PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/doctor-saline-health-problem8de2ba14-fd16-41f8-b1b6-5804dba920dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/doctor-saline-health-problem8de2ba14-fd16-41f8-b1b6-5804dba920dd-415x250-IndiaHerald.jpgవైరల్: ఓ చేతికి సలైన్ ఎక్కించుకుంటూ.. మరో చేత్తో చికిత్స అందిస్తున్న 'గ్రేట్ డాక్టర్'..! దేవుని తరువాత మనం చేతులెత్తి మొక్కే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క వైద్యుడే అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. కంటికి కనిపించని ఆ దేవుడు మనకు ప్రాణం పోస్తే కంటికి కనిపించే ఈ దేవుళ్లు అదేనండి మన వైద్యులు ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి సాయిశక్తుల ప్రయత్నిస్తారు. కరోనా వంటి మహమ్మరి దేశాన్ని అల్లకల్లోలంగా మార్చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్న వేళ మీ ప్రాణాలకు అండగా మేముంటాము.. కరోనా వైరస్ ని తరdoctor, saline, health problem{#}Doctor;Manam;Coronavirus;Ee Rojullo;District;prasad;Governmentగ్రేట్ డాక్టర్ : ఒక చేత్తో సెలైన్.. మరొక చేత్తో రోగులకు ట్రీట్మెంట్.. !గ్రేట్ డాక్టర్ : ఒక చేత్తో సెలైన్.. మరొక చేత్తో రోగులకు ట్రీట్మెంట్.. !doctor, saline, health problem{#}Doctor;Manam;Coronavirus;Ee Rojullo;District;prasad;GovernmentMon, 02 Aug 2021 11:00:00 GMTకరోనా వంటి మహమ్మరి దేశాన్ని అల్లకల్లోలంగా మార్చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్న వేళ మీ ప్రాణాలకు అండగా మేముంటాము.. కరోనా వైరస్ ని తరిమి కొడతాం అని ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో మంది ప్రాణాలను సైతం కాపాడారు డాక్టర్లు. కరోనా వైరస్ వలన డాక్టర్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం అని తెలిసిన హాస్పిటల్ లో ఉంటూ కరోనా సోకిన వారికి చికిత్స చేస్తున్నారు. డాక్టర్స్ మన కెందుకు వచ్చిందేలే. నేను బాగున్నాను... నా కుటుంబం బాగుంది అని స్వార్ధంగా ఆలోచిస్తే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ అవేమి పట్టించుకోకుండా దేవుడిలా మనల్ని ఆదుకుంటున్నారు.. ఈ క్రమంలో ఒక డాక్టర్ చేసిన పని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

వీడియో చుసిన ప్రతి ఒక్కరు కూడా ఆ డాక్టర్ ని మెచ్చుకోకుండా ఉండలేరు. తనకి ఆరోగ్యం బాగోలేకపోయిన హాస్పిటల్ కి వచ్చి ఒక చేత్తో సెలైన్ పెట్టుంచుకుని మరో చేత్తో వచ్చిన రోగులకు చికిత్స అందిస్తున్నాడు. ఏంటి అసలు ఈ రోజుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా అనే అనుమానం వస్తుంది కదా. కానీ ఇది నిజంగానే జరిగిన ఘటన. ఆ డాక్టర్ సెలైన్ పెట్టించుకుని రోగులకు ట్రీట్మెంట్ ఇస్తుంటే ఎవరో వీడియో తీసి పోస్ట్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది. అసలు వీడియోలో కనిపించే డాక్టర్ ఎవరు..? ఏ ఊరి హాస్పిటల్ లో డాక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు అనే విషయాలు తెలుసుకుందాం.

తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని రేఖపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సుందర్ ప్రసాద్‌ అనే వ్యక్తి డాక్టర్ గా అక్కడ ప్రజల బాగోగులు చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో సుందర్ ప్రసాద్ కి ఆరోగ్యంగా బాగోలేక ఒక చేతికి సెలైన్ పెట్టించుకున్నారు. నిజానికి సెలైన్ బెడ్ మీద పనుకుని విశ్రాంతి తీసుకుంటూ హ్యాండ్ కదపకుండా ఎంతో జాగ్రత్తగా పెట్టించుకుంటారు. కానీ ఈ డాక్టర్ మాత్రం ఏకంగా కుర్చీలో కూర్చిని సెలైన్ పెట్టించుకుని మరోపక్క హాస్పిటల్ కి వచ్చిన రోగులకు చికిత్స చేస్తున్నాడు. ఆ డాక్టర్ కి  ఆరోగ్యం బాగోలేని కారణం చేతనో లేదంటే చేసేది గవర్నమెంట్ ఉద్యోగమే కదా ఎప్పుడు కావలిస్తే అప్పుడు సిక్ లీవ్ పెట్టుకోవచ్చు  అని ఆ డాక్టర్ ఆలోచించలేదు. నేను వెళ్లకపోతే ఎంతో మంది రోగులకు ట్రీట్మెంట్ ఆలస్యం అవుతుందని భావించి ఎంతో గొప్ప మనసుతో తన బాధ్యత తాను తీరుస్తూ మానవత్వం చాటుకున్నాడు ఈ డాక్టర్ బాబు.


ఫైట్ ఫర్ రైట్ : ఆ ఒక్క ఉద్యమం అణిచి వేస్తే...

వాట్ ఈజ్ `ఈ-రూపీ`.. ఎలా ఉప‌యోగించాలి..?

దళిత బంధు ప్రారంభం ఈ నెలలోనే?

ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చి.. చ‌ర‌ణ్‌తో ఫిక్స్ అయిన క్రేజీ హీరోయిన్ ?

వైసీపీ నయా టార్గెట్ బీజేపీ

ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

కరోనా నెగెటివ్ రిపోర్ట్ మస్ట్.. లేకపోతే..!

జపాన్ లో చాపకింద నీరులా కరోనా కేసులు...

మనీ : ఇందులో చేరితే సంవత్సరానికి రూ. 25 లక్షలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>