PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-df5fd28c-18cf-4173-8af4-6fa048e3122d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-df5fd28c-18cf-4173-8af4-6fa048e3122d-415x250-IndiaHerald.jpgమినహా మిగతా అన్ని నల్లా కనెక్షన్ లకు నీటి మీటర్ తప్పనిసరి పెట్టుకోవాలి. ఒకవేళ మీటరు ఉన్నా అది పని చేయకుంటే నీటి బిల్లు తప్పనిసరి వస్తుందని, ఇప్పటికే హైదరాబాద్ జలమండలి 4 సార్లు తేదీనీ పొడగించి నప్పటికీ కానీ వినియోగదారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అపార్ట్ మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది కరోనా కారణంగా, లాక్‌డౌన్‌ పడ్డ నేపద్యంలో వారి యొక్క స్వస్థలాలకు వెళ్లడం, మరికొందరేమో విదేశాలలో ఉండడం వల్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేక పోతుందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా ఆగPolitical {#}Hyderabad;Coronavirus;Government;Aqua;central governmentగ్రేటర్ ప్రజలు జాగ్రత్త.. ఆధార్ జత చేయకుంటే ఇంత ఫైన్ కట్టాల్సిందే...?గ్రేటర్ ప్రజలు జాగ్రత్త.. ఆధార్ జత చేయకుంటే ఇంత ఫైన్ కట్టాల్సిందే...?Political {#}Hyderabad;Coronavirus;Government;Aqua;central governmentMon, 02 Aug 2021 18:05:00 GMTగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉచితంగా ఇచ్చే వాటర్ సరఫరా పథకానికి ఆధార్ నెంబర్ను  జత చేసుకోవడానికి  చివరి తేదీ  ఈ నెల 15 తో ముగియనున్నదని  అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా  దాదాపు  10.85 లక్షల నల్ల కలెక్షన్లు ఉన్నాయని, కానీ ఇప్పటివరకు 5.6 లక్షల మంది మాత్రమే  వారి యొక్క నల్ల కలెక్షన్ కు ఆధార్ను అను సంధానం చేశారని. మరో  4.5 లక్షల మంది ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయలేదని అన్నారు. వారు ఆధార్ను అనుసంధానం చేయకపోతే సదర్ వినియోగదారునికి ఒకేసారి తొమ్మిది నెలల నీటి బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక నెలలో  600 రూపాయలు నీటి బిల్లు చెల్లించే వారు, 5400 రూపాయలను చెల్లించవలసి ఉంటుందన్నమాట.

 **చెల్లించని వారిలో వీరే అత్యధికం **
 హైదరాబాద్ నగరంలో ఎక్కువ మొత్తంలో అపార్ట్మెంట్ వినియోగదారులు మాత్రమే  ఈ ఆధార్ అనుసంధానం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ట్లు సమాచారం. కానీ ఇది ప్రతి ఒక్క అపార్ట్మెంట్, ఫ్లాట్స్ యజమానుల అంతా అనుసంధానం చేసుకోవాల్సిందే అని, ఎవరైనా  ఆధార్ అనుసంధానం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వారు నీటి బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని హైదరాబాద్ జలమండలి స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలోని  మురికి వీధుల్లో మాత్రం జలమండలి సిబ్బంది వారి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి  ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. మిగతా నగర వాసులు మాత్రం  ఐఎన్ వెబ్సైట్ లో సంప్రదించాలని, లేదంటే మీ సమీపంలోని మీసేవ కేంద్రంలో  ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేసుకోవాలని  జలమండలి  స్పష్టం చేసింది.

 హైదరాబాదులోని జిహెచ్ఎంసి పరిధిలో మాత్రం  ఒక నెల 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని  అందించడం కోసం  ప్రభుత్వం  ఉచిత నీరు పథకాన్ని తీసుకు వచ్చింది. దీనికోసం  కేంద్ర ప్రభుత్వ  మార్గదర్శకాలను అనుసరించి నీటి వినియోగదారుల అందరూ తమ యొక్క ఆధార్ నెంబర్ను నల్ల కనెక్షన్ కు  అనుసంధానం చేసుకోవాలని సూచిస్తోంది. స్లమ్ ఏరియా మినహా  మిగతా అన్ని నల్లా కనెక్షన్ లకు  నీటి మీటర్ తప్పనిసరి పెట్టుకోవాలి. ఒకవేళ మీటరు ఉన్నా  అది పని చేయకుంటే  నీటి బిల్లు తప్పనిసరి వస్తుందని, ఇప్పటికే  హైదరాబాద్ జలమండలి 4 సార్లు  తేదీనీ పొడగించి నప్పటికీ కానీ వినియోగదారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  దీనికి ప్రధాన కారణం  అపార్ట్ మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది  కరోనా కారణంగా, లాక్‌డౌన్‌ పడ్డ నేపద్యంలో వారి యొక్క స్వస్థలాలకు వెళ్లడం, మరికొందరేమో విదేశాలలో ఉండడం వల్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేక పోతుందని  పలువురు అంటున్నారు. ఇప్పటికైనా  ఆగస్టు 15వ తేదీలోగా  ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జలమండలి  నల్ల కలెక్షన్ వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తోంది.



మ‌రో ఆర్ఆర్ఆర్‌ని త‌యారుచేస్తోన్న జ‌గ‌న్ స‌ర్కార్‌?

కృష్ణా జలాల విషయంలో వైఎస్ జగన్ దాదాగిరి

నీటి విష‌య‌మై ఆంధ్రా దాదాగిరి నిజ‌మేనా!

ఉక్కు కార్మికులపై ఉక్కుపాదం

రాజీనామాకు సిద్దమైన రాజాసింగ్ ?

పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం అదేనా...?

స్టీల్ ప్లాంట్ అమ్మకం వెనక ఒక కేంద్ర మంత్రి కుమారుడు

పోల‌వ‌రం విష‌యంలో ఏపీకి మ‌రో షాక్.. !

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం అప్పుడేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>