలుగు కేంద్రాలలో నడుస్తోంది.విశాఖ కేంద్రంగా పెట్రో కెమికల్ ఉత్పత్తి రంగాల్లోనూ రాణిస్తోంది. విద్య, వైద్య, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాలలో ఎంతో పేరు తెచ్చుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ కడదాకా అదే విలువలతో ఉన్నారు. అ దే గోదావరి పల్లెలలో బతికారు. సంస్థను నమ్ముకున్న వారికి జీవితం ఇచ్చారు. రాకెట్ ఇంధన తయారీకి సైతం ప్రాధాన్యం ఇచ్చి దేశాన్ని ప్రపంచంలోనే అగ్ర పథాన నిలిపా రు అని ఇప్పటికీ ఎప్పటికీ ఆయన పేరు గుర్తుకు తెచ్చుకునే ప్రతిఒక్కరూ చెప్పే మాట. నిరాడంబరత, రాజకీయాల్లోనూ అదే విధానం, నమ్మిన వారికి అండగా ఉండడం, సా మాన్య కుటుంబాలలో వెలుగులు నింపడం, వివాద రాహిత్యం ఇవన్నీ ఆయనకు ఆ కుటుంబానికీ ఎంతో కలిసి వచ్చిన అంశాలనే చెబుతారు గోదావరి వాసులు.








నీటి విష‌యంలో ఆంధ్రావాళ్ల దాదాగిరి :కేసీఆర్

గొడవలు ఎందుకంటున్న సీజేఐ

దళిత బంధు ప్రారంభం ఈ నెలలోనే?

గ్రేట్ డాక్టర్ : ఒక చేత్తో సెలైన్.. మరొక చేత్తో రోగులకు ట్రీట్మెంట్.. !

నాగార్జున సాగర్‌కు సీఎం కేసీఆర్‌.. షెడ్యూల్‌ ఇదే !

సాగర్ టూర్ లో సీఎం ఏం చేయబోతున్నారంటే..!

హ్యాపీ బర్త్ డే : మ్యూజిక్ కింగ్ దేవిశ్రీ ప్రసాద్ !

ఉస్తాద్ రామ్ కు అసలు సిసలైన టెస్ట్ ..!

ఏపీలో రావుల‌పాలెం - త‌ణుకు చ‌రిత్ర గ‌త వైభ‌వ‌మేనా.. ఏం జ‌రుగుతోంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>