అరుదైన చిత్రాలు.!అద్బుతమైన సంఘటనలు.!ఫ్రెండ్ షిప్ డే ప్రత్యేకం.!
హైదరాబాద్ : కొన్ని సందర్బాల్లో ఛాయా చిత్రాలు అదే ఫోటోలు జీవం పోసున్నాయంటారు. ఫోటోలు మాట్లాడతాయంటారు. ఫోటోలు గతాన్ని ఆవిష్కరిస్తాయంటారు. ఫోటోలు తీపి జ్ఞాపకాలకు గుర్తులుగా మిగిలిపోతాయంటారు. ఫోటోలు మనసులో ముద్ర వేసుకుంటే చెరిగిపోవంటారు. నిజంగా కొన్ని ఫోటోలను చూస్తే ఆ ఫోటో తీసిన సందర్బంగా చోటుచేసుకున్న సంఘటనలన్నీ కళ్ల ముందు కదులుతుంటాయి. సంతోషం, విషాదం, చావు, పుట్టుక, వినాశనం, విధ్వంసం, యుద్దం, ప్రకృతి వైపరిత్యం వంటి సంఘటనలను ఫోటోలో రూపంలో నిక్షిప్తమైన కొన్ని ఏళ్ల తర్వాత అవి మన ముందు ప్రత్యక్షమైతే ఆ ఫోటోలో ఉన్న కిక్కే వేరబ్బా అనుకుంటాం. అలాంటి కొన్ని అరుదైన చిత్రాలను చూద్దాం.!

ఆనాటి బీజేపి ముఖ్యనేతలతో చంద్రబాబు..
2004సంవత్సరానికి ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న ఎల్ కే అద్వాని, మురళీ మనోహర్ జోషి తో చంద్రబాబు దిగిన ఫోటో చరిత్రను పునరావృతం చేస్తోంది. దివంగత ప్రధాని వాజ్ పేయి ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో దక్షణ భారత దేశంనుండి చంద్రబాబు మంచి ప్రదాన్యత ఇచ్చింది బారతీయ జనతా పార్టీ. ఫోటోలో చంద్రబాబు వెనక ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కూడా చూడొచ్చు. బీజేపి తో చంద్రబాబు నాయుడుకు ఉన్న స్నేహానికి ప్రతీకగా ఈ ఫోటో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం కలగదు.

ఆ బాలుడే ఇప్పటి సీజేఐ..
స్వర్గీయ నందమూరి తారక రామారావుతో ప్రస్తుత సీజేఐ ఎల్వీ రమణ తీసుకున్న ఫోటో యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఎల్వీ రమణకు సన్మానం చేయాల్సిన సందర్బంలో తీసిన ఫోటో ఇది. రమణ భారత దేశ అత్యున్నత న్యాయస్దానానికి చీఫ్ జస్టిస్ గా ఎంపిక అవుతారని ఆనాడు ఎవ్వరూ ఊహించి ఉండరు. కాని అసాధ్యాన్ని సుసాద్యం చేసిన ఎల్వీ రమణ, సర్వీయ ఎన్టీఆర్ తో దిగిన ఫోటో ఎంతొ మంది విద్యార్థినీ విద్యార్ధుల్లో స్పూర్తి నింపుతోంది.

అపూర్వ ఆలింగనం..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి సంబందించిన అరుదైన ఫోటో ఇది. అసలు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి సంభాషించుకున్నట్టు ఉన్న ఫోటోలు దొరకడమే కష్టం. కాని ఏకంగా విజయసాయి రెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫోటో పార్టీ శ్రేణులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 2019 సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కష్టపడి పని చేసిన విజయసాయి రెడ్డిని ఇలా జగన్మోక్షహన్ రెడ్డి కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపారు. స్నేహితుల దినోత్సవం సందర్బంగా ఈ ఫోటో కూడా వైరలం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పవర్ ఫుల్ హగ్..
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రండ్స్ గా ముద్ర వేసుకున్న జనసేన అధినేత పవర్ కళ్యాణ్, తెలంగాణ పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిస్తే, కలిసి కౌగిలించుకుంటే.. అది రాజకీయాల్లో ఎప్పటికి సంచలనమే. వీరిద్దరి కలయికతో అరుదైన ఫోటో వెలుగులోకి వస్తే అది నిజంగా అభిమానులకు పండుగ వాతావరణమే.గిరిజన భూముల్లో యురేనియం తవ్వకాలపై జనసేన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరైన సందర్బంగా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని మన్సూర్తిగా కౌగిలించుకున్న ఫోటో నిజంగా అభిమానుల పాలిట కిక్కే..!

కేసీఆర్,మమత బెనర్జీల విశిష్ట కలయిక..
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కలిసారు. ఐదేళ్ల క్రితం దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి పేరుతో రాజకీయ వేదిక కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా మమత బెనర్జీని సంప్రదించారు చంద్రశేఖర్ రావు. ఈ సందర్బంగా తీసకున్న ఫోటో తెలంగాణ ప్రజానికాన్ని ఎంతగానో ఆకర్శించిందని చెప్పొచ్చు. మమతను శాలువాతో సత్కరించి పూలగుచ్చాన్ని అందించారు చంద్రశేఖర్ రావు.