Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/terrorst86c9e84e-e5f1-45f7-851f-8d03d251f0d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/terrorst86c9e84e-e5f1-45f7-851f-8d03d251f0d7-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్లో రోజురోజుకు ఉగ్రవాదం పెరిగిపోతుంది... అక్కడ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక ఉగ్రవాదం ఒక్కటే ఉపాధి అని భావించే విధంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఎంతో మంది యువత ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే కేవలం పాకిస్తాన్ పౌరులు మాత్రమే కాదు.. భారత్ లోని కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న పౌరులను సైతం ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. చదువుల పేరుతో ఆకర్షిస్తూ చివరికి విద్యార్థులను ఉగ్రవాదులుగా మారుతున్నట్లు ఇటీవలికాలంలో బయటపడింది. చదువుల కోసం పాకిస్తాన్ వెళుతున్న Terrorst{#}Pakistan;Bangladesh;students;terrorism;Nijam;Terrorists;Army;Jammu and Kashmir - Srinagar/Jammu;India;Hanu Raghavapudiవెళ్లేటప్పుడు విద్యార్థులు.. వచ్చేటప్పుడు ఉగ్రవాదులు?వెళ్లేటప్పుడు విద్యార్థులు.. వచ్చేటప్పుడు ఉగ్రవాదులు?Terrorst{#}Pakistan;Bangladesh;students;terrorism;Nijam;Terrorists;Army;Jammu and Kashmir - Srinagar/Jammu;India;Hanu RaghavapudiMon, 02 Aug 2021 10:40:00 GMTపాకిస్తాన్లో రోజురోజుకు ఉగ్రవాదం పెరిగిపోతుంది...  అక్కడ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక ఉగ్రవాదం ఒక్కటే ఉపాధి అని భావించే విధంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఎంతో మంది యువత ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తున్నారు.  అయితే కేవలం పాకిస్తాన్ పౌరులు మాత్రమే కాదు.. భారత్ లోని కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న పౌరులను సైతం ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.  చదువుల పేరుతో ఆకర్షిస్తూ చివరికి విద్యార్థులను ఉగ్రవాదులుగా మారుతున్నట్లు ఇటీవలికాలంలో బయటపడింది.


 చదువుల కోసం పాకిస్తాన్ వెళుతున్న ఎంతో మంది కాశ్మీర్ విద్యార్థులు ఇక తిరిగి వచ్చే సమయంలో మాత్రం ఉగ్రవాదులు గా మారి వస్తున్నారట. ఈ విషయంపై ఇటీవలే అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారత ఆర్మీ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల భారత ఆర్మీ ఎన్కౌంటర్ లో షకీల్ అల్తాఫ్ బట్ అనే చనిపోయాడు . అయితే ఇక అతని గురించి విచారించగా ఊహించని నిజం బయటపడింది. 2018లో కాశ్మీర్ ప్రాంతం నుంచి ఇక చదువు కోసం ఈ యువకుడు పాకిస్తాన్ వెళ్లాడని.. ఇక ఆ తర్వాత ఉగ్రవాదిగా మారి ఇక భారత్ కు తిరిగి వచ్చాడు అనే విషయాన్ని అధికారులు గుర్తించారు.



 ఇలా 2015 నుంచి 2019 వరకు కూడా చదువు పేరుతో పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్ళినా 40 మంది విద్యార్థుల్లో 29 మంది విద్యార్థులు ఉగ్రవాదులుగా మారి మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చారు అన్న విషయం ఇటీవలే భారత సెక్యూరిటీ ఏజెన్సీ లు గుర్తించాయి. ఇక ఆయా విద్యార్థుల పాస్పోర్టు వివరాల ప్రకారమే ఈ విషయాన్ని గ్రహించినట్లు  పేర్కొన్నాయి. గత మూడేళ్ల కాలంలో ఇలా చదువుల కోసం పాకిస్థాన్ వెళ్లిన 100 మంది విద్యార్థులు ఇప్పటికి కూడా కనిపించకుండా పోయారు అని ఇటీవల అధికారులు చెప్పుకొచ్చారు. ఇలా చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు ఉగ్రవాదులు గా మారి మళ్లీ స్వదేశం వచ్చి ఇక ఉగ్ర సంస్థలకు స్లీపర్ సెల్స్ గా పని చేస్తున్నారని భారత ఆర్మీ అధికారులు గుర్తించారు.



సెమిస్ కి చేరిన మహిళల హాకీ జట్టు

నాగార్జున చేసిన త‌ప్పులే ఆయ‌న్ను బాలీవుడ్ స్టార్ కాకుండా అడ్డుప‌డ్డాయా ?

సుకుమార్ తన తండ్రి జ్ఞాపకంగా..20 లక్షలు పెట్టి..

సౌత్ పై బాలీవుడ్ భామల దండయాత్ర

సింధు విజయాల వెనుక.. ఆమె కోచ్ త్యాగాలు తెలుసా..?

18 ఏళ్ల క్రితం హైద‌రాబాద్‌లో మాయం అయిన `ఆలం` ఆస్ట్రేలియాలో ప్ర‌త్యక్షం..!

దిల్ రాజు లో ఎందుకు ఇంత మార్పు!!

గుజరాత్‌కే ఝలక్‌ ఇవ్వనున్న తెలంగాణ..?

అయ్యో.. ఇండియా నుంచి బిలియనీర్లు వెళ్లిపోతున్నారట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>