CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-8045da11-00d1-4633-854c-5d53c12cd7e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-8045da11-00d1-4633-854c-5d53c12cd7e6-415x250-IndiaHerald.jpgఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తాను చనిపోయేముందు లెటర్ లో తన మృతికి నిరుద్యోగమే కారణమని రాసుకొని జేబులో పెట్టుకొని ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఏది ఏమైనా ఆత్మహత్య చేసుకోవడం అనేది తప్పుడు చర్యగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్లీ అదే విధంగా పోరాడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కానీ ఆత్మహత్య చేసుకోవడం పిరికి చర్య భావించవచ్చుCrime {#}mandalam;Letter;job;Yevaru;KCR;students;Telanganaదారుణం: ఉద్యోగం రాలేదని రైలు కింద పడ్డాడు..!దారుణం: ఉద్యోగం రాలేదని రైలు కింద పడ్డాడు..!Crime {#}mandalam;Letter;job;Yevaru;KCR;students;TelanganaMon, 02 Aug 2021 11:05:00 GMTఎంతో మంది విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ సిద్ధించింది అని  చెప్పవచ్చు. ఆనాడు  ఉద్యమంలో  బరిగీసి కొట్లాడి  తెలంగాణ సాధనకు  సహకరించినటువంటి విద్యార్థులు ప్రస్తుతం  ఏం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత  ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. దీంతోపాటుగా  మన పాలన మనకు వస్తే  మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంతో ఆశతో ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు కూడా చేసుకున్నారు. కానీ అలాంటి విద్యార్థులకు ప్రస్తుత కాలంలో  భంగపాటు తప్పలేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎలాంటి ఉద్యోగాలు లేక, కుటుంబ పరిస్థితులను భరించలేక  ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.

లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్  ఇప్పటి వరకు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని  వారు అడుగుతున్నారు. ఎక్కడికక్కడ కేసీఆర్ ను అడ్డుకుంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి ఓ నిరుద్యోగి  తన ఉద్యోగం రాలేదని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎవరు ఆ విద్యార్థి..? ఆయనకు ఏం జరిగింది.? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే  నా చావుకి నిరుద్యోగం కారణం అని ఒక లెటర్ మీద రాసి తన జేబులో పెట్టుకొని ఆ నిరుద్యోగి రైలు కిందపడి చనిపోయాడు. జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన మహమ్మద్ షబ్బీర్  26 సంవత్సరాల నిరుద్యోగి. ఈ యువకుడు  డిగ్రీ, మరియు ఐటిఐ  పూర్తి చేసి ఉద్యోగం కోసం  సన్నద్ధం అవుతున్నాడు. నోటిఫికేషన్ వస్తాయని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో నాకు ఉద్యోగం రాదేమోనని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

తాను చనిపోయేముందు లెటర్ లో  తన మృతికి నిరుద్యోగమే కారణమని రాసుకొని జేబులో పెట్టుకొని ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు  తమ కుటుంబానికి న్యాయం చేయాలని మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఏది ఏమైనా  ఆత్మహత్య చేసుకోవడం అనేది తప్పుడు చర్యగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్లీ అదే విధంగా పోరాడి  ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కానీ ఆత్మహత్య చేసుకోవడం పిరికి చర్య భావించవచ్చు.



ఫైట్ ఫర్ రైట్ : ఆ ఒక్క ఉద్యమం అణిచి వేస్తే...

దళిత బంధు ప్రారంభం ఈ నెలలోనే?

రాజమౌళి రేంజ్ లో మారుతి నెక్స్ట్ సినిమా?

థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ "రాక్షసుడు"కి రెండేళ్లు !

జగన్ సర్కార్ కి కేంద్ర ఝలక్

వెళ్లేటప్పుడు విద్యార్థులు.. వచ్చేటప్పుడు ఉగ్రవాదులు?

స్నేహితుల దినోత్సవం రోజు మిగిలిచిన విషాదం

నాగార్జున సాగర్‌కు సీఎం కేసీఆర్‌.. షెడ్యూల్‌ ఇదే !

టాలీవుడ్‌కు వైసీపీ కీల‌క నేత ఇచ్చిన హామీ ఏంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>