MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movie4551bee0-2e3c-4985-87e9-b1c1b6c11740-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movie4551bee0-2e3c-4985-87e9-b1c1b6c11740-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇపుడు అతి పెద్ద రిస్క్ చేస్తోంది. ఒక విధంగా జూదమే ఆడుతోంది. నిజానికి సినిమా అన్నది కళ అయినా వ్యాపారం కూడా. ఒక సినిమా హిట్ అయితే దాని మీద ఆధారపడిన వారు అంతా బాగుంటారు. అదే సినిమా ఫట్ అయితే వందల కుటుంబాలు ఇబ్బందులో పడతాయి. movie{#}Cinemaపెద్ద సినిమాలకు అసలైన విలన్లు... ?పెద్ద సినిమాలకు అసలైన విలన్లు... ?movie{#}CinemaSun, 01 Aug 2021 20:00:00 GMTటాలీవుడ్ ఇపుడు అతి పెద్ద రిస్క్ చేస్తోంది. ఒక విధంగా జూదమే ఆడుతోంది. నిజానికి సినిమా అన్నది కళ అయినా వ్యాపారం కూడా. ఒక సినిమా హిట్ అయితే దాని మీద ఆధారపడిన వారు అంతా బాగుంటారు. అదే సినిమా ఫట్ అయితే వందల కుటుంబాలు ఇబ్బందులో పడతాయి.

ఇక టాలీవుడ్ కి కరోనా చేసిన నష్టం అంతా ఇంతా కాదు, పాన్ ఇండియా మూవీస్ వరసపెట్టి చేస్తున్న టాలీవుడ్ కి కరోనా మహమ్మారి అనుకోని అడ్డుకట్ట వేసేసింది. ఒక్కో సినిమా మీద బడ్జెట్ రెండింతలు పెరిగిపోయింది. ఇక తీసిన సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి అనుకూల పరిస్థితులు లేవు. దాంతో పెద్ద సినిమాల మేకర్స్ గుండేల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇక మూడవ విడత కరోనా భయం ఒక వైపు ఉండగానే 2022 సంక్రాంతి కోసం పెద్ద సినిమాలు కర్చీఫ్ వేసేశాయి. ఈ సినిమాలు అన్నీ కనుక వస్తే టాలీవుడ్ బొమ్మ అదిరిపోతుంది అనే చెప్పాలి.

అయితే సంక్రాంతి సీజన్ మంచిదే. పది రోజులకు పైగా సెలవులు ఉంటాయి. కచ్చితంగా సినిమా బాగుంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ అలాగనుకుని పాన్ ఇండియా సినిమాలను దించితే మాత్రం ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అయితే ప్రభాస్ మాత్రం తన రాధేశ్యామ్ మూవీని సంక్రాంతి పండుగ బరిలోకి దించేస్తున్నాడు. ఇక ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ సినిమా, మహేష్ బాబు సర్కార్ వారి పాట,  వెంకటేష్ ఎఫ్ 3 మూవీ కూడా సంక్రాంతి రేసులో ఉంటాయంటే మాత్రం ఆశ్చర్యమే కలుగుతోంది.

ఇవన్నీ కూడా పెద్ద సినిమాలు, వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన మూవీస్. ఇవన్నీ క్యూ కట్టి వచ్చినా కూడా నలుగురూ కలెక్షన్లు పంచుకోవడమే తప్ప సోలోగా ఒకరికే బ్లాక్ బస్టర్ దక్కదు అన్న మాట ఉంది. అయినా సరే ఇంతకు మించి ముందుకు వెళ్తే మరింత నష్టమనే పెద్ద సినిమాలు ఇలా డేర్ చేస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి పెద్ద సినిమాలు అన్నీ కట్టకట్టుకువస్తే సినిమాల్లో విలన్ ఎవరు ఉన్నా ఈ పోటీయే వారికి అసలైన విలన్ అంటున్నారు సినీ పండితులు.


   





RRR దోస్తీ సాంగ్.. అనిరుధ్ పాట అదుర్స్ అంటున్నారు..!

టాలీవుడ్ ఇపుడు అతి పెద్ద రిస్క్ చేస్తోంది. ఒక విధంగా జూదమే ఆడుతోంది. నిజానికి సినిమా అన్నది కళ అయినా వ్యాపారం కూడా. ఒక సినిమా హిట్ అయితే దాని మీద ఆధారపడిన వారు అంతా బాగుంటారు. అదే సినిమా ఫట్ అయితే వందల కుటుంబాలు ఇబ్బందులో పడతాయి.

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ బేబి ?

ఆ విషయంలో వెంకీ అదృష్టవంతుడు.. ?

నా తండ్రిని నేను నష్టపరిచాను అన్నారు : బాలు కొడుకు

పవన్ మొహమాటమే ఇంత దూరం తెచ్చింది!!

రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.. ?

మరొక సారి రాజమౌళి తనకు ఎదురులేదని నిరూపించాడు!

బడా హీరోల గురించి ఎం.ఎస్.రాజు ఏమన్నాడంటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>