PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8dc3595d-6819-4c63-82ad-cc45086b3bcd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus8dc3595d-6819-4c63-82ad-cc45086b3bcd-415x250-IndiaHerald.jpgకరోనా.. ప్రపంచానికే చీకటి కాలం.. ప్రత్యేకించి భారతీయులు కరోనా సెకండ్‌ వేవ్‌లో పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు.. కరోనా కాటేయని రంగంలేదు.. కరోనా ప్రభావం చూపని జీవితం లేదు. ఇలా దేశం మొత్తాన్ని ప్రభావితం చేసిన మహమ్మారి ఇటీవలి కాలంలో కరోనా ఒక్కటే. అయితే ఇప్పుడు క్రమంగా కరోనా మహమ్మారి భయం తగ్గిపోతోంది. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు కనుమరుగై జనజీవితం సాధారణ స్థాయికి చేరుకుంది. కరోనా సమయంలో తీవ్రంగా దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడు గాడిన పడుతోంది. ఇందుకు తాజాగా వసూలైన జీఎస్టీ పన్నులే ఉదాహరణగా చెప్పుకోవచ్చుcoronavirus{#}Indians;2020;Coronavirus;central governmentఇండియాకు గుడ్‌ న్యూస్.. ఇక కరోనా రోజులు పోయినట్టేనా..?ఇండియాకు గుడ్‌ న్యూస్.. ఇక కరోనా రోజులు పోయినట్టేనా..?coronavirus{#}Indians;2020;Coronavirus;central governmentMon, 02 Aug 2021 00:00:00 GMTకరోనా.. ప్రపంచానికే చీకటి కాలం.. ప్రత్యేకించి భారతీయులు కరోనా సెకండ్‌ వేవ్‌లో పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు.. కరోనా కాటేయని రంగంలేదు.. కరోనా ప్రభావం చూపని జీవితం లేదు. ఇలా దేశం మొత్తాన్ని ప్రభావితం చేసిన మహమ్మారి ఇటీవలి కాలంలో కరోనా ఒక్కటే. అయితే ఇప్పుడు క్రమంగా కరోనా మహమ్మారి భయం తగ్గిపోతోంది. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు కనుమరుగై జనజీవితం సాధారణ స్థాయికి చేరుకుంది.


కరోనా సమయంలో తీవ్రంగా దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడు గాడిన పడుతోంది. ఇందుకు తాజాగా వసూలైన జీఎస్టీ పన్నులే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  జులై నెలకు లక్షా 16 వేల కోట్ల రూపాయలమేర వస్తు, సేవల పన్నుఅంటే జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ తాజాగా  ఓ ప్రకటనలో తెలిపింది. అంటే ఈ మొత్తం గతేడాది జులైతో పోల్చితే 33శాతం అధికం అన్నమాట. అంటే వసూళ్లు చాలా బాగా ఉన్నట్టు అన్నమాట.


మన దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందనేందుకు ఈ జీఎస్టీ వసూళ్లు ఓ సంకేతమని ఆర్థికశాఖ చెబుతోంది. 2020 జులైలో మన దేశంలో  జీఎస్టీ వసూళ్లు 87 వేల 422 కోట్లు మాత్రమే. అదే  ఈ ఏడాది జూన్‌లో 92 వేల 849 కోట్ల రూపాయల జీఎస్టీ మాత్రమే వసూలైంది. ఇక జులై విషయానికి వస్తే.. ఇది చాలా బాగా పెరిగింది. ఈనెలలో లక్షా 16 వేల 393 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్లు  కేంద్రం తన తాజా లెక్కల్లో చెప్పింది. ఇక ఈ మొత్తంలో కేంద్ర జీఎస్టీ 22 వేల 197 కోట్లు కాగా..  రాష్ట్ర జీఎస్టీ 28 వేల 541 కోట్లుగా ఉందట. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 57వేల 864 కోట్ల రూపాయలట.


దిగుమతి చేసుకున్న వస్తువులతో కలిపి 7,790 కోట్లు సెస్‌ వసులైందట. ఈ లెక్కలతో సంతృప్తి చెందిన కేంద్రం వచ్చే నెలల్లో కూడా ఇలాగే వసూళ్లు ఉంటాయని చెబుతోంది. ఇలా మరో రెండు నెలలు అత్యధిక జీఎస్టీ వసూలైతే.. కరోనా రోజులు పోయి దేశానికి మంచి రోజులు వచ్చినట్టే కదా.



జగన్‌కు బంపర్ ఆఫర్ అప్పుడే ఉంటుందా?

ఆసక్తికర విషయాలు చర్చించిన తెలంగాణ మంత్రి మండలి?

కిషన్ రెడ్డిని సీక్రెట్ గా కలిసిన ఏపీ మంత్రులు?

మన దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందనేందుకు ఈ జీఎస్టీ వసూళ్లు ఓ సంకేతమని ఆర్థికశాఖ చెబుతోంది. 2020 జులైలో మన దేశంలో జీఎస్టీ వసూళ్లు 87 వేల 422 కోట్లు మాత్రమే. అదే ఈ ఏడాది జూన్‌లో 92 వేల 849 కోట్ల రూపాయల జీఎస్టీ మాత్రమే వసూలైంది. ఇక జులై విషయానికి వస్తే.. ఇది చాలా బాగా పెరిగింది. ఈనెలలో లక్షా 16 వేల 393 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం తన తాజా లెక్కల్లో చెప్పింది.

బండి సంజయ్ కు అడ్డుపడుతున్న ఆ కేంద్ర మంత్రి?

విజయం మీదే: నెగటివ్ ఆలోచనలకు ఇలా స్వస్తి పలకండి ?

అమాయక గిరిజనుల పై ఉపా అస్త్రం.. మూడేళ్లలో ఇన్ని కేసులా..?

చరిత్ర సృష్టించిన పీవీ సింధు

రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వానికి ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>