PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-vs-jaganeead730f-d39e-4f87-ba26-9319d6c69fba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-vs-jaganeead730f-d39e-4f87-ba26-9319d6c69fba-415x250-IndiaHerald.jpgవైసీపీ గెలుచుకున్న 151 నియోజకవర్గాల్లోనే కాదు, ప్రతిపక్షాలు గెలుచుకున్న మిగతా చోట్ల కూడా అధికార పార్టీ ప్రభావం గట్టిగానే ఉంది. అయితే వైరివర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు వైసీపీకి మద్దతివ్వడంతో ఆయా నియోజకవర్గాలు సమస్యాత్మకంగా మారాయి. ఆమధ్య గన్నవరం విషయంలో ఎమ్మెల్యే వంశీకి, ఆయన ప్రత్యర్థికి సీఎం జగన్ స్వయంగా సయోధ్య కుదర్చాల్సిన పరిస్థితి. సరిగ్గా ఇప్పుడిదే సిచ్యుయేషన్ రాజోలులో వచ్చింది. రాజోలులో జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసీపీ నాయకులకు షాకులమీద షాకులిస్తున్నారు. ప్రస్తుతం అpawan vs jagan{#}RAPAKA VARA PRASADA RAO;Janasena;gannavaram;MLA;Rajolu;Party;Aqua;CM;YCPజగన్ టీమ్ కి షాకిస్తున్న పవన్ శిష్యుడుజగన్ టీమ్ కి షాకిస్తున్న పవన్ శిష్యుడుpawan vs jagan{#}RAPAKA VARA PRASADA RAO;Janasena;gannavaram;MLA;Rajolu;Party;Aqua;CM;YCPSun, 01 Aug 2021 08:00:00 GMTవైసీపీ గెలుచుకున్న 151 నియోజకవర్గాల్లోనే కాదు, ప్రతిపక్షాలు గెలుచుకున్న మిగతా చోట్ల కూడా అధికార పార్టీ ప్రభావం గట్టిగానే ఉంది. అయితే వైరివర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు వైసీపీకి మద్దతివ్వడంతో ఆయా నియోజకవర్గాలు సమస్యాత్మకంగా మారాయి. ఆమధ్య గన్నవరం విషయంలో ఎమ్మెల్యే వంశీకి, ఆయన ప్రత్యర్థికి సీఎం జగన్ స్వయంగా సయోధ్య కుదర్చాల్సిన పరిస్థితి. సరిగ్గా ఇప్పుడిదే సిచ్యుయేషన్ రాజోలులో వచ్చింది. రాజోలులో జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసీపీ నాయకులకు షాకులమీద షాకులిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వైసీపీలోనే మూడు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

జగన్ కు జై కొట్టినా.. రాపాక వరప్రసాద్ పేరు చెబితే ఇంకా జనసేన పార్టీయే అందరికీ గుర్తొస్తుంది, పవన్ శిష్యుడిగానే ఆయనకు పేరుంది. అయితే జనసేనలో డమ్మీగా ఉండటం ఇష్టంలేక, రాపాక వెంటనే వైసీపీ వైపు వచ్చేశారు. కానీ అక్కడ ఆయన ఇమడలేకపోతున్నారు. స్థానికంగా ఆయన చేతిలో ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు, అమ్మాజీ వర్గాలతో ఆయనకు విభేదాలున్నాయి.

బొంతు రాజేశ్వరరావు రాపాక చేతిలో ఓడిపోయినా, ఆయనకంటూ సొంత వర్గం ఉంది. అందులో ఆయనిప్పుడు గ్రామీణ నీటి సరఫరా సలహా కార్పొరేషన్ కి చైైర్మన్ అయ్యారు. నామినేటెడ్ పోస్ట్ రావడంతో ఆయన మరోసారి నియోజకవర్గంలో తన హవా చూపిస్తున్నారు. సహజంగానే ఎమ్మెల్యే రాపాకకు ఈ వ్యవహారం ఇబ్బందిగా మారింది. దీంతో జనసేనలో ఉన్న తన వర్గాన్ని, వైసీపీలో రాజేశ్వరరావు వ్యతిరేక వర్గాన్ని ఒకచోటకు చేర్చారు రాపాక. రాజోలు వైసీపీని ముక్కలు చేశారు.

రాజోలు ప్రస్తుత వైసీపీ ఇన్ చార్జి అమ్మాజీతో కూడా ఎమ్మెల్యే రాపాకకు పొసగడంలేదు. తన సొంత ఊరిలో కూడా సర్పంచ్ అభ్యర్థిని అమ్మాజీ డిసైడ్ చేయడంతో రాపాక రెబల్ అభ్యర్థిని గెలిపించుకున్నారు. దీంతో అక్కడ వైసీపీ పరువుపోయింది. ఇటీవల కొన్ని ఉద్యోగ బదిలీల్లో కూడా రాపాక, అమ్మాజీ మధ్య ఆధిపత్య పోరు నడిచినట్టు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా బదిలీలు జరక్కూడదనేది రాపాక అభిప్రాయం. వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న తన పెత్తనమే కొనసాగాలనేది అమ్మాజీ పంతం. దీంతో అధికారులు కూడా వీరి మధ్య నలిగిపోతున్నారు.

నాయకుల ఆధిపత్య పోరు మధ్య రాజోలులో వైసీపీ మూడు ముక్కలైంది. ఇటీవలే అధిష్టానం ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ముగ్గురు నాయకుల్ని పిలిపించి సయోధ్య చేయాలని ప్రయతిస్తున్నారు వైసీపీ ముఖ్యనేతలు. మరి పవన్ శిష్యుడు అక్కడ సర్దుకుపోతారా, లేక పెత్తనంకోసం మంకుపట్టు పడతారా అనేది వేచి చూడాలి.



గొడ్డు మాంసం తినండి..బిజేపి సలహాలు !

ఫ్రెండ్షిప్‌ డే : నితీశ్‌, లాలూ.. స్నేహ శత్రువులు..!

ఎంతమాట..! చంద్రబాబుకు ఆవగింజంత కూడా సిగ్గు లేదా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజానగరంలో రాజా రెండోసారి?

జగన్ ట్రాప్‌లో చిక్కుకున్న బాబు..ప్లాన్ అదేనా!

అక్కడ పవన్‌కు కొంచెం కూడా ఛాన్స్ లేదుగా!

మాన్సాస్‌లో ట్విస్ట్‌లు..ఎంతదూరం తీసుకెళ్తారో?

ఆ 19 స్థానాల్లో లీడింగ్ మారిందా?

ఆ జిల్లా పరిషత్ ఫలితాల కోసం టీడీపీ ఆతృత...ప్లస్ ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>