PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pregnat932aea9f-cd5c-4a82-9b76-ca91eb2ea62b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pregnat932aea9f-cd5c-4a82-9b76-ca91eb2ea62b-415x250-IndiaHerald.jpg వైద్య శాస్త్ర చ‌రిత్ర‌లో నిత్యం ఏదో ఒక అద్భుతం జ‌రుగుతూనే ఉంటుంది. అస‌లు మ‌నిషి జీవితమే ఒక వింత. ఏక క‌ణ జీవితో మొద‌ల‌యి జంతువు ఆ త‌రువాత మ‌నిషిగా రూపొందాడు. ఇలాంటి ఆస‌క్తి క‌ర‌మైన ఎన్నో అంశాలు మానవ జీవ శాస్త్రంతో ఉన్నాయి. కొంద‌రికి ఒక్కో సారి ఈ ఆలోచ‌న వ‌చ్చే ఉంటుంది. అదేంటంటే మ‌నం మ‌నుషులుగా పుట్టడం ఏంటి మాట్లాడం, బ్రెయిన్ ను వాడి కొత్త వ‌స్తువుల‌ను సృష్టించ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. మ‌న శ‌రీరంలోని అనేక భాగాలు మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న ప్ర‌మేయం లేకుండానే నిరంత‌రం ఆగ‌కుండా, అల‌సిపోకుంPREGNAT{#}Israelతల్లి కడుపులో ఉన్న బిడ్డకు గర్భం..!తల్లి కడుపులో ఉన్న బిడ్డకు గర్భం..!PREGNAT{#}IsraelSun, 01 Aug 2021 13:27:00 GMT
  వైద్య శాస్త్ర చ‌రిత్ర‌లో నిత్యం ఏదో ఒక అద్భుతం జ‌రుగుతూనే ఉంటుంది. అస‌లు మ‌నిషి జీవితమే ఒక వింత. ఏక క‌ణ జీవితో మొద‌ల‌యి జంతువు ఆ త‌రువాత మ‌నిషిగా రూపొందాడు. ఇలాంటి ఆస‌క్తి క‌ర‌మైన ఎన్నో అంశాలు మానవ జీవ శాస్త్రంతో ఉన్నాయి. కొంద‌రికి ఒక్కో సారి ఈ ఆలోచ‌న వ‌చ్చే ఉంటుంది. అదేంటంటే మ‌నం మ‌నుషులుగా పుట్టడం ఏంటి మాట్లాడం, బ్రెయిన్ ను వాడి కొత్త వ‌స్తువుల‌ను సృష్టించ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. మ‌న శ‌రీరంలోని అనేక భాగాలు మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న ప్ర‌మేయం లేకుండానే నిరంత‌రం ఆగ‌కుండా, అల‌సిపోకుండా ప‌ని చేస్తుంటాయి.


  ఇలా అనేకమైన మ‌న శ‌రీరానికి సంబంధించిన విష‌యాలు మ‌నకు తెలియ‌వు. అలాగే ఒక మహిళ ఓ బిడ్డికు జ‌న్మ‌నివ్వ‌డం మ‌న‌కు చాలా చిన్న విష‌యం. కానీ ఓ ప్రాణం ఇంకో ప్రాణానికి రూపం పోయ‌డం చాలా అద్భుతం. అయితే సాధార‌ణంగా మహిళ గర్భవతి అవుతారు ఆ త‌రువాత‌ బిడ్డకు జన్మనివ్వడం కూడా మామూలే విష‌యమే. కానీ.. పుట్టిన బిడ్డ కడుపులో మరో శిశువు ఉంటే..? అదెలా సాధ్యం అనుకుంటున్నారా.. అందుకే జీవ‌శాస్త్రం అంతుబ‌ట్ట‌నిది, వింతైన‌ది కూడా అనుకోవాలి. వైద్య శాస్త్రంలో మిరాకిల్ జ‌రుతుంది అలాంటి మిరాకిల్ ఎక్క‌డ జ‌రిగింది అనే వివ‌రాలు తెలుసుకుందాం.


   గర్భం దాల్చిన ప్ర‌తి మ‌హిళ ప్ర‌తి మూడు నెలలకు ఒకసారి ఆసుపత్రికి వెళ్లడం.. స్కానింగ్ తీయించుకోవడం అనేది అంతటా జరిగే విష‌యం. దీని ద్వారా క‌డుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల తెలుసుకోవడంతో పాటు ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. దీని ద్వారా వెంటనే ఆ స‌మ‌స్య‌ను గుర్తించి వైద్యులు పరిష్కరిస్తుంటారు. ఇదే విధంగా ఇజ్రాయిల్ లోని ఓ మహిళ కూడా చెక‌ప్ కోసం ఆసుపత్రికి వెళ్లింది. అంతా బాగానే ఉంది కానీ.. కడుపులో ఉన్న బిడ్డ పొట్టభాగం కాస్త ఎత్తుగా ఉన్న‌ట్టు కనిపించింది.  కారణం ఏంటన్నది పూర్తిగా గుర్తించలేకపోయారు వైద్యులు. డెలివరీ అయిన త‌రువాత‌ చూడాలని అనుకున్నారు.



 అయితే, డెలివరీ స‌మ‌యం నాటికి ఆ బిడ్డ కడుపు మరికాస్త ఎత్తుగా కనిపించింది. ప్రసవం త‌రువాత ఆ బేబీ ఆడబిడ్డ అని తేలింది. మరి ఆమె పొట్ట భాగం ఎత్తుగా ఉండడానికి కారణమేంటీ  అని తెలుసుకోవ‌డానికి  ఆ చిన్న పాప‌కు స్కానింగ్ చేశారు. ఆ స్కానింగ్ రిపోర్టు చూసిన వైద్యులకు ఒక్క‌సారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ పసిగుడ్డు కడుపులో పిండం ఉండ‌డంతో, ఒక్కటి కాదు.. రెండు పిండాలు క‌నిపించాయి.


ఇది చూసిన వైద్యులు ఆశ్చర్యంతో పాటు ఆందోళనకు గుర‌య్యారు. దీంతో.. బేబీకి ఆపరేషన్ చేసి ఆ రెండు పిండాలను తీసేశారు. ప్రస్తుతానికి బేబీకి ఏ సమస్య లేదని అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు చెప్పారు. అయితే.. ఇలాంటి వింత కేసులు దాదాపు 5 లక్షల మందికి ఒకరిలో కనిపిస్తాయని చెప్పారు వారు. కవల పిండాలు  ఏర్పడినప్పుడు ఒకదానిలోకి మరొకటి వెళ్లిపోయే అవకాశం ఉంటుందని ఈ కేసులో కూడా అలాగే జరిగి ఉంటుంద‌ని వైద్య‌నిపుణులు భావిస్తున్నారు.




పెగాసస్ స్పైవేర్ పై నేడు సుప్రీంకోర్టు లో విచారణ

వాడ‌కం బాగుంది కానీ వాత‌లే ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>