MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/happy-birthday-tapsi-jhummandi-chottabuggala-sundaria122ec3b-94c4-45c2-9e85-4d8c42410bfb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/happy-birthday-tapsi-jhummandi-chottabuggala-sundaria122ec3b-94c4-45c2-9e85-4d8c42410bfb-415x250-IndiaHerald.jpgనేడు సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పుట్టిన రోజు. తక్కువ కాలంలో బాలీవుడ్ లో అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ భామ. వరుస అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది. తాప్సీకి సినీలోకం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది. tapsi birthday{#}Mammootty;dhanush;editor mohan;k raghavendra rao;New Zealand;School;job;software;Jhummandi Nadham;Pink;Heroine;Success;Tollywood;bollywood;Chitram;Telugu;Cinema;Indiaహ్యాపీ బర్త్ డే : ఝుమ్మంది సొట్టబుగ్గల సుందరి..!హ్యాపీ బర్త్ డే : ఝుమ్మంది సొట్టబుగ్గల సుందరి..!tapsi birthday{#}Mammootty;dhanush;editor mohan;k raghavendra rao;New Zealand;School;job;software;Jhummandi Nadham;Pink;Heroine;Success;Tollywood;bollywood;Chitram;Telugu;Cinema;IndiaSun, 01 Aug 2021 07:00:00 GMTతాప్సీ అనే పేరు ఎవరికి గుర్తుకురాకపోవచ్చేమో కానీ.. సొట్ట బుగ్గల సుందరి అంటే మాత్రం ఎవరైనా ఐడింటిఫై చేస్తారు. పాలరాతి శిల్పంలా... అప్పుడే వికసించిన పుష్పంలా నవ్వుతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునే గుణం తాప్సీకి మాత్రమే సొంతం. నేడు ఆ అందాల నటి పుట్టిన రోజు సందర్భంగా ఇండియా హెరాల్డ్ తాప్సీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది.

తాప్సీ పన్ను.. ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించింది. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పడు ఉత్తరాదిన అడుగుపెట్టి తన తలరాతను తానే మార్చుకుంటోంది. 2016లో పింక్ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇంకేముందీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. తాప్సీ తెలుగు మాత్రమే కాదు.. తమిళ, మళయాళ చిత్రాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

స్వస్థలం ఢిల్లీనే అయినా  తాప్సీ మాత్రం న్యూజిలాండ్ లో పుట్టింది. ఆగస్ట్ 1వ తేదీన 1987వ సంవత్సరం.. మోహన్ సింగ్, నిర్మల్జిత్ దంపతులకు జన్మించింది. దేశ రాజధానిలోని మాతా జై కౌర్ పబ్లిక్ స్కూల్ లో స్కూల్ విద్యను కంప్లీట్ చేసింది. వెంటనే గురు తేగ్ బహదూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విజయవంతంగా పూర్తి చేసి పట్టా అందుకుంది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసింది.

కానీ ఆమె గోల్ అది కాదు. మోడల్ అవ్వాలని చిన్ననాటి నుండి కలలు కనేది. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే ఆడిషన్స్ కు అటెండ్ అయ్యేది తాప్సీ. అలా ఓ టాలెంట్ షోలో ప్రదర్శన ఇచ్చి ఫుల్ టైమ్ మోడల్ గా సెలక్ట్ అయిపోయింది. ఇంకేముందీ సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆ తర్వాత పలు ప్రకటనల్లో యాక్ట్ చేసింది. పలు అందాల పోటీల్లో మెరిసి పురస్కారాలు సొంతం చేసుకుంది. రానురాను తాప్సీకి మోడలింగ్ పై ఆసక్తి సన్నగిల్లింది. సినిమా అవకాశాలపై దృష్టి సారించింది. అలా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కళ్లల్లో పడి.. ఝుమ్మంది నాదం చిత్రంలో హీరోయిన్ గా అవకాశాన్ని పొందింది తాప్సీ. 2010లో వచ్చిన ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా.. సొట్టబుగ్గల సుందరికి మాత్రం మంచిపేరే వచ్చింది. ఆ తర్వాత వరుసగా ఏడు చిత్రాల్లో నటించింది. తమిళంలో ధనుష్ తో ఆడుకాలమ్ లో జోడీ కట్టి హిట్ కొట్టింది. మళయాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన డబుల్స్ చిత్రంలో ఆయన సరసన నటించి భేష్ అనిపించుకుంది. ఆ తర్వాత తెలుగులో దరువు అనే చిత్రంలో యాక్ట్ చేసి పర్వాలేదనిపించింది.
చాష్మే బద్దూర్ సినిమాతో హిందీలో అడుగు పెట్టేసింది ఈ అమ్మడు. బాక్సాఫీస్ దగ్గర ఆచిత్రం బద్దలు కొట్టడంతో తాప్సీకి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పింక్ చిత్రం ఆమెను స్టార్ హీరోయిన్ ను చేసింది.








జోబైడెన్‌ ప్ర‌భుత్వంలో భార‌తీయ‌ అమెరిక‌న్‌..

మత్తుతో స్నేహం చేస్తారా..? ఈ నటుల లైఫ్ చూడండి..!

సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన ప్రముఖ నటి..!

హైదరాబాద్ మీదుగా ఇంత డ్రగ్స్ రవాణా అవుతుందా..?

రీ ఎంట్రీ ఇస్తానంటున్న హీరోయిన్ రచన...

సడన్ గా రానా యూఎస్ ట్రిప్.. . అందుకోసమేనా ?

స్మరణ: కోలీవుడ్ స్టార్ వివేక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

ముస్లిం మహిళల ఆత్మగౌరవం నిలబడింది..!

ఫేడ్ అవుట్ హీరోలకు ఇంత డిమాండ్ ఏంటి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>