PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana51246446-1de4-4036-a754-11bd090898f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana51246446-1de4-4036-a754-11bd090898f5-415x250-IndiaHerald.jpgగుజరాత్.. దేశంలో చాలా విషయాల్లో ముందుండే రాష్ట్రం. ఇక వాణిజ్యం, వ్యాపారం అంటే ఆ రాష్ట్రం చాలా ముందు ఉంటుంది. పారిశ్రామిక వేత్తలను బాగా ఆకర్షిస్తుంది. అలాంటి గుజరాత్‌ నుంచే ఓ పరిశ్రమను తెలంగాణకు రప్పించుకోవాలని.. తెలంగాణ ప్రయత్నిస్తోంది. గుజరాత్ లో ఉన్న ఇఫ్కో పరిశ్రమను తెలంగాణలోనూ ప్లాంటు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుజరాత్‌కు వెళ్లారు. గాంధీనగర్ జిల్లా కలోల్లో ఉన్నఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను నిరంజన్ రెడ్డి సందర్TELANGANA{#}Gujarat - Gandhinagar;Jammu and Kashmir - Srinagar/Jammu;Telangana;Andhra Pradesh;Reddy;District;KTRగుజరాత్‌కే ఝలక్‌ ఇవ్వనున్న తెలంగాణ..?గుజరాత్‌కే ఝలక్‌ ఇవ్వనున్న తెలంగాణ..?TELANGANA{#}Gujarat - Gandhinagar;Jammu and Kashmir - Srinagar/Jammu;Telangana;Andhra Pradesh;Reddy;District;KTRMon, 02 Aug 2021 09:04:03 GMTగుజరాత్.. దేశంలో చాలా విషయాల్లో ముందుండే రాష్ట్రం. ఇక వాణిజ్యం, వ్యాపారం అంటే ఆ రాష్ట్రం చాలా ముందు ఉంటుంది. పారిశ్రామిక వేత్తలను బాగా ఆకర్షిస్తుంది. అలాంటి గుజరాత్‌ నుంచే ఓ పరిశ్రమను తెలంగాణకు రప్పించుకోవాలని.. తెలంగాణ ప్రయత్నిస్తోంది. గుజరాత్ లో ఉన్న ఇఫ్కో పరిశ్రమను తెలంగాణలోనూ ప్లాంటు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుజరాత్‌కు వెళ్లారు.


గాంధీనగర్ జిల్లా కలోల్లో  ఉన్నఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఇఫ్కో సంస్థ నానో యూరియా తయారీ ద్వారా ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నానో యూరియా 500 ఎంఎల్ లిక్విడ్ ను 127 లీటర్ల నీటిలో కలిపి పిచికారి
చేస్తే ఏకంగా ఓ ఎకరాకు సరిపోతుంది. అంటే.. కేవలం రూ.240 కి లభించే ఈ బాటిల్ మూలంగా ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున సబ్సిడీ భారం తప్పుతుందన్నమాట.


ఈ నానో యూరియాను తయారు చేస్తున్న ఇఫ్కో భారత రైతాంగ సహకార సంస్థ .. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది .. అంతే కాదు.. ఇఫ్కో సంస్థకు నానో యూరియా పేటెంట్ హక్కు కూడా వచ్చింది. దీంతో ఇది వ్యవసాయంలో ఎరువుల వాడకంలో కొత్త విప్లవానికి నాంది పలికింది. ఇక భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదే అంటున్న రోజుల్లో తెలంగాణలో నానా యూరియా ప్లాంటు పెట్టించాలని నిరంజన్ రెడ్డి భావిస్తున్నారు.


గుజరాత్ పర్యటనలో భాగంగా ఇఫ్కో సంస్థను సందర్శించిన ఆయన దక్షిణ తెలంగాణలో  నానో యూరియా ప్లాంట్ పెట్టాలని కోరారు. ఇఫ్కో సంస్థ తెలంగాణలో ప్లాంటు పెట్టేందుకు ముందుకు వస్తే.. ప్రభుత్వపరంగా భూమితో పాటు ఇతర సదుపాయాల ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్, కేటీఆర్ గారి అండతో అన్ని రకాల సహకారాలు అందిస్తామని నిరంజన్ రెడ్డి ప్రకటించారు. దక్షిణ తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే.. కాశ్మీర్ - కన్యాకుమారి, ముంబయి, విజయవాడ, కోల్ కత రహదారులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీంతో మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లకు అందుబాటులో ఉంటుందని వివరించారు. మరి ఇఫ్కోతో తెలంగాణలో ప్లాంటు పెట్టించాలన్న కోరిక నెరవేరుతుందా..?





గుజరాత్ పర్యటనలో భాగంగా ఇఫ్కో సంస్థను సందర్శించిన ఆయన దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ పెట్టాలని కోరారు. ఇఫ్కో సంస్థ తెలంగాణలో ప్లాంటు పెట్టేందుకు ముందుకు వస్తే.. ప్రభుత్వపరంగా భూమితో పాటు ఇతర సదుపాయాల ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్, కేటీఆర్ గారి అండతో అన్ని రకాల సహకారాలు అందిస్తామని నిరంజన్ రెడ్డి ప్రకటించారు.

రైతన్నకు శుభవార్త :త్వరలో రుణమాఫీ..!

ఏపీలో విజృంభిస్తున్న కరోనా... హాస్పిటల్స్ ఫుల్ ?

కేటీఆర్ కు షర్మిల మరో షాక్.. ఇలాకాలోనే !

కృష్ణమ్మ పరవళ్లు.. వాళ్లకు సీరియస్ వార్నింగ్...?

సాగర్ టూర్ లో సీఎం ఏం చేయబోతున్నారంటే..!

చల్లబడిన అన్న తగ్గనంటున్నా తమ్ముడు. కాంగ్రెస్ లో ఏం..?

హుజూరాబాద్‌: ఒక్కసారిగా డైలమాలో పడిపోయిన ఈటల ?

కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ... బీసీ నేత టిఆర్ఎస్ టికెట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>