PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagc11e94e6-2198-4f18-94c7-b0532b32ed26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tagc11e94e6-2198-4f18-94c7-b0532b32ed26-415x250-IndiaHerald.jpgఏపీలో ఇప్పుడున్న తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌న్నీ ప‌రిశీలిస్తే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వాతావ‌ర‌ణం ఉంద‌ని, ఇటువంటి ప‌రిస్థితి ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగితే అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మనే అంచాన‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఇలా అయితే చంద్ర‌బాబునాయుడు అధికారంలోకి వ‌స్తార‌ని, ఆయ‌న్ను రానివ్వ‌కుండా చేయాలంటే జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తివ్వ‌డ‌మొక్క‌టే ప‌రిష్కార‌మ‌ని వారిద్ద‌రూ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. tag{#}Amith Shah;devineni avinash;Bharatiya Janata Party;YCP;central government;Telugu Desam Partyమోడీషాతో జ‌గ‌న్‌.. చూస్తున్న బాబు?మోడీషాతో జ‌గ‌న్‌.. చూస్తున్న బాబు?tag{#}Amith Shah;devineni avinash;Bharatiya Janata Party;YCP;central government;Telugu Desam PartyMon, 02 Aug 2021 12:18:31 GMT
ఏపీలో ఇప్పుడున్న తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌న్నీ ప‌రిశీలిస్తే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వాతావ‌ర‌ణం ఉంద‌ని, ఇటువంటి ప‌రిస్థితి ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగితే అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మనే అంచాన‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఇలా అయితే చంద్ర‌బాబునాయుడు అధికారంలోకి వ‌స్తార‌ని, ఆయ‌న్ను రానివ్వ‌కుండా చేయాలంటే జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తివ్వ‌డ‌మొక్క‌టే ప‌రిష్కార‌మ‌ని వారిద్ద‌రూ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

జ‌గ‌న్ బ‌ల‌హీన‌ప‌డినా చంద్ర‌బాబు బ‌ల‌ప‌డ‌కూడ‌దు
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బ‌ల‌హీన‌ప‌డినా చంద్ర‌బాబునాయుడు మాత్రం బ‌ల‌ప‌డ‌కూడ‌ద‌ని వారిద్ద‌రూ కోరుకుంటున్నారు. అవ‌స‌ర‌మైతే మ‌ళ్లీ జ‌గ‌నే అధికారంలోకి వ‌చ్చేలా అండ‌దండ‌లందించే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియ‌ర్ మంత్రులు, నేత‌ల‌ను ఇక్క‌ట్ల‌కు గురిచేస్తే వాటిని త‌ట్టుకోలేక వారు రాజ‌కీయాల‌కు దూర‌మ‌వ‌తార‌ని, అది ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని, దీనివ‌ల్ల చంద్ర‌బాబు బ‌ల‌హీన‌ప‌డ‌తార‌ని వైసీపీవారు భావిస్తున్నారు. దీనివ‌ల్ల తిరిగి అధికారం పొంద‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని వైసీపీ యోచ‌న‌గా ఉంది. చంద్ర‌బాబుమీద ఉన్న వ్య‌తిరేక‌త‌తోనే మోడీ, అమిత్ షా జ‌గ‌న్‌కు తెర‌వెన‌క స‌హ‌కారం అందిస్తున్నార‌ని ఇక్క‌డి బీజేపీ నేత‌లంటున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోను ఈసారి ఎన్నిక‌ల్లో కూడా చంద్ర‌బాబు రాకూడ‌ద‌నేదే కేంద్ర పెద్ద‌ల ముఖ్య ఉద్దేశంగా ఉంద‌ని చెబుతున్నారు.

అయినా చంద్ర‌బాబును న‌మ్మ‌డంలేదు
వారిద్ద‌రి గురించి చంద్ర‌బాబునాయుడు ఎట‌వంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా ఆయ‌న్ను న‌మ్మ‌డంలేద‌ని,  కేసులుండ‌టంవ‌ల్ల జ‌గ‌న్ అయితే త‌మ‌కు భ‌యంతోకానీ, భ‌క్తితోకానీ చెప్పుచేత‌ల్లో ఉంటాడ‌నేది వారి న‌మ్మ‌క‌మంటున్నారు. ఒక‌సారి మోడీని ఎదురించి అధికారం కోల్పోయాం కాబ‌ట్టి మ‌ళ్లీ ఎదురించి రాజ‌కీయంగా ఇబ్బందుల‌కు గుర‌వ‌డం ఎందుకులే అన్న యోచ‌న‌లో చంద్ర‌బాబునాయుడు ఉన్నార‌ని, అయితే ఆయ‌న్ను దెబ్బ‌తీసేందుకు తెర‌వెన‌క త‌న‌కు ఆశీస్సులంద‌జేయాల‌ని జ‌గ‌న్ కోరుకుంటున్నారంట‌. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత‌ల‌పై దాడుల‌కు సంబంధించి కేంద్ర పెద్ద‌ల అండ‌దండ‌ల‌తోనే వైసీపీ ప్ర‌భుత్వం రెచ్చిపోతోంద‌ని, అలా మ‌ద్ద‌తు లేక‌పోతే దాడుల‌కు దూరంగా ఉండ‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. తాజాగా జ‌రిగిన దేవినేని అరెస్ట్ ముఖ్య‌మంత్రికి తెలియ‌కుండా ఎలా జ‌రుగుతుంద‌ని వీరు ప్ర‌శ్నిస్తున్నారు.






వివాదాస్ప‌దంగా కేసీఆర్ చ‌ర్య‌లు?

త‌గ్గేదేల్యా : మ‌రో వివాదంలో జ‌గ‌న్ !

నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌ర్ని అడిగినా ఆయ‌న గురించి మంచిగా చెబుతారు. అయ‌న అంటే అంద‌రికీ గౌర‌వం ఉంది. అలాగే ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన నేత‌ల‌నుకానీ, నాయ‌కులనుకానీ, కార్య‌క‌ర్త‌ల‌నుకానీ ఇంత‌వ‌ర‌కు ఎవ‌రినీ ఇబ్బందుల‌కు గురిచేయ‌లేదు. హుందాగా వ్య‌వ‌హ‌రిస్తారు. త‌న‌కు ఈ ప‌ద‌వి కావాల‌నికానీ, వ‌ద్దు అనికానీ ఇంత‌వ‌ర‌కు నోరు తెరిచి ఏనాడూ అడ‌గ‌లేదు. అడిగే అవ‌కాశం కూడా రాలేదు. వ‌చ్చినా ఆయ‌న మౌనంగానే ఉన్నారు. ఆయ‌న మంచిత‌నం ఆయ‌న‌కు బ‌ల‌హీన‌త‌గా మారిందా? లేదంటే పార్టీకికానీ, అధిష్టానానికి కానీ విధేయ‌త‌గా ఉండ‌ట‌మే ఆయ‌న త‌ప్పా? అంటే ఏదీ చెప్ప‌లేని స్థితి.

తండ్రికి స్నేహితుడ‌ని దూరం పెట్టారా?

ఏపీలో ఇప్పుడున్న తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌న్నీ ప‌రిశీలిస్తే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వాతావ‌ర‌ణం ఉంద‌ని, ఇటువంటి ప‌రిస్థితి ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగితే అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మనే అంచాన‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చార‌ని రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ఇలా అయితే చంద్ర‌బాబునాయుడు అధికారంలోకి వ‌స్తార‌ని, ఆయ‌న్ను రానివ్వ‌కుండా చేయాలంటే జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తివ్వ‌డ‌మొక్క‌టే ప‌రిష్కార‌మ‌ని వారిద్ద‌రూ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

పీవీ సింధూకు ఫోన్ ద్వారా అభినంధనలు తెలిపిన చంద్రబాబు

వాట్ ఈజ్ `ఈ-రూపీ`.. ఎలా ఉప‌యోగించాలి..?

సింధుకు పార్ల‌మెంటు అభినంద‌న‌లు

ఆ న‌లుగురి విష‌యంలో చేతులెత్తేసిన చంద్ర‌బాబు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>